ETV Bharat / health

అలర్ట్ : మీ అందాన్ని పాడుచేసే మొటిమలకు - మీ దిండు కారణమని తెలుసా? - Health Problems Of Unclean Pillow - HEALTH PROBLEMS OF UNCLEAN PILLOW

Health Problems Caused By Unclean Pillow : చాలా మందికి తల కింద దిండు లేనిదే నిద్రపట్టదు! మీరు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారా ? అయితే.. మీరు ఈ స్టోరీ తప్పక చదవాల్సిందే!

Unclean Pillow
Health Problems Caused By Unclean Pillow (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 18, 2024, 1:37 PM IST

Health Problems Caused By Unclean Pillow : చాలా మంది పడుకునేటప్పుడు తల కింద దిండును పెట్టుకుంటారు. అది లేకపోతే నిద్రపోలేరు. మొత్తటి పిల్లోతో హాయిని అనుభవిస్తారు. కానీ.. ఈ దిండుతో మీరు పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని మీకు తెలుసా? మీ అందాన్ని దెబ్బతీసే మొటిమల నుంచి ప్రమాదకరమైన శ్వాసకోశ వ్యాధుల వరకు ఈ దిండ్లు కారణమవుతాయని మీకు తెలుసా??

అలర్జీలు : చాలా మంది రోజంతా బయట తిరిగి వచ్చిన తర్వాత.. స్నానం చేయకుండానే బెడ్‌పైన వాలిపోతుంటారు. దీనివల్ల మన దుస్తులపైన ఉన్న బ్యాక్టీరియా, దుమ్ము ధూళి వంటివి బెడ్‌షీట్లు, తలగడపై చేరిపోతాయి. తర్వాత మనం పడుకున్నప్పుడు అవి మన శరీరంలోకి చేరి అలర్జీలను కలిగిస్తాయని నిపుణులంటున్నారు. కాబట్టి, శుభ్రంగా స్నానం చేసిన తర్వాత పడుకోవాలని సూచిస్తున్నారు.

మొటిమలు : నెత్తికింద తలగడ పెట్టుకున్నప్పుడు.. ముఖంపై ఉన్న దుమ్ము, ధూళి, నూనె జిడ్డు వంటివి దిండుకు అంటుకుంటాయి. వీటివల్ల దిండుపై బ్యాక్టీరియా పెరిగిపోతుంది. తిరిగి అవి ముఖం, ఒంట్లోకి చేరుతాయి. ఈ కారణంగానే ముఖంపై మొటిమలు పెరిగిపోతాయని నిపుణులంటున్నారు. 2016లో 'జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ' జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. దిండులోని బ్యాక్టీరియా మొటిమల తీవ్రతను పెంచుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో జపాన్‌లోని టోక్యో మెడికల్ అండ్ డెంటల్ యూనివర్సిటీలో చర్మవ్యాధి నిపుణుడు 'డాక్టర్‌ టెట్సుయా యామాగుచి' పాల్గొన్నారు. దిండు అపరిశుభ్రంగా ఉండటం వల్ల మొటిమలు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

నిమ్మకాయ తొక్కలను పడేస్తున్నారా? అయితే చాలా బెనిఫిట్స్​ మిస్ అయిపోతున్నట్లే!

నొప్పులు వేధిస్తాయి!
ఒకే తలగడను ఎక్కువ కాలం వాడితే మెడ, వీపు నొప్పి వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. మనం ఉపయోగించే కొద్దీ దిండులో ఉండే దూది, ఫోమ్‌ వంటివి ఎగుడు దిగుడుగా మారి నొప్పులకు కారణం అవుతాయట. అలాగే బ్యాక్టీరియా వల్ల శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇలా చేయాల్సిందే..

  • దిండు, బెడ్‌షీట్‌లపై ఉన్న బ్యాక్టీరియా తొలగిపోవాలంటే.. వీటిని ఎప్పటికప్పుడు ఉతకాలి. కానీ.. రోజూ ఉతకడం వీలుకాదు కాబట్టి, ప్రతీ ఉదయం ఎండలో ఆరేయాలి.
  • ఒకటి లేదా రెండు వారాలకు ఒకసారి వేడి నీళ్లలో దిండు కవర్‌లను ఉతకాలి
  • ఆరు నెలలకు ఒకసారి కొత్త దిండు కవర్‌ను మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • రెండేళ్లకోసారైనా కొత్త తలగడను తెచ్చుకోవాలి. పాతది పడేయాలి.
  • తలగడ సరిగా లేకపోతే మెడ కండరాలపై ఒత్తిడి ఏర్పడి నొప్పికి దారితీస్తుంది.
  • కాబట్టి.. అనుకూలంగా ఉండే దిండును మాత్రమే వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అలర్ట్​: మార్నింగ్ బ్రష్ చేయకుండా "వాటర్" తాగుతున్నారా? - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి!

ఇంట్రస్టింగ్​: డైలీ స్వీట్​ కార్న్​ తింటే - ఈ ఆరోగ్య సమస్యలన్నీ మటుమాయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.