ETV Bharat / health

చెమటలు పట్టడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? - నిపుణులు ఏమంటున్నారో తెలుసా? - Is Sweating Good Or Bad For Skin - IS SWEATING GOOD OR BAD FOR SKIN

Is Sweating Good Or Bad For Skin : వేడికి చెమటలు పట్టడం సహజం! అలాగే భయం, టెన్షన్, ఆందోళన, సూర్యకాంతి పెరిగినప్పుడు, శారీరక శ్రమ పెరిగినప్పుడు.. ఇలా మరికొన్ని సందర్భాల్లో కొందరికి చెమటలు వస్తుంటాయి. అయితే, చెమటలు పట్టడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Is Sweating Good Or Bad For Skin
Sweating Health Benefits (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 31, 2024, 3:17 PM IST

Sweating Health Benefits And Side Effects : అందరికీ దాదాపు ఏదో ఒక సందర్భంలో చెమటలు వస్తుంటాయి. అవి వచ్చినప్పుడు చిరాగ్గా, అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. దాంతో చాలా మంది ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తుంటారు. మరి.. చెమటలు రావడం ఆరోగ్యానికి మంచిదేనా? లేదంటే హానికరమా? అనే సందేహాలు చాలా మందిలో వస్తుంటాయి. మరి.. ఈ సందేహాలకు నిపుణులు ఎలాంటి సమాధానాలు చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చెమట వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :

  • శరీరానికి చెమటలు పట్టడం అనేది ఆరోగ్యానికి చాలా విధాలా మేలే చేస్తుందని సూచిస్తున్నారు దిల్లీకి ప్రముఖ డెర్మటాలజిస్ట్ మహాజన్. చెమటలు బాక్టీరియా పెరుగుదలను తగ్గించి.. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడతాయని ఆయన సూచిస్తున్నారు.
  • అలాగే.. 2016లో 'జర్నల్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డెర్మటాలజీ'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. చెమట చర్మం pH ను తగ్గిస్తుందని, ఇది బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుందని కనుగొన్నారు.
  • చెమటలు స్వేధ రంధ్రాలలో పేరుకుపోయిన అదనపు ధూళి, నూనె, మలినాలు వంటివి తొలగించడంలో సహాయపడతాయి. అలాగే చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికీ చెమట హెల్ప్ చేస్తుంది. తద్వారా మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలు తలెత్తకుండా కూడా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు. ఫలితంగా చర్మ ఆరోగ్యమూ మెరుగుపడుతుందని చెబుతున్నారు.
  • చెమట ద్వారా శరీరంలోని అధిక ఉప్పు బయటికి వెళ్లిపోతుంది. అలాగే ఎముకలకు సరిపడినంత కాల్షియం అందుతుంది. తద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా జాగ్రత్తపడచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

నిద్రలో చెమటలు పడుతున్నాయా? - ఉక్కపోత వల్ల అని లైట్​ తీసుకుంటే డేంజర్​లో పడ్డట్టే!

  • చెమట వల్ల చర్మానికి రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా కనిపించేలా చేస్తుందంటున్నారు.
  • చెమట శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను చల్లబరుస్తుంది. అలాగే మీ చర్మాన్ని హైడ్రేట్, తేమగా ఉంచుతుందని డాక్టర్ మహాజన్ సూచిస్తున్నారు. అయితే.. ఇలా చెమట పట్టడం మంచిదే అయినా.. అధికంగా చెమటలు పట్టడం మాత్రం ఆరోగ్యానికి హాని కలిగించవచ్చంటున్నారు.

చెమట వల్ల కలిగే దుష్ప్రభావాలు :

  • అధికంగా చెమటలు పట్టడం వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందంటున్నారు. వాతావరణంలోని దుమ్ము- ధూళి చెమటతో కలిసి చర్మ రంధ్రాల్లోకి చేరడం వల్ల మొటిమలు, మచ్చలు ఏర్పడతాయంటున్నారు.
  • అలాగే.. చెమటలో ఉండే ఖనిజ లవణాలు, లాక్టిక్ యాసిడ్ కాలక్రమేణా సిరామైడ్లు, కొవ్వు ఆమ్లాలు, హైలురోనిక్ యాసిడ్ వంటి సహజ తేమ కారకాల స్థాయిలను తగ్గిస్తాయి. ఫలితంగా చర్మం పొడిగా మారడం, చికాకు వంటి సమస్యలు తలెత్తవచ్చంటున్నారు.
  • ఎక్కువగా చెమట పట్టడం లేదా అస్సలు చెమట పట్టకపోవడం కూడా ఆందోళన కలిగిస్తుందంటున్నారు వైద్యులు. ఎక్కువ చెమట పట్టడాన్ని హైపర్ హైడ్రోసిస్ అని కూడా పిలుస్తారు.
  • ఇది.. అథ్లెట్స్ ఫుట్, బాడీ దుర్వాసన, క్లామీ లేదా చెమటతో కూడిన అరచేతులు వంటి ఫంగల్ ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతుందని డాక్టర్ మహజన్ సూచిస్తున్నారు.
  • కాబట్టి, అధికంగా చెమటలు పడుతుంటే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ముఖంపై చెమట ఎక్కువ పడుతుందా? జిడ్డుగా కనిపిస్తోందా? ఈ టిప్స్ ఫాలో అయితే టోటల్ సెట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.