How to Get Rid of Lizards Naturally : ఇంటి గోడలపైన ఉండే బల్లుల వల్ల నేరుగా ఎలాంటి ప్రమాదం లేకపోయినా చాలా మంది వాటిని చూసి భయపడుతుంటారు. వీటిని ఎలాగైనా తరిమికొట్టాలని వివిధ రకాల స్ప్రేలు ఉపయోగిస్తుంటారు. అయితే, వీటిని వాడటం వల్ల బల్లులు పోవడమేమో గానీ, ఇన్నర్ పొల్యూషన్ పెరిగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు ఉండే ఇంట్లో వీటిని వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. అయితే, కొన్ని నేచురల్ టిప్స్ పాటించడం వల్ల బల్లులు పారిపోతాయని చెబుతున్నారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
గుడ్డు పెంకులు : మెజార్టీ జనాలు ఇంట్లో ఎగ్ కర్రీ చేసుకోగానే పెంకులను డస్ట్‌బిన్‌లో పారేస్తుంటారు. అయితే.. గుడ్డు పెంకులను ఇంట్లోని తలుపులు, కిటికీలు, వంటగదిలో కొన్ని చోట్ల లేదా ఇతర ప్రదేశాలలో ఉంచడం వల్ల బల్లుల బెడద నుంచి తప్పించుకోవచ్చంటున్నారు.
వెల్లుల్లి : వెల్లుల్లి, లవంగాల నుంచి వచ్చే ఘాటైన వాసన కూడా బల్లులకు పడదని.. కాబట్టి వెల్లుల్లి, లవంగాలను ఇంట్లో అక్కడక్కడా పెట్టడం వల్ల బల్లులు రావని అంటున్నారు. అలాగే వెల్లుల్లి రసాన్ని బల్లులు ఉండే ప్రదేశాల చుట్టూ స్ప్రే చేసినా ఫలితం ఉంటుందంటున్నారు.
ఉల్లిపాయలు : ఉల్లిపాయల ఘాటైన వాసన కూడా బల్లులకు నచ్చదని నిపుణులు అంటున్నారు. కాబట్టి, ఇంట్లోని బల్లులను తరిమికొట్టేందుకు కొద్దిగా ఉల్లిపాయ రసం గోడలపై స్ప్రే చేస్తే.. అవి ఇంట్లో నుంచి పరార్ అవుతాయని అంటున్నారు.
నాఫ్తలీన్ బంతులు : బల్లులను తరిమికొట్టడంలో నాఫ్తలీన్ బంతులు చాలా బాగా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు. వీటిని కిచెన్ అల్మారాలు, అవి తిరిగే కొన్ని ప్రదేశాలలో పెట్టడం వల్ల ఫలితం ఉందంటున్నారు.
మిరియాల పొడి : మిరియాల నుంచి వచ్చే ఘాటు వాసనకు బల్లులు పారిపోతాయి. కాబట్టి, ఇవి తరచు కనబడే ప్రదేశంలో మిరియాల పొడి చల్లమంటున్నారు. అలాగే ఈ పొడిని నీటిలో కలిపి స్ప్రే చేయడం వల్ల కూడా మంచి ఫలితం కనిపిస్తుందంటున్నారు. 2004లో 'Journal of Environmental Science and Health' లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. నల్ల మిరియాలలో ఉండే పైపెరిన్ బల్లులను తరిమివేయడంలో సహాయపడుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో కోయంబత్తూర్‌లోని శ్రీ కృష్ణాదాస్ కళాశాలలో జువాలజీ విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ సుబ్రమణ్యం పాల్గొన్నారు.
కర్పూరం : ఇంట్లో బల్లుల బెడద మరీ ఎక్కువగా ఉంటే.. అవి తిరిగే ప్రదేశంలో కర్పూరం పొడి చల్లాలని సూచిస్తున్నారు. అలాగే కొన్ని రోజులు కర్పూరం బిల్లలను అక్కడ పెట్టడం వల్ల కూడా అవి పోతాయని అంటున్నారు.
- లెమన్‌గ్రాస్, నిమ్మకాయల పొడిని బల్లులు తిరిగే చోట చల్లాలి. ఆ వాసన వాటికి పడదు. దీంతో అవి వెంటనే పారిపోతాయంటున్నారు.
- గోడల మీద బల్లులు ఎక్కువగా ఉంటే.. ఫ్రిజ్‌లోని చల్లని వాటర్‌ను వాటిపై చల్లాలని.. దీంతో అవి వెంటనే కింద పడిపోతాయని.. తర్వాత వాటిని తీసి బయట పడేయొచ్చంటున్నారు.
దుస్తులపై మరకలు ఓ పట్టాన పోవడం లేదా ? ఇలా చేస్తే చిటికెలో మాయం! - How To Remove Stains From Clothes