ETV Bharat / health

ముఖం వాచినట్టు కనిపిస్తోందా? - అయితే మీరు ఈ సమస్యతో బాధపడుతున్నట్టే! - Facial puffiness and fatty liver - FACIAL PUFFINESS AND FATTY LIVER

Face Swelling: అప్పుడప్పుడూ ముఖం వాచినట్లు కపించడం సాధారణం. మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. అయితే.. చాలా మంది దీనిని పెద్దగా పట్టించుకోరు. కానీ ఇది ఓ​ సమస్యతో బాధపడుతున్నారని చెప్పే లక్షణమని నిపుణులు అంటున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

Face Swelling
Face Swelling (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 3:10 PM IST

Is Swelling of the face Causes for Fatty Liver Disease: కొన్నిసార్లు చాలా మందికి ముఖం ఉబ్బినట్టుగా కనిపిస్తుంటుంది. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బులతో బాధపడేవారు వేసుకునే మందులతో కొందరికి ముఖం ఉబ్బొచ్చు. ఇతరత్రా సమస్యల కోసం స్టిరాయిడ్లు వాడేవారిలోనూ ఇలా కనిపిస్తుంటుంది. అయితే.. ఇవి మాత్రమే కాకుండా ముఖం ఉబ్బడం.. ఫ్యాటీ లివర్​ సమస్యతో బాధపడుతున్నారని చెప్పే ఓ లక్షణం కూడా కావొచ్చని నిపుణులు అంటున్నారు. ఇదే కాకుండా మరికొన్ని లక్షణాలు కూడా ఫ్యాటీ లివర్​ సమస్యకు సంకేతమని అంటున్నారు. అవి ఇప్పుడు చూద్దాం..

మన శ‌రీరంలోని అతి ముఖ్యమైన అవ‌యవాల్లో కాలేయం(Liver) ఒకటి. ఇది శరీరానికి కావాల్సిన హార్మోన్లను రిలీజ్ చేయడం సహా.. వ్యర్థాలను బయటకు పంపేందుకు సహకరిస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావటానికి, రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉండటానికీ కాలేయం సాయం చేస్తుంది. ఇలా ఎన్నెన్నో పనుల్లో లివర్ పాలు పంచుకుంటుంది. ఇలాంటి కాలేయానికి ఇప్పుడు కొవ్వు పెద్ద సమస్యగా మారుతోంది. అందుకు కారణం.. ప్రస్తుతం ఎంతోమంది ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్​తో బాధపడుతుండటమే. అయితే, దీనిపట్ల జాగ్రత్తగా వ్యవహారించకపోతే ప్రాణాలకే ప్రమాదమంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే.. ముఖం ఉబ్బినట్లు అనిపించడంతో పాటు ఈ లక్షణాలు కనిపిస్తాయంటున్నారు.

ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుంది : మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నట్లయితే.. అప్పుడు కాలేయం అల్బుమిన్ అనే ప్రోటీన్‌ను తగినంతగా ఉత్పత్తి చేయలేకపోతుంది. అల్బుమిన్ రక్తంలో ద్రవాన్ని నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఒకవేళ అల్బుమిన్ తక్కువగా ఉంటే.. ద్రవం రక్తనాళాల నుంచి కణజాలంలోకి లీక్ అవుతుంది. ఫలితంగా మీ ముఖం కొద్దిగా ఉబ్బినట్లు కనిపించడాన్ని గమనించవచ్చంటున్నారు నిపుణులు. 2022లో జర్నల్ ఆఫ్ క్లినికల్ హెపటాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నట్లైతే ముఖం ఉబ్బే ప్రమాదం 30 శాతం అధికంగా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని షాంఘైలోని జియా టాంగ్ విశ్వవిద్యాలయం అనుబంధిత రుయిజిన్ ఆసుపత్రిలోని హెపటాలజీ విభాగంలో ప్రొఫెసర్​ డాక్టర్​ డేవిడ్ లీ పాల్గొన్నారు.

ఫ్యాటీ లివర్​ సమస్యా? - ఒక్క స్పూన్​తో చెక్ పెట్టండి!

దద్దుర్లు : చర్మంపై దద్దుర్లు కూడా ఫ్యాటీ లివర్​ సమస్యతో బాధపడుతున్నారని తెలిపే ఒక సంకేతమని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య ఉన్నప్పుడు మీ శరీరం కొన్ని పోషకాలను సమర్థవంతంగా గ్రహించుకోలేదని.. ఫలితంగా చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయంటున్నారు. ముఖ్యంగా నోటి చుట్టూ చిన్న గడ్డలు ఏర్పడి చికాకుకు దారితీస్తుందంటున్నారు.

డార్క్ స్కిన్ : ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ ఇన్సులిన్ నిరోధకతను పెంచడానికీ దోహదం చేస్తుంది. అంటే.. మీ శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోలేదు. ఇది మీ శరీరంలో అదనపు ఇన్సులిన్ ఏర్పడటానికి దారితీస్తుంది. ఫలితంగా మెడ దగ్గర చర్మం నల్లగా మారడం, స్కిన్​పై మడతలు ఏర్పడడాన్ని గమనించవచ్చంటున్నారు నిపుణులు.

దురద : ముఖంపై దురద ఉన్నా కూడా ఫ్యాటీ లివర్ సంకేతంగా చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. ఎలర్జీ కూడా తీవ్రంగా ఉంటుందట. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే అలర్ట్ అయ్యి డాక్టర్​ను సంప్రదించాలని సూచిస్తున్నారు.

చర్మం ఎరుపు రంగులోకి: ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే చర్మం ఎర్రగా మారుతుందని.. పైగా కదిపోయినట్లుగా కనిపిస్తోందంటున్నారు నిపుణులు.

కామెర్లు : కామెర్లు కూడా ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ ఉందని తెలిపే సంకేతాల్లో ఒకటని చెబుతున్నారు నిపుణులు. కామెర్లు వచ్చినప్పుడు మీ చర్మం, కళ్లలోని తెల్లపొర పసుపు రంగులోకి మారిపోతుంది. బైలిరుబిన్ అనే పదార్థం రక్తంలో అధికంగా పేరుకుపోయినప్పుడు ఈ సమస్య తలెత్తుతుందంటున్నారు.

రోసేసియా : మీకు రోసేసియా ఉన్నప్పుడు మీ ముఖంపై చిన్న ఎర్ర రక్తనాళాలు లేదా తెల్లటి గడ్డలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మీలో ఇలాంటి లక్షణం కనిపిస్తే అది కూడా ఫ్యాటీ లివర్ సమస్య ఉందని తెలిపే హెచ్చరిక కావొచ్చంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

'ఫ్యాటీ లివర్' సమస్య వేధిస్తోందా?.. వాటికి దూరంగా.. వీటికి దగ్గరగా ఉంటే చాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.