ETV Bharat / health

సమ్మర్​ స్పెషల్ హెర్బల్ టీ - తాగితే బోలెడు ప్రయోజనాలు గ్యారెంటీ! - Summer Special Herbal Tea Benefits - SUMMER SPECIAL HERBAL TEA BENEFITS

Summer Special Herbal Tea : రోజురోజుకి ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కాసేపు అలా బయట తిరగ్గానే నీరసం, నిస్సత్తువ, అలసట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఆవహించేస్తుంటాయి. కాబట్టి, సమ్మర్​లో ఈ స్పెషల్ హెర్బల్ టీ తీసుకున్నారంటే అలాంటి సమస్యలు మీ దరిచేరవని, ఫుల్ యాక్టివ్​గా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ, ఆ హెర్బల్ టీ ఏంటి? ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయో ఇప్పుడు చూద్దాం.

Summer Special Tea
Summer Special Herbal Tea
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 18, 2024, 5:29 PM IST

Benefits of Lemon Juice Turmeric Black Pepper Tea : సమ్మర్​లో వచ్చే వివిధ ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే బాడీని హైడ్రేట్​గా ఉంచడం చాలా అవసరం. అయితే, వేసవిలో సాధారణ వాటర్ ఎంత తాగినా దప్పిక తీరదు. అలాకాకుండా నిమ్మరసం(Lemon Juice), పసుపు, మిరియాలతో ప్రిపేర్ చేసుకునే.. ఈ సమ్మర్ స్పెషల్ హెర్బల్ టీని తీసుకున్నారంటే వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడమే కాకుండా.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ, దానిని తాగడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది : నిమ్మరసం, పసుపు, మిరియాలతో తయారుచేసుకునే ఈ హెర్బల్ టీ రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నిమ్మరసంలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, మిరియాలలో ఉండే క్యాప్సైసిన్​తో పాటు మరికొన్ని పోషకాలు రోగనిరోధక వ్యవస్థను బలపర్చడంలో సహాయపడుతాయని చెబుతున్నారు నిపుణులు.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది : ఈ టీ లో ఉపయోగించే నిమ్మరసం జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించి మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పసుపు, నల్ల మిరియాలలో ఉండే పోషకాలు కడుపు ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్ వంటి వాటిని తగ్గించడమే కాకుండా గట్ హెల్త్​ను మరింత మెరుగుపరుస్తాయంటున్నారు.

మంచి డిటాక్సిఫికేషన్ డ్రింక్ : ఈ సమ్మర్ స్పెషల్ హెర్బల్ టీ మంచి డిటాక్సిఫికేషన్ డ్రింక్​గా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. అంటే.. శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా, శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడడంలో ఈ డ్రింక్ చాలా బాగా యూజ్ అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

గుండె ఆరోగ్యానికి మేలు : నిమ్మరసం, పసుపులోని యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా ధమనులలో అడ్డంకి ఏర్పడకుండా కాపాడతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. అంతేకాకుండా, నల్ల మిరియాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయని సూచిస్తున్నారు.

క్యాన్సర్​ నుంచి డీహైడ్రేషన్​ వరకు - తాటి ముంజలతో ఎన్నో బెనిఫిట్స్​!

బరువు తగ్గడంలో సహాయపడుతుంది : ఈ హెర్బల్ టీ బరువు తగ్గడంలో చాలా బాగా సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నిమ్మరసంలో ఉండే పెక్టిన్ ఫైబర్ అతిగా తినాలనే కోరికలను నియంత్రించి, కడుపు నిండిన భావనను కలగజేస్తుందని న్యూట్రసీ లైఫ్​స్టైల్ వ్యవస్థాపకురాలు, న్యూట్రిషనిస్ట్ డాక్టర్ రోహిణి పాటిల్ పేర్కొన్నారు. అలాగే పసుపు జీవక్రియను పెంచుతుందని, నల్ల మిరియాలు కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడతాయన్నారు. అదేవిధంగా.. 2019లో "అపెటైట్" అనే జర్నల్​లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. 12 వారాల పాటు రోజుకు ఒకసారి ఈ హెర్బల్ టీ తీసుకున్న వారు సగటు 3శాతం శరీర కొవ్వును తగ్గించుకున్నారని వెల్లడైంది.

మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది : నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది. ఇది న్యూరోట్రాన్స్మిటర్ పనితీరుకు మద్దతు ఇచ్చి మానసిక స్థితి, అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పసుపు, మిరియాలలో ఉండే పోషకాలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ హెర్బల్​ టీ తయారీ విధానం:

  • ఒక గ్లాసులో అర టీస్పూన్​ పసుపు, 1 టేబుల్​ స్పూన్​ నిమ్మరసం, పావు టీ స్పూన్​ నల్ల మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు ఆ మిశ్రమంలో ఓ కప్పు వేడి నీరు పోసి కలపుకోవాలి. అంతే హెర్బల్​ టీ రెడీ.
  • రుచి కోసం, మీరు 1/2 టీస్పూన్ తేనె కూడా యాడ్​ చేసుకోవచ్చు.
  • ఈ షాట్​ని రోజుకు ఒకసారి ఉదయం ఖాళీ కడుపుతో తాగడం మంచిది.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

సమ్మర్​లో ఈ పదార్థాలు అస్సలు తినకండి - తీవ్ర అనారోగ్య సమస్యలు గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.