How to Stop Baldness : ప్రస్తుత రోజుల్లో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఒకప్పుడు 50 సంవత్సరాలు దాటాక బట్టతల వచ్చేది కానీ, ప్రస్తుతం చిన్న వయసులోనే వస్తోంది. అయితే.. బట్టతల రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆహారపు అలవాట్లు, విపరీతమైన కాలుష్యం, UV కిరణాలకు గురికావడం, విషపూరిత రసాయనాల వాడకం.. వంటి అనేక కారకాలు జుట్టు రాలడానికి కారణమవుతున్నాయి.
అయితే.. కొందరికి వంశపారంపర్యంగా బట్టతల వస్తుంది. మీ వంశంలో కూడా బట్టతల ఉంటే.. దాన్ని ఆపడం దాదాపుగా కష్టం. కానీ.. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా.. నెత్తిపై వెంట్రుకలు(Hair Fall) త్వరగా ఊడిపోకుండా చూసుకోవచ్చని సూచిస్తున్నారు. అంటే.. త్వరగా వచ్చే బట్టతలను వాయిదా వేయడం అన్నమాట! మరి.. అదెలా సాధ్యమో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. జుట్టు రాలడం అనేది తల్లిదండ్రుల ఇరువైపుల నుంచీ వారసత్వంగా వస్తుంది. పేరెంట్స్‌లో ఎవరివైపునైనా జుట్టు రాలి బట్టతల వచ్చిన వారు ఉంటే.. అది తమ వారసులకు కూడా వారసత్వంగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది మగాళ్లలోనే కాదు.. కొంతమంది మహిళల్లో కూడా లైట్‌గా కనిపిస్తుంది. మగాళ్లలో ముందు, మధ్యలో వెంట్రుకలు ఊడిపోయి బట్టతల కనిపిస్తుంది. ఆడవాళ్ల విషయానికి వస్తే జుట్టు సైడ్స్‌లో బట్టతల పాచెస్ కలిగి ఉంటారు. ఈ సమస్యను చాలా కాలం వాయిదా వేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
బట్టతల త్వరగా రాకుండా ఉండడానికి పాటించాల్సిన కొన్ని టిప్స్..
- తమ వంశంలో బట్టతల ఉన్నవారికి.. బట్టతల రావడం అనివార్యం. అయితే, ఈ పరిస్థితి త్వరగా రాకుండా కాపాడుకోవడానికి ఒక అవకాశం ఉంది.
- ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం. తద్వారా వేగంగా బట్టతల రావడాన్ని ఆపవచ్చు.
- హెయిర్ స్ట్రాండ్స్ ప్రొటీన్‌తో తయారవుతాయి. కాబట్టి, మీ డైట్‌లో ప్రొటీన్ లోపించకుండా చూసుకోవాలి.
- ఎందుకంటే జుట్టు రాలడానికి మీ వంశపారంపర్య కారణానికి ప్రొటీన్ లోపం చాలా ప్రభావం చూపుతుంది.
- అందుకే బట్టతల త్వరగా రాకుండా ఉండడానికి మీ డైట్‌లో తప్పనిసరిగా నట్స్, చీజ్, చేపలు, గుడ్లు, మాంసం, చికెన్ వంటి ప్రొటీన్-రిచ్ ఫుడ్స్‌ను చేర్చుకోవాలి.
- ఈ ఆహారాలు బట్టతలని తగ్గించడమే కాకుండా మీ జుట్టును బలంగా, మృదువుగా చేస్తాయి. అంతే కాకుండా మీరు మీ జుట్టును రోజూ సున్నితంగా దువ్వుకోవచ్చు.
- బట్టతల త్వరగా రాకుండా ఉండడానికి మీరు చేయాల్సన మరో పని ఏంటంటే.. జట్టు బిగుతుగా ఉండకుండా చూసుకోవాలి. కాబట్టి బిగుతుగా ఉండే పోనీటైల్ లేదా మీ జుట్టుపై ఎక్కువ ఒత్తిడిని కలిగించే ఇతర హెయిర్‌స్టైల్ చేయడం మానుకోవాలి.
- తలకు రెగ్యులర్ మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీని వల్ల కూడా బట్టతల ఆలస్యం అవుతుంది.
- ఇన్ని జాగ్రత్తలు, చర్యలు తీసుకున్నప్పటికీ జుట్టు రాలడం తగ్గకపోతే.. మీరు వైద్యుడిని సంప్రదించడం బెటర్ అంటున్నారు నిపుణులు.