ETV Bharat / health

'వాటర్​ వెయిట్' సమస్య ఉంటే ఏమవుతుంది? దీన్ని తగ్గించడం ఎలా? - water retention in body symptoms - WATER RETENTION IN BODY SYMPTOMS

Tips For Reduce Water Weight : 'వాటర్​ వెయిట్' అంటే మీకు తెలుసా? ఈ రుగ్మత ఎలా వస్తుంది? దీని లక్షణాలు, నివారణ మార్గాలను ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

Tips For Reduce Water Weight
Tips For Reduce Water Weight
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 18, 2024, 7:26 AM IST

Tips For Reduce Water Weight : ఆరోగ్యంగా ఉండటానికి శరీరానికి నీరు చాలా అవసరం. మన శరీరం దాదాపు 60శాతం నీటిని నిలుపుకుని ఉంటుంది. ఇది మనల్ని హైడ్రేటెడ్​గా ఉంచడానికి, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, లూబ్రికెంట్​గా పనిచేస్తూ పోషకాల ప్రవాహం మెరుగవడానికి సహాయపడుతుంది. అంతే కాదు నీరు శరీరంలోని ఎలక్ట్రోలైట్లను బ్యాలెన్స్‌ చేసే బాధ్యతను తీసుకుంటుంది. కాబట్టి శరీరానికి నీరు చాలా ముఖ్యం. అయితే శరీరం దానికి అవసరమైన దానికంటే ఎక్కువ నీటిని నిలుపుకోవడం ప్రారంభించిందంటే ప్రమాదమేనని చెబుతున్నారు నిపుణులు. శరీరంలో అదనపు నీటి నిలుపుదల మన ఆరోగ్యంపై అనేక విధాలుగా ప్రభావం చూపుతుందని అంటున్నారు.

'వాటర్​ వెయిట్​' సమస్యతో ఏమవుతుంది?
శరీరం నీటిని అధికంగా నిలుపుకోవడాన్ని ద్రవ నిలుపుదల, నీటి బరువు లేదా ఎడెమా అని పిలుస్తారు. శరీరంలో నీరు పేరుకపోయినప్పుడు పొత్తి కడుపు, కాళ్లు, చేతులు ఉబ్బినట్లుగా అనిపిస్తాయి. నీటి బరువు చాలా అసౌకర్యంగా ఉంటుంది. శరీర బరువులో హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. మూత్రపిండాల వ్యాధికి కూడా 'వాటర్​ వెయిట్' ఓ కారణంగా చెప్పచ్చు.

దీన్ని తగ్గించడం ఎలా?
నీరు ఎక్కువ తాగాలి
నీటి బరువు తగ్గడానికి నీరు ఎక్కువగా తాగాలా! అదేంటీ అని ఆశ్చర్యపోతున్నారా!! అవును మీ శరీరం నిర్జలీకరణానికి గురైనప్పుడు సాధారణంగా కన్నా ఎక్కువ నీటిని నిలుపుకుంటుంది. కాబట్టి మీరు రోజంతా నీరు పుష్కలంగా తాగి, హైడ్రేటెడ్​గా ఉండటం వల్ల శరీరం అదనపు నీటిని నిలుపుకోకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా 'వాటర్​ వెయిట్' తగ్గుతుంది. వీటితో పాటు నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కీరదోస లాంటి పండ్లను మీ ఆహారాల్లో భాగం చేసుకోవాలి.

సోడియం తగ్గించాలి
చాలా సందర్భాల్లో శరీరంలో 'వాటర్​ వెయిట్' పెరిగేందుకు ఉప్పు కారణం అవుతుంది. సోడియం శరీరంలో నీటిని ఆకర్షించి, అలాగే నిలుపుకుంటుంది. ఇది ఉబ్బరానికి దారితీస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్లలో సోడియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అధిక సోడియం కలిగిన ఆహారాలను, ఉప్పును కాస్త తగ్గించడం వల్ల నీటి బరువును తగ్గించుకోవచ్చు.

పొటాషియం ఎక్కువ తీసుకోవాలి
శరీరంపై సోడియం ప్రభావాన్ని తగ్గించడంలో, ద్రవ సమతుల్యతను నియంత్రించడంలో పొటాషియం చక్కగా సహాయపడుతుంది. కాబట్టి అరటిపండ్లు, బచ్చలికూర, అవకాడో, చిలగడదుంపలు వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో అదనపు నీటి నిలుపుదల తగ్గుతుంది.

కార్బోహైడ్రేట్లకు దూరంగా
వైట్ బ్రెడ్, పాస్తా, పంచదారతో చేసే స్నాక్స్ వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతకు, నీరు నిలుపుదలకి దారితీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి, ద్రవాల నిలుపుదలని తగ్గించడానికి వీటికి బదులుగా తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలను ఎంచుకోవడం మంచిది.

శారీరక శ్రమ
సాధారణ శారీరక శ్రమ శరీరంలో నీటి ప్రసరణను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. చెమట ద్వారా అదనపు ద్రవాలను బయటకు పంపిస్తుంది. రోజులో కనీసం 30 నిమిషాలైనా నడక, సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, వ్యాయామం, యోగా వంటివి చేయడం ద్వారా 'వాటర్​ వెయిట్'ను తగ్గించవచ్చు.

అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా? - మీ సాల్ట్​ ఇలా టెస్ట్​ చేసుకోండయ్యా! - How to Check the Purity of Salt

తరచూ ఫేస్​ వాష్ చేస్తున్నారా? వేసవిలో ఇలా అస్సలు చేయొద్దు! - tips for skin in summer season

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.