Health Benefits Of Guava Leaves : నోటి ఆరోగ్యం బాగోలేకపోతే.. చిగుళ్ల సమస్యలు మొదలు పంటినొప్పి వరకూ ఎన్నో ఇబ్బందిపెడుతుంటాయి. మీరూ ఇలాంటి సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్లయితే.. జామ ఆకులతో చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. వాటి ద్వారా దంత సమస్యలన్నీ ఇట్టే తొలగిపోతాయంటున్నారు. అంతేకాదు.. జామ ఆకుల ద్వారా మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలూ పొందుతారంటున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జామకాయ(Guava) తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే, జామ పండ్లలోనే కాదు.. వాటి ఆకుల్లోనూ ఆరోగ్యానికి మేలు చేసే ఫైబర్, విటమిన్ సి, ఎ, పొటాషియం, మాంగనీస్ వంటి ఇతర పోషకాలు ఎన్నో పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అలాగే.. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి గాయాలను నయం చేయడంలో చాలా బాగా పని చేస్తాయంటున్నారు.
అదేవిధంగా నోటి సంరక్షణలో.. సహాయపడే యాంటీమైక్రోబయాల్ ట్రస్టెడ్ సోర్స్ యాక్టివిటీనీ జామ ఆకులు కలిగి ఉంటాయని చెబుతున్నారు. కాబట్టి.. పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలు, నోటి దుర్వాసన వంటి సమస్యలు తలెత్తినప్పుడు తాజా జామ ఆకులను శుభ్రంగా కడిగి తింటే చాలని అంటున్నారు. పై సమస్యలన్నీ ఇట్టే తగ్గిపోతాయంటున్నారు. లేదంటే.. జామ ఆకులను మెత్తగా తరిగి వేడి నీటిలో ఉడకబెట్టి పై ఆ వాటర్‌తో పుక్కిలించినా దంత, చిగుళ్ల సమస్యలు దూరం అవుతాయంటున్నారు నిపుణులు.
తెలుపు, గులాబీ రంగు జామ- ఇందులో ఏది ఆరోగ్యానికి మంచిది!
2014లో 'జర్నల్ ఆఫ్ డెంటల్ రీసెర్చ్'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. జామ ఆకులలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చిగుళ్ల వాపు, చిగుళ్లలో రక్తస్రావం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ డేవిడ్ జాన్సన్ పాల్గొన్నారు. దంత, చిగుళ్ల సమస్యలతో బాధపడేవారు జామ ఆకులను తినడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
జామ ఆకులు కేవలం నోటి ఆరోగ్యానికి మాత్రమే కాదు.. మరికొన్ని సమస్యలను నివారించడంలో చాలా బాగా పనిచేస్తాయంటున్నారు. ఈ ఆకుల్లో విటమిన్ సితో యాంటీ అలర్జీ గుణాలు ఉంటాయి. కాబట్టి జలుబు, దగ్గు, గొంతు నొప్పిని తగ్గించడానికి ఇవి పనిచేస్తాంటున్నారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో జామ ఆకులు సహాయపడతాయట. అదేవిధంగా ఫైబర్ అధికంగా ఈ ఆకులు తినడం ద్వారా అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గి జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుందంటున్నారు. అంతేకాదు.. అదనపు శరీర బరువును తగ్గించడంలో కూడా జామ ఆకులు సహాయపడతాయని చెబుతున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అలర్ట్ : గర్భవతులు జామ పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా? - పరిశోధనలు చెప్పేది ఇదే!