ETV Bharat / health

మీకంటే ముందు మీ నోటి దుర్వాసన హాయ్ చెబుతోందా? - ఇలా గుడ్​బై చెప్పండి! - Ways To Control Bad Breath

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 13, 2024, 2:37 PM IST

Tips To Stop Bad Breath : నోటి దుర్వాసన సమస్య చాలా మందిని బాధ పెడుతుంటుంది. దీన్ని తగ్గించుకోవడానికి మార్కెట్‌లో దొరికే ఏవేవో మౌత్‌వాష్‌లు, లిక్విడ్స్ వాడుతుంటారు. అయితే.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే బ్యాడ్‌ బ్రీత్‌ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Bad Breath
Tips To Stop Bad Breath (ETV Bharat)

How To Stop Bad Breath : నోటి నుంచి దుర్వాసన వస్తుంటే.. ఎదుటి వాళ్లు మొహం తిప్పుకుని మాట్లాడుతుంటారు. ఇలాంటి పరిస్థితిని చాలా మంది ఫేస్‌ చేస్తుంటారు. దీనివల్ల చాలాసార్లు ఆత్మ విశ్వాసం కూడా దెబ్బతింటుంది. మీరు కూడా ఈ పరిస్థితిని ఫేస్ చేస్తున్నారా? అయితే.. ఎటువంటి లిక్విడ్స్, మౌత్‌వాష్‌ వాడకుండానే బ్యాడ్‌ బ్రీత్‌ను ఎలా కంట్రోల్‌ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

దాల్చిన చెక్క :
బ్యాడ్‌ బ్రీత్‌ కంట్రోల్‌ అవ్వడానికి దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్కలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేసి దుర్వాసనను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు నోట్లో చిన్న దాల్చిన చెక్క ముక్కను వేసుకుని నమలాలని సూచిస్తున్నారు.

అలర్ట్ : మీకు ఈ అలవాట్లు ఉన్నాయా? - అయితే, మీ బ్రెయిన్​కు ముప్పు పొంచి ఉన్నట్టే!

కొబ్బరిపాలు :
కొబ్బరిని కట్‌ చేసి మిక్సీ పట్టండి. తర్వాత అందులో నుంచి కొబ్బరి పాలు వస్తాయి. వీటిని పచ్చిగా లేదా కాచి తాగొచ్చు. ఇలా తాగడం వల్ల నోటి దుర్వాసన సమస్య తగ్గుతుందట.

గజనిమ్మ :
నోటి దుర్వాసన సమస్య ఎక్కువగా ఉన్నవారు గజనిమ్మకాయను చిన్నముక్కలుగా కట్‌ చేసి.. నోట్లో బుగ్గన పెట్టుకుని చప్పరించండి. ఇలా చేయడం వల్ల నోరు శుభ్రమవడంతో పాటు, దుర్వాసన సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

కొలెస్ట్రాల్​ తగ్గాలని మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ - ఈ నేచురల్​ పద్ధతులతో ఇట్టే కరిగిపోద్ది!

లవంగాలు :
లవంగాలలో యూజినాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అలాగే లవంగాలలోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చిగుళ్ల వాపు వంటి సమస్యలను తగ్గించి నోటి దుర్వాసనను దూరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే లవంగాలను రోజూ అప్పుడప్పుడు నములుతుండాలని సూచిస్తున్నారు.

2014లో 'జర్నల్ ఆఫ్ డెంటల్ రీసెర్చ్‌' జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. లవంగాలను నమలడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుందని అలాగే.. నోటిలో తాజాదనం పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో లఖ్‌నవూలోని బాబు బనారసి దాస్ డెంటల్ కాలేజ్ & హాస్పిటల్‌కు చెందిన 'డాక్టర్ నవీన్ కుమార్ అరోరా' పాల్గొన్నారు. నోటి దుర్వాసన తగ్గడానికి లవంగాలు ప్రభావవంతంగా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు.

నీళ్లు ఎక్కువగా తాగండి :
బ్యాడ్‌ బ్రీత్‌ సమస్యతో బాధపడేవారు తరచూ నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నోరు పొడిబారినట్లు అనిపించినప్పుడల్లా, వాటర్‌ తాగాలి. సోడా వంటివి తాగకూడదు! ఎందుకంటే, ఇవి నోటిని మరింత పొడిగా చేస్తాయట.

గోరువెచ్చని ఉప్పు నీటితో :
సాల్ట్‌ వాటర్‌తో నోటిని పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసనను తరిమికొట్టవచ్చు. దీనికోసం ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిలో 1/4 నుంచి 1/2 టీస్పూన్ వరకు ఉప్పును కలిపి, 30 సెకన్ల పాటు పుక్కిలించి ఉమ్మివేయండి. ఇలా డైలీ రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నోరు లేదా ముక్కు నుంచి దుర్వాసన వస్తోందా? - ఈజీగా తగ్గించుకోండిలా!

ఊహాతీతం : ఒక సిగరెట్​ తాగడం పూర్తయ్యేలోపు - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.