ETV Bharat / health

హోలీ - హెల్త్​కు హాని చేయని కలర్స్​ను సింపుల్​గా ఇంట్లోనే రెడీ చేసుకోండిలా! - how To Make Natural Colours at Home

Tips To Make Natural Colours At Home : పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టంగా జరుపుకునే పండగలలో హోలీ ఒకటి. ఇక హోలీ అంటేనే రంగుల పండగ. మరి ఈ పండగ నాడు ఆర్టిఫిషియల్​ రంగులకు చెక్​ పెట్టి.. ఇంట్లోనే నేచురల్​గా ప్రిపేర్​ చేసిన రంగులతో హోలీ జరుపుకోండి. పైగా హెల్త్​ కూడా బాగుంటుంది.

Tips To Make Natural Colours At Home
Tips To Make Natural Colours At Home
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 3:43 PM IST

Tips To Make Natural Colours At Home : చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతో ఉత్సహంగా జరుపుకునే పండుగలలో హోలీ ఒకటి. దేశ వ్యాప్తంగా ఈ రోజున కుల, మత బేధాలు లేకుండా అందరూ ఒక్కటై ఆనందంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు. ముఖ్యంగా యూత్‌ అంతా ఒక్కటై ఫ్రెండ్స్‌తో కలిసి ఆ రోజంతా ఎంతో ఎంజాయ్‌ చేస్తారు. ఏటా ఫాల్గుణ మాసం శుక్లం పక్షం పౌర్ణమి రోజున హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం హోలీ పండగను మార్చి 25 సోమవారం రోజు జరుపుకోనున్నారు.

ఇదిలా ఉంటే హోలీ అంటేనే రంగుల పండగ. హోలీనాడు మార్కెట్లో దొరికే రంగు రంగుల కలర్లను ఎక్కువ మంది కొని చల్లుకుంటుంటారు. కానీ, ఇవి తయారు చేయాడానికి చాలా రకాల కెమికల్స్‌ యూజ్‌ చేస్తారని నిపుణులంటున్నారు. పొరపాటున ఇవి కళ్లలోకి, నోట్లోకి వెళ్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి వసంతాల కేళి హోలీ పండగను రంగులు లేకుండా ఎలా జరుపుకోవాలి అని ఆలోచిస్తున్నారా ? అయితే, మీ కోసమే ఇది. ఇంట్లోనే సహజ సిద్ధంగా రంగులను తయారు చేయడానికి నిపుణులు కొన్ని టిప్స్​ సూచిస్తున్నారు. అవి ఏంటంటే..

పసుపు రంగు : హోలీలో ఎక్కువగా పసుపు రంగును చల్లుకుంటుంటారు. మరి దీనిని ఇంట్లోనే తయారు చేయడానికి శనగపిండి, పసుపును 1:2 నిష్పత్తిలో కలపుకోవాలి. అంతే పసుపు కలర్​ రెడీ. అదే కాకుండా పసుపు కలర్‌ కోసం బంతి, చామంతి పూలను ఎండబెట్టి పొడి చేసుకున్నా సరిపోతుంది. ఒకవేళ మీకు పసుపు రంగులో నీళ్లు కావాలనుకుంటే బంతి పూలను నీటిలో ఉడకబెట్టి తయారు చేసుకోవచ్చు.

రంగుల కేళి.. హోలీ సిద్ధమవుతున్నారా.. అయితే ఇది కూడా తెలుసుకోండి

ఎరుపు రంగు : సహజ సిద్ధంగా రెడ్‌ కలర్‌ తయారు చేయడానికి కొన్ని ఎర్ర మందార పువ్వులను తీసుకోవాలి. తర్వాత వాటిని ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇది తయారు చేయడానికి కాస్త టైమ్‌ పట్టినా కూడా చాలా బాగుంటుంది. ఎక్కువగా ఎర్ర రంగు ఉండటానికి ఇందులో ఎర్ర కుంకుమపువ్వుతో పాటు శనగపిండిని కూడా కలపవచ్చు.

మెజెంటా (ముదురు గులాబీ ) : ముదురు గులాబీ రంగును తయారు చేయడానికి ఇంట్లోనే బీట్‌రూట్‌ ముక్కలను కోసి రాత్రంతా నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఆ నీటిని కొద్దిగా మరిగిస్తే సరిపోతుంది, మెజెంటా కలర్‌ నీళ్లు రెడీ.

ఆకుపచ్చ రంగు : హోలీనాడు గ్రీన్‌ కలర్‌ను కూడా ఎక్కువగా చల్లుకుంటుంటారు. దీనిని ఇంట్లోనే తయారు చేయడానికి బియ్యం పిండిలో గోరింటాకు పొడిని కలుపుకోండి. గ్రీన్‌ కలర్‌లో వాటర్‌ రెడీ చేయడానికి నీళ్లలో హెన్నా పొడిని వాడుకోవచ్చు.

బ్రౌన్ కలర్‌ : బ్రౌన్ కలర్‌ నీళ్ల కోసం కాఫీ పౌడర్‌ను వాటర్‌లో వేసి మరిగించండి. అంతే బ్రౌన్‌ కలర్‌ వాటర్ రెడీ అయిపోతుంది.

ఈ ఏడాది హోలీ ఎప్పుడు - మార్చి 24నా? మార్చి 25వ తేదీనా?

Butter Festival : వినూత్నంగా 'వెన్న హోళీ'.. 11వేల అడుగుల ఎత్తులో ఘనంగా వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.