ETV Bharat / health

ఆఫ్ట్రాల్ అరటి 'తొక్కే' కదా అని చెత్తబుట్టలో వేస్తున్నారా? - అయితే ఈ ప్రయోజనాలు మిస్​ అయినట్లే! - Banana Peel Health Benefits

Banana Peel Health Benefits : మ‌న‌లో చాలా మంది అర‌టి పండు తిన్న త‌ర్వాత తొక్కతో పనేంటని తీసి డస్ట్​బిన్​లో పడేస్తుంటారు. కానీ, ఇకపై అలా చేయకండి! ఎందుకంటే పండుతో పోలిస్తే అరటి తొక్కతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఆ ప్రయోజనాలేంటంటే..

Banana Peel
Banana Peel Health Benefits
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 28, 2024, 4:50 PM IST

Health Benefits of Banana Peel : సీజన్‌తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో అందరికీ అందుబాటులో ఉండే పండు.. అరటి. చౌక ధరకే లభిస్తూ అందరికీ తినడానికి సౌలభ్యంగా ఉంటుంది. అలాగే.. ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అయితే, మెజార్టీ పీపుల్ బనానా తిన్నాక తొక్క పడేస్తారు. మీరూ ఇలానే అరటి పండు తిన్న తర్వాత తొక్క పడేస్తున్నారా? అయితే, అరటి తొక్కతో(Banana Peel) లభించే ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఇకపై అస్సలు బయటపడేయరంటున్నారు నిపుణులు. పండు కంటే కూడా తొక్క ద్వారా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది : అరటిపండు తొక్కలలో పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్లు, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడడంలో చాలా బాగా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ తొక్కలను ఎక్కువగా తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలు పెరిగి క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుందని సూచిస్తున్నారు నిపుణులు.

కొలెస్ట్రాల్​ను తగ్గించుకోవచ్చు : అరటి తొక్కలు కరిగే, కరగని ఫైబర్​లను కలిగి ఉంటాయి. వీటితో పాటు అరటిలోని పోషకాలు కొలెస్ట్రాల్​ను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. ఫలితంగా గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చంటున్నారు.

కళ్లకు మేలు చేస్తాయి : బనానా తొక్కలలో ఉండే పోషకాలు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కంటిశుక్లం వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయట. అంతేకాదు.. అరటి తొక్కలు కంటి కింద ఉబ్బడం, నల్లటి మచ్చలను తగ్గించడంలోనూ చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. ఇందుకోసం అరటి పై తొక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి.. వాటిని కంటి కింద 15 నిమిషాలు ఉంచి ఆపై క్లెన్సర్​తో శుభ్రం చేసుకుంటే తేడాను మీరే గమనించవచ్చంటున్నారు.

2018లో 'మెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్' అనే జర్నల్​లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. అరటిపండు తొక్కలో ఉండే టానిన్లు చర్మ సంరక్షణలో చాలా సహాయపడతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ అడెలిన్ కికామ్ పాల్గొన్నారు. అరటి తొక్కలలోని పోషకాలు చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు కంటి కింద నల్లటి వలయాలు, వాపు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు.

అరటి పండ్లు ఆరోగ్యానికి మంచివే - కాని అతిగా తింటే ఈ ప్రాబ్లమ్స్ గ్యారెంటీ!

మలబద్ధకం నుంచి ఉపశమనం : అరటి తొక్కలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది సాధారణ పేగు కదలికలకు సహాయపడడమే కాకుండా జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా వృద్ధికి చాలా బాగా సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు నిపుణులు.

మెరిసే పళ్లు సొంతం : మీ దంతాలు తెల్లగా లేవని బాధపడుతున్నారా? అయితే బాధపడటం మానేసి పళ్లపై అరటి తొక్క లోపలి భాగాన్ని రుద్దండి. రెండు వారాలు ఇలా చేశారంటే వీటిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, ఇతర పోషకాలు మీ దంతాలు తెల్లగా మెరిసేలా చేస్తాయంటున్నారు నిపుణులు.

మొటిమలను నయం చేస్తుంది : యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు పుష్క‌లంగా ఉన్న అర‌టి తొక్క‌లు మొటిమ‌లు, వాటి బాధ నుంచి విముక్తి క‌లిగిస్తాయంటున్నారు నిపుణులు. అరటి తొక్క లోపలి భాగాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల మంటను తగ్గించి, చికాకుగా ఉన్న చర్మానికి ఉప‌శ‌మ‌నాన్ని కలిగిస్తాయంటున్నారు నిపుణులు. అంతేకాదు చర్మంపై ఉన్న ముడతలను తగ్గించి యవ్వనంగా కనిపించేలా సహాయపడతాయని చెబుతున్నారు.

ఇవేకాకుండా.. అరటి తొక్కలలో ఉండే పోషకాలు UV రేడియేషన్ నుంచి చర్మాన్ని రక్షించడంలో కూడా చాలా బాగా సహాయపడతాయని చెబుతున్నారు. డిప్రెషన్‌ని తగ్గిస్తాయంటున్నారు. ఇకపోతే దోమలు లేదా ఏదైనా ఇతర కీటకాలు కుట్టినప్పుడు చాలా మంటగా అనిపిస్తుంది. అప్పుడు అవి కుట్టిన చోట అరటి తొక్కతో రుద్దడం దురద, మంట నుంచి ఉపశమనం లభిస్తుందట.

అరటి తొక్కలను ఎలా తినాలంటే : నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అరటి తొక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్​ చేసుకుని వేయించుకొని చిప్స్​లాగా తినవచ్చు. లేకుంటే స్మూతీస్‌లో కలిపి తినవచ్చు. అలాకాకుండా వాటిని ఫ్రై చేసుకొని సైడ్ డిష్​గా తీసుకోవచ్చంటున్నారు నిపుణులు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే.. ఈ మధ్య అరటిపళ్లను రసాయనాలతో మగ్గబెడుతున్నారు. కాబట్టి తీసుకునే వాటిని బాగా కడగడం మంచిదంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రోజూ అరటిపండు తింటే బరువు పెరుగుతారా? తగ్గుతారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.