ETV Bharat / health

రాత్రి పడుకునే ముందు పాలలో నెయ్యి కలిపి తాగితే - ఏం జరుగుతుందో తెలుసా? - Benefits Of Drinking Milk With Ghee - BENEFITS OF DRINKING MILK WITH GHEE

Health Benefits Of Drinking Milk With Ghee​ : చాలా మంది జనాలు రాత్రి పడుకునే ముందు పాలు తాగుతుంటారు. కొంతమంది మాత్రం పాలలో నెయ్యి కలుపుకుని తాగుతుంటారు. మరి.. ఈ రెండు పద్ధతుల్లో ఏది మంచిది? మీకు తెలుసా??

Benefits Of Drinking Milk With Ghee
Health Benefits Of Drinking Milk With Ghee​ (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 7, 2024, 1:24 PM IST

Health Benefits Of Drinking Milk With Ghee​ : నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మంచిదని.. ఎముకల బలంగా ఉండటానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. అయితే.. ప్రస్తుత కాలంలో చాలా మంది బరువు పెరిగిపోతామని నెయ్యి తినకుండా ఉంటున్నారు. కానీ, నెయ్యి మితంగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రోజూ రాత్రి పడుకునే ముందు తాగే గ్లాసు పాలలో ఒక స్పూన్‌ నెయ్యి కలుపుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల మీ శరీరంలో చాలా మార్పులు వస్తాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఒక టేబుల్ స్పూన్ (14 గ్రాములు) నెయ్యిలోని పోషకాలు :

  • కేలరీలు - 112
  • కొలెస్ట్రాల్ - 33 మిల్లీగ్రాములు
  • విటమిన్ ఎ - 108 మైక్రోగ్రాములు
  • విటమిన్ ఇ - 0.3 మిల్లీగ్రాములు
  • విటమిన్ కె - 1.3 మైక్రోగ్రాములు

పాలలో నెయ్యి కలుపుకుని తాగడం వల్ల కలిగే లాభాలు :

జీర్ణక్రియ మెరుగుపడుతుంది :
నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను సక్రమంగా జరిగేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ గోరువెచ్చని పాలలో నెయ్యి కలుపుకుని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని అంటున్నారు. అలాగే కడుపులో మంట కూడా తగ్గుతుందట. 2019లో "ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌"లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. బ్యూట్రిక్ యాసిడ్ జీర్ణవ్యవస్థలో మంటను తగ్గిస్తుందని, అలాగే మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.

సమ్మర్​లో టీ, కాఫీ వద్దు హెర్బల్ టీ ముద్దు - ఆ ప్రాబ్లమ్స్​ అన్నీ క్లియర్​! - Coriander Tea Health Benefits

కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది :
కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడేవారు రోజూ పడుకునే ముందు గోరువెచ్చని పాలలో నెయ్యి కలుపుకుని తాగడం వల్ల ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ (CLA) వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపును తగ్గించి, కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు కూడా ఈ చిట్కాను పాటిస్తే ప్రయోజనం ఉంటుందట.

చర్మం మెరిసేలా చేస్తుంది :
నెయ్యిలో కొవ్వులో కరిగే విటమిన్‌ ఎ, డి, ఇ, కె ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, చర్మాన్ని మెరిసేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు గోరువెచ్చని పాలలో టేబుల్‌స్పూన్‌ నెయ్యి కలుపుకుని తాగడం వల్ల చర్మం తళతళ మెరుస్తుంది.

నిద్ర బాగా పడుతుంది :
నెయ్యి, పాలు రెండింటిలోనూ ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది నాణ్యమైన నిద్రను అందిస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో నెయ్యి కలిపి తాగడం వల్ల రిలాక్స్‌గా అనిపించి, బాగా నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీకు పసుపు రంగు పుచ్చకాయ తెలుసా? - ఇది తింటే ఏమవుతుంది? - Benefits of Yellow Watermelon

అలర్ట్ : మామిడి పండు తింటే షుగర్ పెరుగుతుందా? - నిపుణులు ఏమంటున్నారంటే - Mango Increase Blood Sugar or Not

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.