Health Benefits of Eating Nuts Daily for one Month: ఆరోగ్యంగా ఉండాలంటే ఏవేవో కసరత్తులు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఆహార మార్పులు, జీవన మార్పులు చేసుకుంటే సరి. అందులో భాగంగానే నట్స్ తినమని సలహా ఇస్తున్నారు నిపుణులు. నట్స్ అంటే జీడిపప్పు, పిస్తా, వాల్ నట్స్, బాదం, సన్ ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, చియా సీడ్స్ ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. ఇందులో ఒక్కో నట్స్‌కి ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే వీటిని ఎప్పుడో ఒకసారి కాకుండా డైలీ నెల రోజుల పాటు గుప్పెడు తింటే శరీరంలో అనేక మార్పులు జరుగుతాయని అంటున్నారు. ముఖ్యంగా పరగడుపున తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. అంతేకాకుండా ఈ నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు నిండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. మరి డైలీ నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..
గుండెకు రక్షణ: నట్స్‌లో ఎన్నో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. మోనోశాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని నిపుణులు అంటున్నారు. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు. 2019లో 'న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్'లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం నెల రోజుల పాటు ప్రతి రోజూ 50 గ్రాముల నట్స్ తినే వ్యక్తులు.. తినని వారి కంటే గుండె జబ్బులు, స్ట్రోక్, మరణానికి గురయ్యే ప్రమాదం తక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో బార్సిలోనాలోని Hospital Clinicలో కార్డియాలజీ ప్రొఫెసర్ Dr. Emilio Ros పాల్గొన్నారు.
క్యాన్సర్ నుంచి రక్షణ: ఈ గింజల్లో సెలీనియం, విటమిన్ ఈ, ఫినోలిక్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవన్నీ శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడతాయి. అలాగే చర్మ కణాలను, శరీర కణాలను రక్షిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఇన్ఫ్లమేషన్ రాకుండా అడ్డుకుంటాయి. క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా కాపాడతాయి.
బరువు తగ్గేందుకు: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ గుప్పెడు నట్స్ ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. వీటిలో క్యాలరీలు నిండుగా ఉంటాయి. కాబట్టి గుప్పెడు తిన్నా కూడా పొట్ట నిండినట్టు అనిపిస్తుంది. ఆకలిని కూడా ఇవి నియంత్రిస్తాయి. కాబట్టి శరీర బరువు త్వరగా తగ్గుతారు. పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
షుగర్ ఉన్నవారికి: డయాబెటిస్ ఉన్నవారు నట్స్ ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అలాగే వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకోవడంలో ముందుంటాయని, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయని చెబుతున్నారు.
ప్రీ డయాబెటిస్ గురించి తెలిస్తే - షుగర్ రాకుండా అడ్డుకోవచ్చట! - What is Prediabetes
బ్రెయిన్ హెల్త్‌కు: మెదడు ఆరోగ్యానికి కూడా వాల్ నట్స్, బాదం వంటివి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. వీటిలోని ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ ఇ, బి6.. మెదడు పనితీరును మెరుగుపరచడంలో, వయసు సంబంధిత మెదడు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
ఎముకల ఆరోగ్యానికి: నట్స్‌లోని కాల్షియం, మెగ్నీషియం వంటివి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఆర్థరైటిస్ వంటి వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తాయి. అలాగే నట్స్‌లోని ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అలర్ట్ - మధ్యాహ్న భోజనం తర్వాత నిద్రపోతున్నారా? - ముప్పు తప్పదట! - Effects Of Afternoon Sleep