How To Make Masoor Dal Face Pack : చర్మం ఎప్పుడూ తాజాగా, మెరుస్తూ కనిపించాలనే అందరూ కోరుకుంటారు. కానీ కాలుష్యం, దుమ్ము, చమట వంటి రకరకాల కారణాల వల్ల అది సాధ్యం కాని పనిగా మారింది. అందుకే చాలా మంది మార్కెట్లో దొరికే క్రీములు, పార్లర్ల వెంట పడుతున్నారు. అందం కోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు. అన్ని చేసినా పెద్దగా ఫలితం కనిపించడం లేదని విసిగిపోయిన వారి కోసం మంచి చిట్కా!. అదే మసూర్ దాల్ ఫేస్ ప్యాక్( Masoor Dal Face Mask). ఎర్రకంది పప్పు లేదా మసూర్ దాల్ విటమిన్లు, పోషకాలతో నిండి ఉంటుంది. దీన్ని ఫేస్ ప్యాక్‌గా చేసుకుని రాసుకుంటే అద్భుతమైన ఎక్సఫోలియేట్గా పనిచేస్తుంది. చర్మపు మృతకణాలను తొలగించి ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుస్తుంది.
మసూర్ దాల్ చర్మాన్ని ఎలా కాపాడుతుంది
ఎర్రపప్పు లేదా మసూర్ దాల్లో ఎక్స్ ఫోలియేటింగ్(exfoliating) గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ప్రకాశవంతమైన, తాజా చర్మాన్ని పొందడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యంగా ఉండటానికి ఉపయెగపడే పోషకాలు, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇందులో బీ కాంప్లెక్స్, విటమిన్-సీ, విటమిన్-ఇలో పాటు ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మాన్ని లోతుల నుంచి శుభ్ర పరిచి మంచి పోషణ అందేలా చేస్తుంది.
మసూర్ దాల్ ఫేస్ ప్యాక్‌తో ప్రయెజనాలేంటి?
ఎక్స్‌ఫోలియేటర్‌గా పని చేస్తుంది : మసూర్ దాల్ ఫేస్ ప్యాక్ సున్నితమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. చర్మంపై పేరుకుపోయిన జిడ్డు, మురికితో పాటు మృతకణాలను తొలగించి మెరిసే చర్మాన్ని పెంపొందిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ : ఎర్రపప్పులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, అకాల వృద్ధాప్యాన్ని నిరోధించడానికి సహాయపడుతుంది. చర్య వ్యాధులు, చికాకులు, చర్మం ఎర్రబడటం వంటి సమస్యలను నయం చేస్తుంది.
టాన్ రిమూవర్ : చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మసూర్ దాల్ ఫేస్ ప్యాక్ మంచి టాన్ రిమూవర్ లా పనిచేస్తుంది. ఇందులోని ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలు, చర్మపు రంగును మార్చడం సహా చనిపోయిన చర్మ కణాలను తొలగించి స్కిన్ హెల్తీగా ఉండేందుకు దోహదపడుతాయి. ముఖంపై ఉండే ట్యాన్‌ను తొలగించి చర్మపు అసలు రంగును బయటకు తీసుకొచ్చి కాంతివంతంగా తయారు చేస్తుంది.
మొటిమలకు చెక్ : మొటిమల సమస్యతో బాధపడుతున్న వారికి ఎర్రపప్పు మంచి మెడిసిన్ అని చెప్పచ్చు. దీంట్లోని సహజమైన తేమ, చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. చర్మం లోతుల్లోంచి శుభ్రపరిచి మొటిమలు రాకుండా చేస్తుంది. అలాగే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్లను తగ్గిస్తుంది.
స్పష్టమైన చర్మం: పరిపూర్ణమైన, ప్రకాశవంతమైన చర్మ కోసం మీకు ఎల్లప్పుడూ మసూర్ దాల్ ఫేస్ ప్యాక్ సహాయపడుతుంది. మసూర్ దాల్ సహజమైన బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. మొటిమలు మచ్చలను నయం చేస్తుంది.
ఎలా తయారు చేసుకోవాలి?
మసూర్ దాల్ ఫేమ్ మాస్క్‌ను తయారుచేయడానికి గుప్పెడు మసూర్ దాల్, ఒక టేబుల్ స్పూన్ తాజా అలోవెరా జెల్‌ను తీసుకోండి. ఆ పప్పును అరగంట పాటు నీళ్లలో నానబెట్టిండి. అనంతరం నీళ్లను తీసేసి, మొత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేయండి. అనంతరం అలోవెరా జెల్‌ను అందులో కలిపి ఫేస్‌కు అప్లై చేయండి. 15-20 నిముషాల తర్వాత గోరువెచ్చడి నీటితో మృదువుగా కడగండి. అయితే ఈ మసూర్ దాల్ ఫేస్ మాస్క్‌ను చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. అందులో ఇది ఒకటి.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.