ETV Bharat / health

AC లేకుండా పడుకోవడం లేదా? ఎంత ప్రమాదమో తెలిస్తే షాక్​! - ac side effects on human body - AC SIDE EFFECTS ON HUMAN BODY

AC Side Effects On Human Body : కాలంతో వాతావరణంతో పని లేకుండా ఏసీ గదుల్లోనే సమయాన్ని గడిపేస్తున్నారా? ఒక్కమాటలో చెప్పాలంటే ఏసీ లేనిదే ఉండలేకపోతున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే! అదేంటో తెలవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

AC Side Effects On Human Body
AC Side Effects On Human Body (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 6:20 AM IST

AC Side Effects On Human Body : కేవలం ఎండాకాలంలోనే కాదు చాలా మందికి ఏసీ వాడటానికి సీజన్​తో వాతావరణంతో సంబంధం లేదు. ఇంట్లో, ఆఫీసులో, కార్లో ఎక్కడైనా సరే ఏసీ ఉండాల్సిందే. అంతలా దానికి అలవాటు పడిపోయారు అనేక మంది. ఆ అలవాటు ఎంత మంచిది? ఎప్పుడూ ఏసీ ఆన్ లోనే ఉంచి పడుకోవడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది. తెలుసుకుందాం రండి.

పొడి కళ్లు: AC ఆన్​లో ఉంచి పడుకోవడం వల్ల గాలి నుంచి తేమను తొలగిపోతుంది. దీంతో కళ్లు పొడిగా మారి దురద కలిగి అసౌకర్యానికి దారితీస్తుంది.

బద్ధకం: చల్లని ఉష్ణోగ్రతలు జీవక్రియ రేటును తగ్గించి, శరీర ప్రక్రియలను నెమ్మదిస్తాయి. ఫలితంగా అలసట, మగత పెరిగి బద్దకంగా మారతారు.

డీ హైడ్రేషన్: ఏసీ నుంచి విడుదలయ్యే పొడి గాలి వేగవంతంగా వ్యాపించి తేమను దూరం చేస్తుంది. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్​కు గురవతుంది. అందుకు తగ్గట్టుగా ద్రవాలను తాగడం ద్వారా డీ హైడ్రేషన్ నుంచి తప్పించుకోగలం.

దురద: ఏసీలో ఉండటం వల్ల చర్మం తేమను కోల్పోయి పొడిగా, పొరలుగా మారి చికాకును కలిగిస్తుంది. ఫలితంగా దురద సమస్య వస్తుంది.

తలనొప్పి: ఆకస్మికంగా ఉష్ణోగ్రతల్లో కలిగే మార్పులు శ్వాస సమస్యలకు దారి తీస్తాయి. అలా చల్లటి వాతావరణంలోనూ ఏసీ వాడకం తలనొప్పి, సైనస్ వంటి సమస్యలను ప్రేరేపిస్తుంది.

శ్వాసకోశ సమస్యలు: ఏసీల నుంచి వీచే చల్లని, పొడి గాలి ఊపిరితిత్తులకు పోయే వాయుమార్గాలను చికాకు పెడుతుంది. ఇది ఉబ్బసం, అలెర్జీల వంటి దారుణమైన పరిస్థితులకు దారి తీస్తుంది.

అలర్జీలు: ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలు దుమ్ము, ధూళి కణాలు వంటి అలర్జీ కారకాలను కలిగి ఉంటాయి. ఇది అలర్జీ ప్రతిచర్యలను ప్రేరేపిస్తుంది.

అంటు వ్యాధులు: ఎయిర్ కండిషనర్లు నిరంతరాయంగా వాడుతుండటం వల్ల బాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు వ్యాప్తి చెందుతాయి. తద్వారా అంటువ్యాధులు ఏర్పటి ఇంట్లో అందరినీ ఇబ్బంది పెడతాయి.

కాలుష్య కారకాలు: ఏసీ గాలి దుమ్ము, పెంపుడు జంతువుల చర్మపు వెంట్రుకలు వంటి కాలుష్య కారకాలను శోషించుకుని, శ్వాసకోశ చికాకు, ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.

జాగ్రత్తలు:
ఎయిర్ కండీషనర్‌లను సరిగ్గా వినియోగిస్తేనే క్షేమంగా ఉండగలం. ప్రత్యేకించి నవజాత శిశువులకు సురక్షితంగా ఉండటానికి శిశువు శరీర ఉష్ణోగ్రతకు సరిపడా ఉష్ణోగ్రతను తప్పకుండా మెయింటైన్ చేయాలి. నవజాత శిశువును గదిలోకి తీసుకురావడానికి కనీసం 20 నిమిషాల ముందు AC ఆన్ చేయాలని, 25-27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. కొంతమంది నవజాత శిశువులు కూడా చల్లని ఉష్ణోగ్రతలకు అలర్జీని కలిగించవచ్చు. అలాంటి వారిని ఏసీకి దూరంగా ఉంచడమే మంచిది. అంతే కాకుండా దుమ్ము వంటి అలర్జీలను నివారించడానికి ఎయిర్ కండీషనర్లను తరచుగా శుభ్రం చేయాలి.

భయపడి షుగర్​ తినడం మానేస్తున్నారా? మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా? - What Happens Not Eating Sugar

మీకు 'నోమోఫోబియా' ఉందా? ఒక్క క్షణం స్మార్ట్​ఫోన్ లేకపోయినా ఇలా అవుతోందా? - What is Nomophobia

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.