Health Benefits of Drinking Milk with Honey: మనం ఆరోగ్యంగా ఉండటానికి సమతుల ఆహారం ఎంతో అవసరం. ఈ క్రమంలోనే రాత్రి పడుకునే ముందు ఓ గ్లాస్ గోరువెచ్చని పాలు తాగమని సలహా ఇస్తుంటారు నిపుణులు. పాలలోని పోషకాలు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయని చెబుతుంటారు. అయితే పాలు తాగే వారిలో చాలా మంది అందులో చక్కెర కలుపుకుని తాగుంటారు. కానీ.. ఈ షుగర్ తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కాబట్టి.. పాలలో చక్కెరకు బదులుగా ఒక్క స్పూన్ తేనె కలుపుకుని తాగితే మంచిదని చెబుతున్నారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని సలహా ఇస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
పోషకాల పవర్ హౌజ్: పాలలో కాల్షియం, విటమిన్ డి, ప్రొటీన్, ఫాస్పరస్ వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు చాలానే ఉన్నాయి. అలాగే తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీబాక్టీరియల్ లక్షణాలు, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి 6 వంటి పోషకాలు ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల అద్భుతాలు జరుగుతాయని చెబుతున్నారు.
మెరుగైన నిద్ర : పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది నిద్రను నియంత్రించే హార్మోన్. అలాగే తేనెలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. అయితే ఈ రెండింటిలోని పోషకాలు ఒత్తిడిని తగ్గించడంలో, నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.
2009లో Journal of Clinical Sleep Medicine లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో తేనె కలిపి తాగడం వల్ల నిద్ర మెరుగుపడతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో క్లినికల్ సైకాలజిస్ట్, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ డాక్టర్ డెవిడ్ సి. అష్టన్ పాల్గొన్నారు. ఈ రెండింటిలోని పోషకాలు నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయని ఆయన పేర్కొన్నారు.
నైట్ డ్యూటీ చేసే వారికి షుగర్ వస్తుందా? - నిపుణుల సమాధానం ఇదే! - Night Shifts Side Effects
జీర్ణక్రియ మెరుగుదల: పాలలో ప్రోబయోటిక్స్ అనే ప్రయోజనకరమైన బ్యాక్టీరియాలు ఉంటాయని.. తేనెలో జీర్ణక్రియ ఎంజైమ్‌లు ఉంటాయని నిపుణులు అంటున్నారు. వీటిలోని పోషకాలు ఆహారాన్ని విచ్ఛిన్నం, పోషకాలను గ్రహించడంలో సహాయపడతాయని, జీర్ణ సమస్యలైన గ్యాస్, మలబద్ధకం దూరం చేస్తాయని అంటున్నారు.
జలుబు, దగ్గును తగ్గిస్తుంది: పాలలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. తేనెలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి. ఈ కారణంగా ఇవి గొంతు నొప్పి, దగ్గును తగ్గించడంలో సహాయపడతాయని.. అలాగే జలుబుకు కారణమయ్యే ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.
ఎముకలకు బలాన్నిస్తుంది: పాలలో ఎముకలకు కావాల్సిన కాల్షియం ఉంటుంది. తేనెతో కలిపి తీసుకోడం వల్ల శరీరం ఈ కాల్షియాన్ని బాగా అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. వయసు పైబడిన పెద్దవారికి ఇది చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.
మీకు విటమిన్ బి12 లోపం ఉందా? - ఇలా చేస్తే ఇట్టే భర్తీ అయిపోతుంది! - Vitamin B12 Rich Foods
ఒత్తిడి తగ్గుతుంది: పాలూ, తేనె కలిపి తాగడం వల్ల శరీరంలో సెరటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అంతే కాకుండా ఒత్తిడి కలిగించే కార్టిసోల్ లెవెల్ని ఇవి తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు.
చర్మ ఆరోగ్యానికి: పాలలో లాక్టిక్ యాసిడ్, తేనెలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని.. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షించడంలో సహాయపడతాయని అంటున్నారు. అలాగే చర్మాన్ని తేమగా ఉంచడంలో, మృదువుగా చేయడంలో సహాయపడతాయని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అలర్ట్ : జిమ్లో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి - లేదంటే ప్రాణాపాయం తప్పదు! - Avoid These Gym Mistakes