ETV Bharat / health

పని చేస్తుంటే నిద్ర వస్తోందా?- అయితే ఈ అలవాట్లకు దూరంగా ఉండండి! - How to Stop Falling Asleep at Work

How to Stop Falling Asleep at Work : పని వేళల్లో నిద్ర మత్తు కమ్మేస్తోందా? ఎంత కంట్రోల్ చేసినా నిద్ర ఆగడం లేదా? అయితే, ఈ కారణాల వల్ల నిద్ర వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

How to Stop Falling Asleep at Work
How to Stop Falling Asleep at Work (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : Sep 28, 2024, 3:18 PM IST

How to Stop Falling Asleep at Work : పని వేళల్లో నిద్ర వస్తే ఎంతో చిరాకును తెప్పిస్తుంది. మధ్యాహ్న భోజనం చేసిన తరవాత శరీరం ఏమాత్రం పని చేసేందుకు సహకరించదు. దీంతో పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేరు. ఇది చాలా మందిలో మామూలుగా ఉండే సమస్యే. కానీ రోజంతా ఇలాగే ఉంటే ఎలా ఉంటుంది? చాలా ఇబ్బందిగా ఉంటుంది కదూ. అసలు ఈ సమస్య తలెత్తడానికి కారణాలేంటి! నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం : రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. భోజనం చేసిన 3 నుంచి 4 గంటల తరవాత నిద్రకు ఉపక్రమించాలని సూచిస్తున్నారు. వీలైనంత తొందరగా రాత్రి భోజనం చేసేలా ఏర్పాటు చేసుకోవాలని సూచనలు చేస్తున్నారు. లేట్‌ నైట్స్‌ ఏ ఆహారం అయినా తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎలక్ట్రానిక్‌ పరికరాల వాడకం : ప్రస్తుతం కాలంలో చాలామంది ఎలక్ట్రానిక్‌ పరికరాలతోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. అవసరానికి మించి వీటిపై తమ అముల్యమైన సమయాన్ని వెచ్చిస్తున్నారు. తక్కువ వెలుతురులో ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఉపయోగించడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత మేరకు ఎలక్ట్రానిక్‌ పరికరాల వాడకాన్ని భోజన సమయానికి ముందు వరకు పరిమితం చేసుకోవాలని సూచిస్తున్నారు.

సరైన నిద్ర కూడా అవసరమే! : మంచి నిద్ర కావాలంటే మన చుట్టూ ఉండే పరిసరాలు కూడా బాగుండాలి. రోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా చూసుకోవాలి. పడుకునే ముందు గదిలోకి వెలుతురు లేకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో నిద్ర బాగా పడుతుందంటున్నారు.

ఆల్కహాల్‌ వినియోగం : ఆల్కహాల్‌ తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమితో శరీర ఆరోగ్యవ్యవస్థ మీద ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఏ పనిని సంపూర్ణంగా చేయలేరని, ఆల్కహాల్ కు ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాఫీలు, టీలు రాత్రి వద్దు : కాఫీ, టీల్లొ ఉండే కెఫిన్‌ నిద్రను దూరం చేస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. రాత్రి సమయంలో వీటిని తాగడం వల్ల నిద్ర రాదు. భోజనం తర్వాత కాఫీ, టీలు తాగకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

ఆరోగ్యవంతమైన నిద్ర కోసం చిట్కాలు

  • రాత్రి పడుకునే ముందు పుస్తకం చదవటం అలవాటు చేసుకోండి.
  • పసుపు కలిపిన పాలను నిద్రపోయే ముందు తాగండి. దీంతో హాయిగా నిద్రపడుతుంది.
  • కచ్చితంగా 6 నుంచి 8 గంటల సమయం వరకూ నిద్రపోవాలి. దీంతో చిరాకు, అలసట, నీరసం దరి చేరవు. రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నోటిపూతతో ఇబ్బంది పడుతున్నారా?- ఓసారి ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి - Natural Remedies For Mouth Ulcers

శారీరక శ్రమ లేకపోతే పిల్లల భవిష్యత్తుకు ప్రమాదమా?- పరిశోధనలు ఏం చెబుతున్నాయి? - Heart Attack Risks In Children

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.