ETV Bharat / health

ముఖం, మెడమీద పులిపిర్లు ఇబ్బందిగా ఉన్నాయా - ఈ సింపుల్​ చిట్కాలతో క్లియర్ చేసేయండి! - HOW TO RID WARTS NATURALLY TELUGU

How To Rid Warts Naturally : మీరు పులిపిర్ల సమస్యతో బాధపడుతున్నారా? ఎన్ని రకాల ట్రీట్‌మెంట్స్‌ తీసుకున్నా కూడా అవి పూర్తిగా తొలగిపోవట్లేదా? అయితే, ఈ స్టోరీ మీ కోసమే! కొన్ని టిప్స్ పాటించడం ద్వారా.. సహజ సిద్ధంగానే వీటిని మాయం దూరం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Rid Warts Naturally
How To Rid Warts Naturally
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 1:38 PM IST

Updated : Mar 21, 2024, 12:52 PM IST

How To Rid Warts Naturally : మెడ, ముఖం, వీపు, చేతులు.. ఇలా శరీర భాగాల్లో పులిపిర్లతో ఇబ్బంది పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. నిజానికి వీటి వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకపోయినా.. ఇవి అందాన్ని మాత్రం దెబ్బతీస్తాయి. కొంత మంది శరీరంపై పులిపిర్లు ఎక్కువగా ఏర్పడటం వల్ల ఆత్మస్థైర్యం కోల్పోతుంటారు. వీటిని తొలగించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే.. కొన్ని టిప్స్‌ పాటించడం వల్ల పులిపిర్ల సమస్యను శాశ్వతంగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

పులిపిర్లు ఎందుకు ఏర్పడుతాయి ?
పులిపిర్లు హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వల్ల వస్తాయి. ఈ వైరస్‌ శరీరంలోకి చేరిన తర్వాత అదనపు కణాలు పెరిగేలా చేస్తుంది. కొంత మందిలో పులిపిర్లు చిన్నగా ఏర్పడితే, ఇంకొంత మందిలో కొద్దిగా పెద్దగా ఉంటాయి.

అల్లంతో పులిపిర్లు మాయం :
మనందరి ఇళ్లలోనూ అల్లం కచ్చితంగా ఉంటుంది. దీనిని వంటలు రుచిగా ఉండటానికి కూరల్లో వేస్తుంటాం. అయితే, అల్లంతో పులిపిర్లను మాయం చేసుకోవచ్చని మీకు తెలుసా ? అది ఎలా అంటే, ముందుగా ఒక అల్లం ముక్కను తీసుకుని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని చర్మంపై ఎక్కడైతే పులిపిర్లు ఉన్నాయో అక్కడ పెట్టుకోవాలి. ఇలా రోజుకి రెండు సార్లు అల్లం పేస్ట్‌ను పులిపిర్ల దగ్గర పెట్టుకోవడం వల్ల కొన్ని రోజుల్లోనే అవి రాలిపోతాయని నిపుణులంటున్నారు. 2022లో ప్రచురించిన 'Journal of Complementary and Integrative Medicine' నివేదిక ప్రకారం, పులిపిర్లతో బాధపడుతున్న వారు అల్లం పేస్ట్‌ను రోజుకి రెండు సార్లు అప్లై చేసుకోవడం వల్ల వాటి పరిమాణం, సంఖ్య గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు కనుగొన్నారట. దాదాపు 60కి పైగా రిపోర్టులు, క్లినికల్​ ట్రయల్స్​, ప్రయోగాలు, చికిత్స విధానాలు, చికిత్స అనంతరం ఫలితాలను అధ్యయనం చేసిన తర్వాత.. ఈ నివేదికను ప్రచురించినట్టు డాక్టర్​ లియో పేర్కొన్నారు.

పైనాపిల్‌తో :
రోజూ పైనాపిల్‌ రసాన్ని పులిపిర్లపై రాసుకోవడం వల్ల కొన్ని రోజుల్లోనే అవి తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

ఉల్లిపాయ రసం :
పులిపిర్లతో బాధపడేవారు వాటిని తొలగించడానికి ఉల్లిపాయలను ఉపయోగించవచ్చు. అది ఎలా అంటే ముందుగా ఉల్లిపాయలను రసంగా చేసుకుని పులిపిర్లపై రాయాలి. ఇలా రోజూ చేయడం వల్ల వాటంతట అవే రాలిపోతాయట.

ఇంకా :

  • ఇంటిని శుభ్రం చేయడం దగ్గరి నుంచి, కూరలకు మంచి రుచి తీసుకురావడం వరకు, ఎన్నో రకాలుగా మనం యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను రోజూ ఉపయోగిస్తుంటాం.
  • అయితే.. దీనిని రోజూ ఉదయం, సాయంత్రం కొన్ని చుక్కలు పులిపిర్లు ఉన్న చోట రాయడం వల్ల అవి కొన్ని రోజుల్లోనే మాయమవుతాయని నిపుణులంటున్నారు.
  • పులిపిర్ల సమస్యతో బాధపడుతున్న వారు డైలీ టీ ట్రీ ఆయిల్‌ను అప్లై చేసుకోవడం వల్ల వాటికి చెక్ పెట్టవచ్చు.
  • నిమ్మరసాన్ని పులిపిర్లు ఉన్న చోట తరచుగా రాసుకుంటే అవి తొందరగా రాలిపోతాయి.
  • రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా దంచి పులిపిర్లు ఉన్న చోట పెట్టడం వల్ల అవి తొందరగా తగ్గిపోతాయని నిపుణులంటున్నారు.
  • పైన తెలిపిన చిట్కాల వల్ల మీకు చికాకుగా అనిపిస్తే, రోజూ అలోవెరా జెల్‌ను కూడా అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి నొప్పి లేకుండా అవి రాలిపోతాయి.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రక్తం రాలేదని తల గాయాన్ని వదిలేస్తే ప్రమాదమే! వెంటనే ఏం చేయాలి?

జుట్టు పెరగడం లేదని బాధపడుతున్నారా? - పాలకూరను ఇలా వాడరంటే​ రిజల్ట్​ పక్కా!

బరువు తగ్గడం నుంచి క్యాన్సర్​ వరకు - కుంకుమపువ్వు ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు!

Last Updated : Mar 21, 2024, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.