Home Remedies to Reduce Migraine : మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంలో ఆవు నెయ్యి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందులో అనేక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఫంగల్ గుణాలు, యాంటీ వైరల్ ఏజెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. రోటీ, అన్నం లేదా కూరగాయలల్లో ఆవు నెయ్యి కలిపి తినడం ద్వారా మైగ్రేన్‌కు చెక్ పెట్టొచ్చని సూచిస్తున్నారు. రెండు చుక్కల ఆవు నెయ్యి ముక్కులో వేసినా ఉపశమనం కలుగుతుందని.. అలాగే నొప్పి ఉన్న ప్రదేశంలో రెండు చుక్కల నెయ్యితో మర్దన చేసినా ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు.
2019లో The Journal of Headache and Pain లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం 12 వారాల పాటు రోజుకు రెండు సార్లు ఒక టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి తిన్న వారిలో మైగ్రేన్ నొప్పి తగ్గినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో హైదరాబాద్‌లోని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అరుణ్ నారాయణ్ పాల్గొన్నారు. ఆవు నెయ్యి వాడిని వారిలో మైగ్రేన్ నొప్పి 50శాతం తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు.
కర్పూరం: మైగ్రేన్‌ను తగ్గించడంలో కర్పూరం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కర్పూరం తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుందని అంటున్నారు. మైగ్రేన్ నొప్పి వచ్చినప్పుడల్లా కర్పూరాన్ని మెత్తగా గ్రైండ్ చేసి ఆవు నెయ్యితో కలిపి.. ఈ పేస్ట్‌ను మీ నుదిటిపై అప్లై చేసి స్మూత్‌గా మసాజ్ చేస్తే నొప్పి తగ్గుతుందని పేర్కొన్నారు.
ఈ ఫుడ్స్ తింటున్నారా? - అయితే మైగ్రేన్ ముప్పు పొంచి ఉన్నట్టే!
ఐస్‌క్యూబ్‌లు: మైగ్రేన్ నుంచి ఉపశమనం కోసం ఒక ఐస్ ప్యాక్‌ను ఉపయోగించవచ్చ నిపుణులు అంటున్నారు. ఒకవేళ ఐస్ ప్యాక్ లేకుంటే ఒక టవల్లో ఐస్ క్యూబ్స్ వేసి స్కాల్ప్, నుదురు, మెడ వెనుక భాగంలో స్మూత్‌గా రుద్దితే సరిపోతుందంటున్నారు.
లావెండర్ ఆయిల్: మైగ్రేన్ నొప్పికి లావెండర్ ఆయిల్ మంచి ప్రత్యామ్నాయం అని నిపుణులు అంటున్నారు. దీని వాసన మైగ్రేన్ నొప్పిని తగ్గిస్తుందని.. గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల లావెండర్ నూనె వేసి వాసన పీలిస్తే ఉపశమనం కలుగుతుందంటున్నారు.
తులసి నూనె: మైగ్రేన్ నొప్పిని తగ్గించడంలో తులసి నూనె కూడా చాలా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. తులసి నూనె మాడుకు అప్లై చేయడం వల్ల ఒత్తిడి తగ్గిస్తుందని.. తలనొప్పి నుంచి తక్షణమే ఉపశమనాన్ని అందిస్తుందని చెబుతున్నారు.
గోరువెచ్చని నూనె: గోరువెచ్చని నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల.. రిలాక్స్‌గా ఉంటుంది. దీన్ని జుట్టుతోపాటు నుదుటిపైన మసాజ్ చేయడం వల్ల త్వరగా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
నల్లద్రాక్షతో క్యాన్సర్‌కు చెక్ - గుండె జబ్బులకు, మైగ్రేన్ సమస్యలకు పరిష్కారం!