ETV Bharat / health

లేడీస్ PCOD సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే ఈజీగా తగ్గే ఛాన్స్! - PCOD AYURVEDIC REMEDIES

-పీసీఓడీ సమస్యకు ఆయుర్వేదంతో పరిష్కారం -ఇంట్లోని పదార్థాలతో ఈజీగా మందు రెడీ!

PCOD Ayurvedic Remedies
PCOD Ayurvedic Remedies (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : Dec 29, 2024, 5:02 PM IST

PCOD Ayurvedic Remedies: ఈ మధ్య కాలంలో మహిళలను పాలిసిస్టిక్ ఒవేరియన్ డిజార్డర్(పీసీఓడీ) ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్య వల్ల అవాంఛిత రోమాలు రావడంతో పాటు పీరియడ్స్ కూడా అస్తవ్యస్తంగా మారుతాయని నిపుణులు అంటున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి అనేక మందులు వాడుతుంటారు. అయితే, ఈ సమస్యకు ఆయుర్వేద పద్ధతిలో చక్కటి పరిష్కార మార్గం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఔషధం ఎలా తయారు చేసుకోవాలో ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు గాయత్రీ దేవి వివరిస్తున్నారు.

కావాల్సిన పదార్థాలు

  • 25 గ్రాముల మెంతుల చూర్ణం
  • 25 గ్రాముల వేపాకుల చూర్ణం
  • 25 గ్రాముల పసుపు
  • 25 గ్రాముల తిప్పతీగ చూర్ణం
  • 25 గ్రాముల నేల వేము చూర్ణం
  • 25 గ్రాముల ఉసిరి చూర్ణం

తయారీ విధానం

  • ముందుగా ఓ గిన్నెలో మెంతులు, వేపాకు, పసుపు, తిప్పతీగ, నేల వేము, ఉసిరి చూర్ణం వేసి బాగా కలపాలి.
  • అనంతరం స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో 60 మిల్లీ లీటర్ల నీటిని పోసి సన్నటి మంటపై మరిగించుకోవాలి.
  • ఇప్పుడు మిశ్రమాన్ని అందులో వేసుకుని సగం ఆవిరయ్యే వరకు మరిగించుకోవాలి.
  • ఆ తర్వాత దీనిని వడపోసుకుని తీసుకుంటే ఔషధం రెడీ!
  • ఇంకా దీనికి రుచికి కావాలంటే కొంచెం పటిక బెల్లం వాడాలని చెబుతున్నారు.
  • 5-10 గ్రాముల మిశ్రమాన్ని తీసుకుని ఎప్పటికప్పుడు కషాయంలో కాచుకోవాలని వివరిస్తున్నారు.
  • సుమారు 5-6 నెలల పాటు ఉదయం, సాయంత్రం తీసుకోవాలని చెబుతున్నారు.

మెంతులు: ఇది ఇన్సులిన్ హర్మోన్​లో ఉండే అసమతుల్యతను తగ్గించేందుకు తోడ్పడుతుందని గాయత్రీ దేవి చెబుతున్నారు.

వేపాకులు: మన శరీరంలో ఉండే హర్మోన్ల సమస్యను తగ్గించడంలో వేపాకులు చాలా బాగా సహాయపడతాయని వివరిస్తున్నారు.

పసుపు: దీనిని అనేక ఆయుర్వేద ఔషధాల తయారీలో వాడుతుంటారు. పసుపు కూడా హర్మోన్ల అసమతుల్యతను అరికడుతుందని వివరిస్తున్నారు.

తిప్పతీగ: మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేసే విధంగా చేయడంలో తిప్పతీగ ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇంకా హర్మోన్ల ఇంబ్యాలెన్స్​ను తగ్గించడంలో సహాయ పడుతుందని అంటున్నారు.

నేల వేము: చేదుగా ఉండే నేల వేము వాత దోషాన్ని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. దీంతో పాటు హర్మోన్ల అసమతుల్యను అరికడుతోందని చెబుతున్నారు.

ఉసిరి: పీసీఓడీ సమస్యకు ఉసిరి చూర్ణం చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

'అయ్యప్ప స్వామి పంచామృతంతో ఎంతో ఆరోగ్యం'- ఎలా చేయాలో మీకు తెలుసా?

జలుబు, దగ్గుతో ఇబ్బందా? రాత్రి నిద్ర కూడా పట్టట్లేదా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఈజీగా తగ్గే ఛాన్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.