Health Benefits Of Drinking Water Before Brushing : మన ఆరోగ్యంగా ఉండడానికి రోజూ సరైన ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. శరీరానికి సరిపడా నీరు తాగడం అంతే ముఖ్యం. అలాగే డైలీ తగిన మొత్తంలో వాటర్ తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు మన దరిచేరకుండా కాపాడుకోవచ్చని చెబుతుంటారు నిపుణులు. ఈ క్రమంలోనే కొందరికి ఉదయం లేవగానే పరగడుపున నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అయితే, ఇలా మార్నింగ్ పళ్లు తోముకోకుండా నీటిని(Water) తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? పాచి నోరుతో వాటర్ తాగడం వల్ల నోటిలో పేరుకుపోయిన బ్యాక్టీరియా కడుపులోకి వెళ్లడం వల్ల ఏదైనా హాని జరుగుతుందా? దీనిపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సాధారణంగా బాడీ హైడ్రేటెడ్‌గా ఉండడానికి డైలీ తగినంత వాటర్ తాగడం చాలా అవసరం. ఇందుకోసం రోజూ 10 నుంచి 12 గ్లాసుల వాటర్ తాగేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే, ఈ క్రమంలోనే కొందరు పరగడుపున వాటర్ తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరికొందరు మాత్రం బ్రష్ చేయకుండా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోరు. అలా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని భావిస్తుంటారు. ఎందుకంటే.. నైట్ పడుకునే సమయంలో నోటిలోని లాలాజలంలో బ్యాక్టీరియా ఉంటుందని నమ్ముతారు. కానీ, అది కేవలం ఒక అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు. అంతేకాదు.. డైలీ ఖాళీ కడుపుతో వాటర్ తాగడం వల్ల నష్టాల కంటే లాభాలే ఎక్కువగా ఉంటాయని సూచిస్తున్నారు. అవేంటంటే..
జీర్ణక్రియ మెరుగుపడుతుంది : ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల జీర్ణక్రియ.. ఎంజైమ్‌ల స్రావాన్ని పెంచుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఎంజైమ్‌లు ఆహారాన్ని జీర్ణం చేయడానికి, పోషకాల శోషణను పెంచడానికి చాలా బాగా సహాయపడతాయట. ఫలితంగా జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచిస్తున్నారు నిపుణులు.
మలబద్ధకాన్ని నివారిస్తుంది : బ్రష్ చేయకుండా వాటర్ తాగడం మలబద్ధకం, పుల్లటి తేన్పులు మొదలైన కడుపు సంబంధిత సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడుతుందంటున్నారు నిపుణులు. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుందని చెబుతున్నారు. ఇది జెర్మ్స్ , వ్యాధుల బారిన పడకుండా మీ శక్తిని పెంచడంలో సహాయపడుతుందంటున్నారు.
2017లో "Alimentary Pharmacology & Therapeutics" జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో రెండు గ్లాసుల నీళ్లు తాగడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గిందని పరిశోధకులు గుర్తించారు. ఈ రీసెర్చ్‌లో ఇరాన్‌లోని టెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ డాన్యా బెన్‌జాదు పాల్గొన్నారు.
రోజుకు ఎంత నీరు అవసరం? సరిపడా తాగుతున్నామో లేదో తెలుసుకోవడం ఎలా?
బరువు కంట్రోల్లో ఉంటుంది : మార్నింగ్ పరగడుపున నీరు తాగడం బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. అలాగే శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడంలో ఈ అలవాటు చాలా బాగా తోడ్పడుతుందంటున్నారు.
చర్మ ఆరోగ్యానికి మేలు : ఉదయాన్నే నీరు తాగడం టాక్సిన్స్‌ని తొలగిస్తుందంటున్నారు నిపుణులు. ఫలితంగా చర్మం ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు. ఎందుకంటే.. మృతకణాలు, టాక్సిన్స్ బయటకి వెళ్లి పోవడం వల్ల కొత్త కణాలు పెరిగి చర్మం మంచి మెరుపును సొంతం చేసుకుంటుందని చెబుతున్నారు. అయితే, చివరగా.. ఇలా వాటర్ తాగడం వల్ల బ్యాక్టీరియా నోటిలోకి పోతుందని భావిస్తే నైట్ పడుకునేటప్పుడు పళ్లు తోముకోవడం బెటర్ అని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా? - రీసెర్చ్‌లో ఆసక్తికర విషయాలు!