How to Clean Refrigerator : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండటం కామన్ అయిపోయింది. బిజీబిజీ లైఫ్‌లో కూరగాయలు, పండ్లు, ఆహారాన్ని నిల్వ ఉంచుకోవడానికి, అలాగే వాటిని ఫ్రెష్‌గా ఉంచుకోవడానికి ఫ్రిడ్జ్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే.. ఫ్రిడ్జ్ వాడకం ఓ రేంజ్లో ఉన్నా.. దాని క్లీనింగ్ విషయంలో మాత్రం పట్టించుకోరు. కొద్దిమంది క్లీనింగ్ చేసినా పైపైనే చేస్తుంటారు. దీంతో చాలా ఇళ్లలోని ఫ్రిడ్జ్‌లు దుర్వాసన వెదజల్లుతుంటాయి. అయితే ఇలా బ్యాడ్ స్మెల్ రావడానికి ఫ్రిడ్జ్ లోపల బ్యాక్టీరియా పేరుకుపోవడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన రాకుండా ఉండటానికి క్లీనింగ్ టిప్స్ చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఫ్రిడ్జ్‌ను క్లీన్ చేసే ముందు ఫ్రిజ్‌ని అన్ ప్లగ్ చేయండి. తర్వాత క్లీనింగ్ మొదలు పెట్టండి. ముందుగా ఫ్రిడ్జ్‌లోని అన్ని పదార్థాలను తీసి పక్కన పెట్టండి. ఆ తర్వాత అరలను (షెల్ఫ్‌లు) అన్నింటినీ తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత షెల్ఫ్‌లను గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి. అనంతరం షెల్ఫ్‌లను పొడి బట్టతో తుడవండి. ఇలా చేస్తే షెల్ఫ్‌లపైన ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోతుంది.
నెలకోసారి వాషింగ్ మెషిన్‌ను ఇలా క్లీన్ చేయండి - మురికిపోయి కొత్త దానిలా మెరుస్తుంది!
బేకింగ్ సోడా : ఇప్పుడు ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లను తీసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్‌ల బేకింగ్ సోడాను కలుపుకోండి. తర్వాత ఈ నీళ్లలో ఒక పొడి వస్త్రాన్ని ముంచి.. దానితో ఫ్రిడ్జ్ లోపల, బయట బాగా క్లీన్ చేయాలి. తర్వాత ఒక పొడి బట్టతో ఫ్రిడ్జ్‌ను మొత్తం తుడవాలి. ఇలా చేయడం వల్ల దుర్వాసన మొత్తం పోతుందని నిపుణులు చెబుతున్నారు.
2019లో 'జర్నల్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ' జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఫ్రిడ్జ్‌లలో బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించడంలో, దుర్వాసనను తగ్గించడంలో బేకింగ్ సోడా ప్రభావవంతంగా పని చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో టెక్సాస్ A&M విశ్వవిద్యాలయానికి చెందిన ఫుడ్ సేఫ్టీ నిపుణుడు, మైక్రోబయాలజిస్ట్ 'డాక్టర్ జాన్ సన్' పాల్గొన్నారు.
ఇండక్షన్ స్టౌ ఉపయోగిస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే డేంజర్ తప్పదు!
వేడి నీళ్లలో నిమ్మరసం : కొన్ని వేడి నీళ్లను తీసుకుని అందులో నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఒక స్ప్రే బాటిల్‌లో పోసి.. ఫ్రిడ్జ్ లోపల స్ప్రే చేయండి. తర్వాత ఒక పొడి వస్త్రంతో మొత్తం తుడవండి. ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి పెట్టి.. తర్వాత అందులో అన్ని వస్తువులను సర్దుకోండి. ఇలా నెలకు రెండు సార్లు ఫ్రిడ్జ్‌ను శుభ్రం చేసుకోవడం వల్ల బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా..
- ఫ్రిడ్జ్‌లో ఎప్పుటికప్పుడూ పాడైపోయిన పండ్లు, కూరగాయలు, ఇతర పదార్థాలను తీసేయాలి.
- వేడివేడిగా ఉండే ఆహార పదార్థాలను అలానే ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయాలి.
- ఫ్రిడ్జ్‌లో అన్ని పదార్థాలను ఇరికించకుండా.. కొంత ప్రదేశం ఖాళీగా ఉండేలా చూసుకోండి.
- ఈ టిప్స్ పాటించడం వల్ల ఫ్రిడ్ నుంచి దుర్వాసన రాకుండా చూసుకోవచ్చు.
ఎంత తోమినా గిన్నెల మీద జిడ్డు పోవడం లేదా? - ఇలా చేస్తే చాలు చిటికెలో మాయం!
సీలింగ్ ఫ్యాన్ క్లీన్ చేయడం కష్టంగా ఉందా? ఈ టిప్స్ ఫాలో అయితే వెరీ ఈజీ!