How To Avoid Bad Smell from Hair In Rainy Season : వర్షాకాలంలో జుట్టు నుంచి దుర్వాసన రావడం కామన్. తలపై మురికి, చెమట పేరుకుపోవడం వల్ల జుట్టులో బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. ఫలితంగా తలలో దుర్వాసన వస్తుంది. ఈ క్రమంలోనే హెయిర్ నుంచి బ్యాడ్ స్మెల్ పోగొట్టుకోవడానికి చాలా మంది రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. అయితే వాటిని తరచూ వాడడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ చెడు వాసనను ఎలా దూరం చేసుకోవాలని మీరు ఆలోచిస్తున్నారా ? అయితే, ఈ స్టోరీని పూర్తిగా చదవండి. కొన్ని నేచురల్ టిప్స్ పాటించడం ద్వారా.. వర్షాకాలంలో జుట్టు నుంచి వచ్చే దుర్వాసను తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
పెరుగు, దాల్చిన చెక్ పౌడర్ : ముందుగా ఒక గిన్నెలో అరకప్పు పెరుగు తీసుకుని అందులో.. ఒక టేబుల్‌స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసుకోండి. ఒక 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల జుట్టు నుంచి దుర్వాసన రాకుండా చూసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మీకు కర్లీ హెయిర్ అంటే ఇష్టమా? - పార్లర్‌కు వెళ్లకుండానే మీ జుట్టును మార్చేయండి!
తులసి నీరు: తులసి నీరు జుట్టు నుంచి దుర్వాసనను తొలగించడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే తులసి నీటిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు హానికరమైన బ్యాక్టీరియాను చంపడంలో సమర్థవంతంగా ఉన్నాయంటున్నారు. ఇందుకోసం తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీరు చల్లారిన తర్వాత ఆ నీటితో తలస్నానం చేయాలి.
యాపిల్ సైడర్ వెనిగర్‌తో : ఒక గ్లాసులో చల్లని నీటిని తీసుకుని.. ఇందులో రెండు టేబుల్ స్పూన్‌ల యాపిల్ సైడర్ వెనిగర్ యాడ్ చేయండి. తర్వాత ఈ నీటితో జుట్టుని శుభ్రం చేసుకోండి. ఇలా చేయడంతో జుట్టు నుంచి బ్యాడ్ స్మెల్ రావడం తగ్గిపోతుంది.
బేకింగ్ సోడాతో : జుట్టు నుంచి దుర్వాసనను తొలగించడానికి బేకింగ్ సోడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా? మీరు విన్నది నిజమే. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో నీళ్లను తీసుకుని అందులో టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను కలపండి. ఆ తర్వాత హెయిర్‌ను ఆ నీటితో శుభ్రంగా కడగండి. ఇలా చేస్తే.. జుట్టు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందని నిపుణులంటున్నారు.
2018లో 'International Journal of Hair Research' జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో, బేకింగ్ సోడాతో జుట్టును శుభ్రం చేసుకోవడం వల్ల జుట్టు దుర్వాసన గణనీయంగా తగ్గుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ అధ్యయనంలో చర్మవ్యాధి నిపుణురాలు, మౌంట్ సినాయి స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో డెర్మటాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ 'డాక్టర్ మారియా రాబర్ట్స్' పాల్గొన్నారు.
ఒక్కసారి క్యారెట్‌తో ఈ హెయిర్ మాస్క్‌లు ట్రై చేయండి - మీ జుట్టు ఓ రేంజ్లో పెరుగుతుంది!
నిమ్మరసం : వర్షాకాలంలో జుట్టు దుర్వాసన రాకుండా ఉండటానికి ఒక కప్పు నీటిలో టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకుని బాగా కలపండి. తర్వాత ఈ నీటితో జుట్టును బాగా కడగండి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేస్తే హెయిర్ బ్యాడ్ స్మెల్ రావడం తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
తలస్నానం చేసినా కూడా జుట్టు జిడ్డు వదలట్లేదా? - ఈ టిప్స్‌తో కురులు మెరిసిపోతాయి!
ముల్తానీ మట్టి - ముఖాన్ని మాత్రమే కాదు జుట్టునూ మెరిపిస్తుంది! ఇలా వాడండి!