ETV Bharat / health

అర్ధరాత్రి మెలకువ వచ్చి మళ్లీ నిద్ర పట్టడం లేదా ? - ఆ టైమ్‌లో ఇలా చేస్తే డీప్‌ స్లీప్‌ గ్యారంటీ! - TIPS FOR Good SLEEP at Night - TIPS FOR GOOD SLEEP AT NIGHT

Tips for Good Sleep at Night : మీకు అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు మెలకువ వస్తోందా? తర్వాత ఎంత ట్రై చేసినా నిద్రపట్టడం లేదా ? అయితే, ఈ కథనం మీ కోసమే. ఈ సమస్యను తగ్గించుకుని.. ప్రశాంతంగా నిద్రపోవడానికి కొన్ని సూచనలు చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Sleeping Disorder
Tips To Overcome Sleeping Disorder (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 3:09 PM IST

How To Overcome Sleeping Disorder : మనం ఆరోగ్యంగా ఉండటానికి మంచి నిద్ర చాలా అవసరం. అయితే, కొంతమందికి రాత్రి త్వరగానే నిద్రపట్టినా కూడా.. మధ్య రాత్రి మెలకువ వచ్చేస్తుంది. తర్వాత నిద్ర పోదామన్నా రాదు. ఇక ఏం చేయాలో తెలియక గడియారం వైపు చూస్తూ ఎప్పుడూ తెల్లవారుతుందా ? అని చూస్తుంటారు. దీనివల్ల ఉదయం నిద్రలేచిన తర్వాత నీరసంగా ఉండి.. ఏ పని చేయాలని అనిపించదు. అయితే, ఇలా మధ్య రాత్రి మెలకువ వచ్చే వారు కొన్ని టిప్స్‌ పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ చిట్కాల వల్ల రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోవచ్చని అంటున్నారు. ఆ టిప్స్‌ ఏంటో చూసేద్దామా మరి..

తేలికైన ఆహారం : పడుకునే ముందే కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం కాకుండా.. తేలిగ్గా ఉండే మంచి ఆహారం తీసుకుంటే అసలు మధ్య రాత్రి మెలకువే రాదని నిపుణులు అంటున్నారు. మంచి ఆహారం తీసుకోకుంటే నిద్ర సరిగ్గా పట్టదు సరి కదా.. మధ్య రాత్రి ఆకలేస్తుంటుందని.. దీనివల్ల మరుసటి రోజంతా చిరాగ్గా ఉంటుందని అంటున్నారు. కాబట్టి రాత్రి పడుకునే ముందు మంచి పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం అంటున్నారు.

అలర్ట్ : రాత్రివేళ సరిగా నిద్రపోవట్లేదా? - అయితే మీకు షుగర్ ముప్పు - ఇలా చేయాల్సిందేనట!

హారర్ సినిమాలు వద్దు : రాత్రి పడుకునే ముందు హారర్‌ సినిమాలు చూడటం వల్ల.. కొంతమందికి మధ్య రాత్రి మెలకువ వస్తుంది. ఆ సమయంలో సినిమాలోని కొన్ని సీన్స్ గుర్తుకు వచ్చి భయమేస్తుంటుంది. కాబట్టి, వీలైనంత వరకు పడుకునే ముందు హారర్‌ సినిమాలు చూడకుండా.. మనసుకు ప్రశాంతతను, ఆహ్లాదాన్ని కలిగించే వాటిని చూడాలని అంటున్నారు.

వేరే రూమ్‌లోకి వెళ్లండి : కొంతమంది నిద్రపోయే ముందు నచ్చిన పాటలు వినడం, పుస్తకాలు చదవడం చేస్తుంటారు. అయితే, మీకు మధ్య రాత్రి మెలకువ వస్తే.. వేరే గదిలోకి వెళ్లి నచ్చిన సంగీతం వినడమో లేదా పుస్తకం చదవడమో చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల నిద్రలోకి జారుకునే అవకాశం ఉంటుందట.

మీరు ఈ పొజిషన్​లోనే పడుకుంటున్నారా? లేకపోతే బోలెడు లాభాలు మిస్​ అయినట్లే!

లైటింగ్ తక్కువ ఉండేలా : బెడ్‌రూమ్‌లో లైట్లన్నీ ఆర్పేస్తేనే కొంతమందికి నిద్రపడుతుంది. మీకు కూడా ఈ అలవాటు ఉంటే.. నిద్రపోయే గదిలో లైటింగ్‌ తక్కువగా ఉండేలా చూసుకోండి. దీనివల్ల నిద్ర బాగా పట్టడంతో పాటు.. మధ్యలో మెలకువ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

2016లో "నేచర్" జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. నిద్రపోయే గది చీకటిగా ఉండటం వల్ల వ్యక్తులు త్వరగా నిద్రపోయారని, అలాగే మధ్యలో మెలకువ రాకుండా ఉండగలిగారని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో అమెరికాలోని ఒహియో స్టేట్ యూనివర్సిటీలో న్యూరోబయాలజీ ప్రొఫెసర్ 'డాక్టర్ డానా జాప్' పాల్గొన్నారు.

నిద్రపోయే ముందు అతిగా ఆలోచించకండి : కొంతమంది వ్యక్తిగత, కుటుంబ సమస్యలతో బాధపడుతుంటారు. పడుకునేముందు వీటి గురించి ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి లోనవుతుంటారు. అయితే, కొన్నిసార్లు మధ్య రాత్రి మెలకువ వచ్చినప్పుడు.. ఈ విషయాలన్నీ గుర్తొచ్చి తిరిగి నిద్ర పట్టకపోవచ్చు. కాబట్టి, నైట్‌ పడుకునే ముందు ఎక్కువగా సమస్యల గురించి ఆలోచించకపోవడం, చర్చించకపోవడం మంచిదని నిపుణులంటున్నారు.

  • మధ్య రాత్రి మెలకువ వచ్చినప్పుడు.. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా కళ్లు మూసుకుని నిద్ర పోవడానికి ప్రయత్నించండి.
  • అలాగే డైలీ కొంత సమయం యోగా, ధ్యానం వంటివి ప్రాక్టీస్‌ చేయండి. అరగంటసేపు వ్యాయామం చేయడం మర్చిపోకండి.
  • మధ్యాహ్నం ఎక్కువగా నిద్రపోతే రాత్రి సరిగ్గా నిద్ర పట్టదు. కాబట్టి, పగటి వేళ నిద్రకు స్వస్తి చెప్పమని సలహా ఇస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నోరు తెరిచి నిద్రపోయే అలవాటు ఉందా? అది ఎంత ప్రమాదకరమో తెలుసా?

అలర్ట్​: మధ్యాహ్నం తిన్న వెంటనే నిద్ర వస్తోందా ? అయితే మీకు ఈ ప్రాబ్లమ్​ ఉన్నట్టే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.