ETV Bharat / health

మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, డైలీ ఈ డైట్​ పాటించాలట - ICMR కీలక సూచనలు! - ICMR Dietary Guidelines

author img

By ETV Bharat Health Team

Published : Sep 14, 2024, 12:27 PM IST

Healthy Diet India 2024 : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ సమతుల ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కానీ.. సమతుల ఆహారం అంటే ఏది? అన్నది చాలా మందికి తెలియదు. అందుకే.. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR) ఓ డైట్ సూచిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Healthy Diet India
Healthy Diet India 2024 (ETV Bharat)

ICMR Dietary Guidelines 2024 : ప్రస్తుత కాలంలో చాలా మంది ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కాలంతోపాటు పరుగులు తీస్తున్నారు. దీంతో సమయం దొరికినప్పుడు వేళ కానీ వేళలో ఏదో ఒకటి తింటున్నారు. కానీ.. ఇలా టైమ్​కు సమతుల ఆహారం తీసుకోకపోవడం వల్లే మనకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. మంచి ఆరోగ్యం కోసం ఏం తినాలి? అనే విషయంపై "డైటరీ గైడ్‌లైన్స్‌ ఫర్‌ ఇండియన్స్‌" పేరుతో జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) ఒక నివేదికను విడుదల చేసింది. (రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి). ఇందులో ICMR నిపుణుల బృందం ముఖ్యమైన సూచనలు చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

మనం డైలీ తీసుకునే భోజనంలో.. కనీసం 8 రకాల ఆహార పదార్థాలు ఉండాలట. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇతరాలు కలిపి 500 గ్రాముల వరకు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో అందుబాటులో ఉండే పండ్లు 100 గ్రాములు తప్పకుండా ఉంటే మంచిదని పేర్కొన్నారు.

ఒక వ్యక్తి రోజుకి రెండువేల క్యాలరీల ఆహారాన్ని తీసుకోవాలట. ఆహారంలో తృణధాన్యాలు, పప్పులు, నాన్​వెజ్​, గుడ్లు, నట్స్​, పాలు, పెరుగు ఉండేలా చూసుకోవాలి. ఇందులో మన ఆరోగ్యానికి మేలు చేసే అన్ని రకాల పోషకాలు ఉంటాయి. అయితే.. ఇవన్నీ ఒకేసారి తినడం కష్టం. కాబట్టి, మూడు పూటలా ఇవి తినేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

క్యాలరీల కోసం తినాల్సిన ఆహార పదార్థాలు :

  • 250 గ్రాముల తృణధాన్యాలు
  • 400 గ్రాముల కూరగాయలు
  • 100 గ్రాముల పండ్లు
  • 85 గ్రాముల పప్పులు లేదా మాంసం లేదా కోడిగుడ్డు
  • 35 గ్రాముల పప్పుగింజలు
  • 27 గ్రాముల కొవ్వు పదార్థాలు లేదా నూనె
  • చక్కెరల ద్వారా అందే క్యాలరీలు 5%లోపే ఉండాలని ఐసీఎంఆర్​ నిపుణుల బృందం సూచిస్తున్నారు.

ఇతర ముఖ్యమైన సూచనలు :

  • ఒక వ్యక్తి రోజుకు సుమారు 8 గ్లాసులు (సుమారు రెండు లీటర్లు) నీళ్లు తాగాలి.
  • కాఫీ ఎక్కువగా తాగితే రక్తపోటు సమస్య వస్తుంది. కాబట్టి, కాఫీ మితంగా తీసుకోవాలి. ఈ నియమం టీకి కూడా వర్తిస్తుంది.
  • అలాగే భోజనానికి గంట ముందు, గంట తరువాత టీ, కాఫీలు తాగకూడదు. పాలు లేని గ్రీన్, బ్లాక్‌ టీ తాగడం మంచిది.
  • చాలా మంది స్నాక్స్‌.. పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్‌ఫుడ్‌ అధికంగా తింటున్నారు. వీటివల్ల అనారోగ్యకరమైన బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి, వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండడం మంచిది.
  • అలాగే కూల్‌డ్రింక్స్​ తక్కువగా తీసుకుంటే మంచిదని ఐసీఎంఆర్​ నిపుణుల బృందం తెలిపింది.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

నీటికి కూల్​ డ్రింక్స్​ ప్రత్యామ్నాయం కాదు- అవి ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికే ముప్పు!

మీకు వచ్చే రోగాల్లో 56 శాతం - కేవలం తిండి ద్వారానే! - ICMR కీలక సూచనలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.