ETV Bharat / health

స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ చెడ్డవేనా? మంచివి కూడా ఉంటాయా? - Street Food Health And Safety - STREET FOOD HEALTH AND SAFETY

Healthy Street Foods : స్ట్రీట్ ఫుడ్ అనగానే అమ్మో ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదని చెబుతుంటారు చాలా మంది. వీధుల్లో దొరికే అన్ని ఆహారాలు ఆరోగ్యానికి హాని చేసేవేనా? మంచి చేసేవి ఏమీ ఉండవా? అంటే, కచ్చితంగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా చినుకులు పడుతున్నయాంటే నాలుక క్రిస్పీగా, క్రంచీగా కోరుకుంటుంది కదా! అలాంటప్పుడు బయట తినదగినవి కొన్ని ఉంటాయట. అవేంటంటే?

Healthy Street Foods
Healthy Street Foods (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 2:34 PM IST

Healthy Street Foods : వెదర్ మారుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లు మారతాయి. ముఖ్యంగా చినుకులు పడుతున్నాయంటే నాలుకతో పాటు మనసు కూడా వేడి వేడిగా, కారం కారంగా ఏమైనా తిందామా అని ఆరాటపడుతుంది. అలా అని వర్షం పడుతున్న ప్రతిసారి ఇంట్లో ఏదో ఒకటి చేసుకుని తినే వీలు, సమయం రెండూ దొరకవు. బయటకు వెళితే రకరకాల స్నాక్స్ దొరుకుతాయి.

అయితే స్ట్రీట్ ఫుడ్ ఆరోగ్యానికి మంచివి కాదని అంతా అంటుంటారు. నిజానికి స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ ఆరోగ్యానికి హాని చేసివే ఉండవట. మనం కొంచెం ఆలోచిస్తే, కాస్త వెతికితే ఆరోగ్యానికి మేలు కలిగించే ఆహార పదార్థాలెన్నో వీధుల్లో దొరుకుతాయట. ఇంట్లో చేసుకునే సమయం లేక, వీలు లేక ఇబ్బంది పడే వారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకనే వారు వీధుల్లో తినదగిన ఆహర పదార్థాలు కొన్ని ఉన్నాయట.

మొక్కజొన్న
వర్షాకాలం వచ్చిందంటే వీధుల్లో ఎక్కువగా కనిపించే స్నాక్స్ లలో మొక్కజొన్న ఒకటి. వీటిని ఉడికించి లేదా కాల్చిన తర్వాత కాసంత ఉప్పు, నిమ్మకాయ రుద్ది అమ్ముతుంటారు. ఇది తింటే వావ్ అనిపించడమే కాక, ఆరోగ్యానికి చాలా మంచిది కూడా.

భేల్ పూరీ
క్రంచీ క్రంచీగా అంటే కారంకారంగా, పుల్లపుల్లగా ఉండే భేల్ పూరీ అంటే చాలా మందికి ఇష్టం. వర్షాకాలంలో మన నాలుకకు సంతృప్తినిచ్చే ఆహారాల్లో ఇది ముందు వరుసలో ఉంటుంది. మరమరాలు, ఉడికించిన ఆలూ, ఉల్లిపాయలు, పచ్చి మిరప, పళ్లీలు, కొత్తిమీర, నిమ్మరసంతో పాలు కొన్ని మసాలాలు కలిపి తయారు చేసే భేల్ పూరీ తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదట!

కబాబ్
ఈ స్మొకీ డిష్​ను వర్షాకాలంలో ఎంజాయ్ చేసే వారు చాలా మంది ఉంటారు. పుట్టగొడుగులు, చికెన్, పెరుగు వంటి ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారు చేసినవి కనుక వీటిని మితంగా తినడం మంచిదేనట.

చెనా చాట్
శనగలు ఆరోగ్యానికి ఎంత మంచివే అందరికీ తెలుసు. కనుక బయట తినాలనిపించినప్పుడు ఉడికించిన శనగలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం, మసాలాలు కలిపి చేసిని చెనా మసాలా లేదా చెనా చాట్ మీకు మంచి స్నాక్ ఐటమ్ అవుతుంది.

సూప్స్
ఆరోగ్యకరమైన ఆహారాల్లో సూప్స్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాయి. వెజిటేరియన్ అయినా, నాన్ వెజిటేరియన్ అయినా సరే ఇవి మీ ఆరోగ్యానికి ఎలాంటి హని తలపెట్టవు.

పోహా
అటుకులు లేదా అన్నంతో తయారు చేసే పోహాలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. వీటికి తోడు దీంట్లో వేసే పసుపు, ఉల్లిపాయ, పల్లీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం, నెయ్యి అన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. వీటితో పాటు బయట తినాల్సిన సందర్భంలో పులియబెట్టి తయారు చేసే ఇడ్లీ, దోశ వంటి వాటిని ఎంచుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

స్ట్రీట్​ ఫుడ్​ టేస్ట్ ఇంట్లో! - ఉల్లి పకోడీలు ఇలా చేసుకుంటే అద్దిరిపోతాయి! - Street Style Onion Pakoda Recipe

ఆ 6 రకాల ఫుడ్ ఐటెమ్స్ తిన్నారంటే ఆవేశంతో ఊగిపోతారు! అవేంటో తెలుసా? - foods that make you feel angry

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.