ETV Bharat / health

అలర్ట్ - ఈ లక్షణాలు మీ పాదాలపై కనిపిస్తే.. షుగర్‌ ఎక్కువగా ఉన్నట్టే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 10:39 AM IST

High Blood Sugar Warning Signs on Feet : దీర్ఘకాలిక వ్యాధులలో మన శరీరాన్ని ఎక్కువగా డ్యామెజ్‌ చేసేది షుగర్‌! దీనివల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే.. మీ రక్తంలో షుగర్‌ స్థాయులు ఎక్కువగా ఉంటే పాదాలపై కొన్ని లక్షణాలు కనిపిస్తాయని నిపుణులంటున్నారు. ఇవి కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలంటున్నారు!

High Blood Sugar Warning Signs on Feet
High Blood Sugar Warning Signs on Feet

High Blood Sugar Warning Signs on Feet : ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా విస్తరిస్తోన్న వ్యాధి.. డయాబెటిస్. ఇది ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య. ఈ వ్యాధి ఒక్కసారి ఎటాక్ అయిందంటే లైఫ్ లాంగ్ వెంటాడుతూనే ఉంటుంది. అయితే.. దాని వల్ల కలిగే సమస్యలు తీవ్రతరం కాకుండా ఉండాలంటే రక్తంలో చక్కెర పరిమాణాలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. అలాకాకుండా శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగాయంటే అది టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ లకు దారి తీయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Blood Sugar Warning Signs on Feet : ఇక సాధారణంగా మన శరీరంలో ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేనప్పుడు.. లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉయోగించలేనప్పుడు, షుగర్ లెవల్స్ పెరిగి డయాబెటిస్ వస్తుంది. అయితే రక్తంలో చక్కెర స్థాయులు పెరిగినప్పుడు పాదాలలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అంటే.. మనకి మధుమేహం వచ్చిందో లేదో విషయాన్ని పాదాల ద్వారా తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. వాటిని త్వరగా గుర్తిస్తే డయాబెటిస్ ఎక్కువ కాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. లేదంటే అలా వదిలేస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలిగించొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి, పాదాలలో కనిపించే ఆ లక్షణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పాదాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..

  • బర్నింగ్ సెన్సేషన్ (ముఖ్యంగా మడమల్లో పాదాల దిగువన, అరికాళ్లు)
  • కాళ్లల్లో తిమ్మిర్లు రావడం
  • పాదాల్లో గుండు సూదులు గుచ్చినట్టుగా అనిపించడం
  • కాళ్లలో జలదరింపులు
  • పాదాలు చల్లగా అనిపించడం
  • పాదాలు, అరికాళ్లు స్పర్శ కోల్పోవడం
  • అదేవిధంగా కాళ్లకి ఏమైనా గాయాలయితే ఎక్కువ రోజులు మానకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కాబట్టి మీ పాదాల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఎటువంటి ఆలస్యం చేయకుండా వైద్యులని సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ లక్షణాలు మధుమేహానికి సంబంధించినవి. కాబట్టి డాక్టర్‌ను కలిసి టెస్టులు చేయించుకోవడం ఉత్తమం. అలాగే ఒకవేళ డయాబెటిస్ నిర్ధారణ అయితే రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే చక్కెర ఎక్కువ ఉండటం వల్ల మరిన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

రక్తంలో చక్కెర స్థాయులు పెరగడం వల్ల కలిగే ఇతర ఆరోగ్య సమస్యలు ఏమిటంటే..

  • నరాలు దెబ్బతినడం(న్యూరోపతి)
  • కార్డియోవాస్కులర్ వ్యాధి
  • మూత్రపిండాల నష్టం (డయాబెటిక్ నెఫ్రోపతీ) లేదా మూత్రపిండ వైఫల్యం
  • అంధత్వానికి దారితీసే రెటీనా (డయాబెటిక్ రెటినోపతి)
  • రక్తనాళాలు దెబ్బతినడం
  • ఎముకలు, కీళ్ల సమస్యలు
  • దంతాలు, చిగుళ్ల ఇన్ఫెక్షన్లు

ఇవేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు మరింత అధికమైనప్పుడు పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయి. డయాబెటిక్ కీటోయాసిడోసిస్, హైపరోస్మోలార్ హైపర్గ్లైసీమిక్ వంటివి తలెత్తవచ్చు.

థైరాయిడ్​తో ఇబ్బంది పడుతున్నారా? - ఈ టిప్స్​తో అదుపులోకి రావడం పక్కా!

ఉదయాన్నే ఈ అలవాట్లను పాటిస్తే - మీరు 100 ఏళ్లు జీవించడం ఖాయం!

డయాబెటిస్​తో ఇబ్బందిపడుతున్నారా? - ఈ యోగాసనాలతో ఫుల్ బెనిఫిట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.