Tips to Avoid Aggressive Behavior in Children : పిల్లలు దూకుడు స్వభావాన్ని కలిగి ఉండడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. అయితే.. అలా ఎందుకు ఉంటారు? దీనికి కారణం ఏంటి? అన్నది చాలా మంది తల్లిదండ్రులకు అర్థంకాదు. దీంతో.. వారిని ఎలా మేనేజ్ చేయాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. అయితే.. వారు పలు రకాల మానసిక ఇబ్బందుల వల్ల అలా ప్రవర్తిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఇబ్బందులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
కారణాలు గుర్తించండి: మీ పిల్లలు దూకుడు స్వభావం కలిగి ఉంటే.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేయొద్దని.. అందుకు గల కారణాలేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది వారిలో గూడుకట్టుకున్న నిరాశ, అలసట, ఆకలి వంటి అంశాలతోపాటు మరికొన్ని పరిస్థితుల వల్ల కూడా కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కారణాలను గుర్తించి, వాటిని తగ్గించడానికి తల్లిదండ్రులు ప్రయత్నించాలని సూచిస్తున్నారు.
భావోద్వేగ నియంత్రణ: పిల్లలు తరచుగా తమ భావోద్వేగాలను పూర్తి స్థాయిలో వ్యక్తీకరించడానికి కష్టపడతారని.. ఇలాంటి సమయంలో వారిలో ఒత్తిడి పెరిగి, కోపం లేదా నిరాశకు దారి తీస్తుందని అంటున్నారు. కాబట్టి.. ఇలాంటి పరిస్థితుల్లో మీ పిల్లలకు మద్దతుగా నిలవాలని, వాళ్ల ఫీలింగ్స్‌ను ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో వివరించాలని, ఇందుకోసం సహాయపడాలని నిపుణులు సూచిస్తున్నారు. వారి భావాలను నిర్భయంగా పంచుకోవడానికి కావాల్సిన వాతావరణం ఉండేలా చూడాలని చెబుతున్నారు.
క్లియర్ బౌండరీస్ సెట్ చేయడం: స్థిరమైన నియమాలు, సరిహద్దులు పిల్లలకు భద్రతా భావాన్ని అందిస్తాయని.. ఇది దూకుడును తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే పిల్లలు సానుకూలంగా ప్రవర్తించినప్పుడు వారిని ప్రశంసించాలని, ఇలా చేయడం ద్వారా వారిలోని దూకుడును నియంత్రించడం సాధ్యమవుతుందని చెబుతున్నారు.
సపోర్ట్ చేయండి : మీ పిల్లల దూకుడు స్వభావాన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటే.. వారికి సపోర్ట్ చేయాలని నిపుఇులు సూచిస్తున్నారు. వాళ్లు మంచి పనులు చేసినప్పుడు అభినందిస్తూ.. వారికి ఏవైనా బహుమతులు ఇవ్వాలని సూచిస్తున్నారు.
స్నేహం : పిల్లలతో స్నేహ బంధాన్ని ఏర్పరచుకోవడం తల్లిదండ్రులకు చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా పిల్లల మనసులో ఉండే సంకోచాలు దూరమైపోతాయని, వారిని మీకు దగ్గర చేస్తుందని సూచిస్తున్నారు. స్నేహం మీ బంధాన్ని మరింతగా బలపరుస్తుందని సూచిస్తున్నారు.
పిల్లలు చదువుపై శ్రద్ధ పెట్టడం లేదా? - పేరెంట్స్ ఇలా చేయాల్సిందే! - Best Parenting Tips For Child
మీ పిల్లలు నిత్యం నవ్వుతూ ఉండాలా? - అయితే ఈ 5 విషయాలు చెప్పండి!