ETV Bharat / health

మందార పూల వాటర్​ తాగితే బీపీ తగ్గుతుందట! - పరిశోధనలో కీలక విషయాలు! - HEALTH BENEFITS OF HIBISCUS WATER

-యాపిల్, స్ట్రాబెర్రీ లాంటి పండ్లే కాదు.. మందారపూల నీళ్లు కూడా ఆరోగ్యమే -హైబిస్కస్‌ ఇన్‌ఫ్యూజ్‌డ్‌ వాటర్​తో ఈ బెనిఫిట్స్​ మీ సొంతం

Health Benefits of Hibiscus Water
Health Benefits of Hibiscus Water (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2024, 11:56 AM IST

Health Benefits of Hibiscus Water: ఆకర్షణీయమైన రంగులో.. అందమైన ఆకృతిలో విచ్చుకునే మందారం.. ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇంటి మందు అందంగా పూసే ఈ పువ్వులో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. అయితే చాలా మంది మందార ఆకులు, పూలు.. జుట్టు సమస్యలకు పరిష్కారంగా వాడుతుంటారు. కాగా, కేవ‌లం జుట్టుకు పోషణ అందించడంలోనే కాకుండా మ‌న ఆరోగ్యానికి కూడా మందార పూలు ఎంతో మేలు చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మందార పూల వాటర్​ను ప్రతిరోజూ తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాలు చూస్తే..

బీపీ తగ్గుతుంది: న్యూట్రిషనల్ జర్నల్ పరిశోధన ప్రకారం, మందార పూల వాటర్​ రక్తపోటును తగ్గించగలదని కనుగొన్నారు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్లు.. రక్త నాళాలను సులభంగా నిర్బంధిస్తుందని.. తద్వారా రక్తపోటు తగ్గుతుందని అంటున్నారు. ఇదే విషయాన్ని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ హెల్త్​ సభ్యుల బృందం ఓ అధ్యయనంలో స్పష్టం చేసింది.(రిపోర్ట్​ కోసం క్లిక్​ చేయండి).

షుగర్​ కంట్రోల్​: డయాబెటిస్​తో బాధపడుతున్నవారు.. ఈ వాటర్​ తాగితే మంచి ఫలితాలు లభిస్తాయని అంటున్నారు. ఇందులోని ఆంథోసైనిన్లు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి.. రక్తంలో గ్లూకోజ్​ లెవల్స్​ అదుపులో ఉంచేలా చేస్తుందని అంటున్నారు. మందార వాటర్​లో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటీన్‌ పుష్కలంగా ఉంటాయని.. ఇవి ఫ్రీ రాడికల్స్​తో పోరాడి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తుందని అంటున్నారు. అలాగే ఇనఫ్లేమేషన్​ను తగ్గిస్తుందని చెబుతున్నారు.

కాలేయ ఆరోగ్యం: పలు పరిశోధనల ప్రకారం మందార వాటర్​లో ఉండే హెపటోప్రొటెక్టివ్ గుణాలు మన శరీరంలో పేరకున్న టాక్సిన్స్​ను బయటికి పంపిస్తాయని తద్వారా కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటున్నారు.

కొలెస్ట్రాల్​ తగ్గుతుంది: మందారలోని ఆంథోసైనిన్స్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచుతుందని అంటున్నారు. అలాగే ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రక్తనాళాలలో ఏర్పడిన ఫలకాన్ని తొలగించడానికి సహాయపడతాయని.. తద్వారా ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందని, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని అంటున్నారు.

ఒత్తిడి తగ్గుతుంది: మందార వాటర్​ తాగడం వల్ల మూడ్ స్వింగ్స్ నుంచి బయటపడతారని నిపుణులు అంటున్నారు. ఇందులోని అరోమా.. స్ట్రెస్‌, యాంగ్జైటీ బారిన పడకుండా కాపాడుతుందని చెబుతున్నారు. విపరీతమైన పని ఒత్తిడి గురవుతున్నవారికి ఈ వాటర్​ ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని అంటున్నారు.

జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది: మందార పూల నీరు జీర్ణవ్యవస్థలోని కండరాల కదలికలను ప్రోత్సహిస్తుందని.. ఇది ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుందని అంటున్నారు. తద్వారా మలబద్ధకం, డయేరియా వంటి సమస్యలను తగ్గిస్తుందని చెబుతున్నారు. అలాగే వాంతులు, వికారం వంటి సమస్యలు కూడా తగ్గుతాయని అంటున్నారు. ఆకలిని కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.

మందార పూల వాటర్​ ఎలా తయారు చేసుకోవాలి:

కావాల్సిన పదార్థాలు:

  • ఎండబెట్టిన మందార పూలు - 1 కప్పు
  • సన్నగా తరిగిన అల్లం ముక్కలు - 4
  • పుదీనా ఆకులు - కొద్దిగా
  • నీళ్లు - ఒక లీటర్​

తయారీ విధానం:

  • ఓ బౌల్​లోకి నీళ్లు పోసుకోవాలి. అందులోకి ఎండబెట్టిన మందార పూలు, అల్లం ముక్కలు, పుదీనా ఆకులు వేసి కలిపి నాలుగు గంటలు నానబెట్టాలి.
  • ఆ తర్వాత ఆ నీళ్లను వడకట్టి రాత్రి వరకూ తాగుతుండాలి. చల్లగా కావాలనుకున్నవారు కొద్దిసేపు ఫ్రిజ్​లో ఉంచి తాగొచ్చు.

పచ్చి బొప్పాయి తింటే క్యాన్సర్ ముప్పు తగ్గుతుందట - వెల్లడించిన పరిశోధన!

ఎంత ట్రై చేసినా బరువు తగ్గట్లేదా? డైలీ ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఈజీగా వెయిట్ లాస్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.