Homemade drink For Acidity : గజిబిజి జీవితాల్లో భాగంగా మన ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. జంక్ ఫుడ్, మాంసాహారం, మద్యపానం ఇలా హానికరమైన వాటినే ఎక్కువగా తీసుకుంటున్నాం. ఫలితంగా శరీరంలో యాసిడ్ రిఫ్లక్సన్ ఎక్కవై జీర్ణ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎసిడిటీ సమస్య ఉన్నవారికి అజీర్తి, ఛాతి, కడుపులో మంట, నొప్పి, వికారం, మలబద్ధకం, చెడు శ్వాస, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు చాలా మంది మార్కెట్లో దొరికే మందులు, హానికరమైన పానీయాలు తాగుతుంటారు. ఇవి ఏమాత్రం మంచివి కావని తెలిసినా తప్పక తీసుకుంటుంటారు. అయితే ఇంట్లో సాధారణంగా ఉండే మూడు పదార్థాలతో ఎసిడిటీ సమస్యలను సహజంగా, త్వరగా నయం చేసుకోవచ్చని మీకు తెలుసా. అవును ఆయుర్వేదం ప్రకారం సహజంగా ఈ సమస్యను నయం చేసుకోవచ్చు.
ఎసిడిటీని అరికట్టేందుకు మీకు మీ ఇంట్లో ఎప్పుడూ ఉండే జీలకర్ర, ధనియాలు, సోంపు గింజలు చక్కగా ఉపయోగపడతాయి. ఈ మూడింటితో తయారు చేసిన పానీయాన్ని తాగితే ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందడమే కాకుండా జీర్ణ రుగ్మతలను నయం చేసుకోవచ్చు. ఈ డ్రింక్‌ను తాగడం వల్ల కలిగే ఇతర లాభాలేంటంటే ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జీర్ణ క్రియ
సాధారణంగా జీలకర్ర, సోంపు గింజలు, జీర్ణక్రియ లక్షణాలను మెరుగుపరుస్తాయి. జీలకర్ర జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని ప్రేరేపించే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఆహారాన్ని సమర్థవంతంగా విచ్ఛిన్నం చేయడంలోనూ ఇది చక్కగా సహాయపడుతుంది.
వాపును తగ్గిస్తుంది
జీలకర్ర, ధనియాలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది అదనపు యాసిడ్ ఉత్పత్తి వల్ల కలిగే కడుపు నొప్పి, వాపు వంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది. చికాకు, అసౌకర్యం వంటి వాటిని తగ్గిస్తుంది.
ఆల్కలిన్ ప్రభావం
సోపు గింజలు తినడం వల్ల శరీరంపై ఆల్కలీన్ ప్రభావం ఉంటుంది. ఎసిడిటీ కారణంగా వచ్చే గుండెలో మంట, నొప్పి వంటి సమస్యలకు కారణమయే అదనపు ఆమ్లాలను ఇవి తగ్గిస్తాయి.
ఉబ్బరం తగ్గిస్తుంది
ఈ పానీయంలో కార్మినేటివ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను నుంచి ఉపశమనం పొందేందుకు ఇది చక్కగా ఉపయెగపడుతుంది.
రిలాక్సింగ్ ఎఫెక్ట్
జీలక్రర, ధనియాలు, సోపు గింజలు ఒత్తిడిని నయం చేసేందుకు చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. కడుపు, ఛాతిలో వచ్చే నొప్పి, మంట వంటి సమస్యలను త్వరగా నయం చేస్తాయి.
కావాలసినవి
- ఒక టీ స్పూన్ జీలకర్ర
- ఒక టీ స్పూన్ ధనియాలు
- ఒక టీ స్పూన్ సోపు గింజలు
- 2 కప్పుల నీరు
తయారీ విధానం
- ఒక గిన్నెలో నీటిని తీసుకుని వాటిలో జీలకర్ర, ధనియాలు, సోపు గింజలు వేసి బాగా మరిగించాలి.
- ఈ పానీయాన్ని వడకట్టి గోరు వెచ్చగా అయ్యాక తాగాలి. అంతే మీ ఎసిడిటీ సమస్య త్వరగా, సహజంగా నయం అవడం ఖాయం.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.