ETV Bharat / health

నోటికి చేదు.. నెత్తికి అమృతం! - కాకరకాయ రసంతో హెయిర్​ ఫాల్​, తెల్ల జుట్టుకు చెక్! - Hair Care Benefits of Bitter Gourd - HAIR CARE BENEFITS OF BITTER GOURD

Bitter Gourd: కాకరకాయ రుచికి చేదుగా ఉన్నా.. దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. అయితే.. కాకర కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదని.. కురుల అందానికీ కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Bitter Gourd
Hair Care Benefits of Bitter Gourd (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 18, 2024, 9:52 AM IST

Hair Care Benefits of Bitter Gourd: ప్రస్తుతం చాలా మందిలో జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం, చుండ్రు, జుట్టు పొడిబారడం, తెల్ల జుట్టు వంటి సమస్యలు ఉన్నాయి. ఇందుకు కారణాలు అనేకం. అయితే.. ఈ సమస్యలకు పరిష్కారం కాకర రసం అని నిపుణులు అంటున్నారు. కాకర రసం జుట్టుకు పట్టించడం వల్ల సమస్యలు తగ్గిపోతాయని.. కుదుళ్లు దృఢంగా, కురులు ఒత్తుగా తయారవుతాయంటున్నారు. మరి.. కాకర రసాన్ని ఎలా అప్లై చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

చుండ్రు తగ్గించడానికి: పోషకాహారం తీసుకోకపోవడం, కాలుష్యం.. తదితర కారణాల వల్ల చాలా మందిలో చుండ్రు సమస్య ఎదురవుతుంది. దీనికోసం కొద్దిగా జీలకర్ర తీసుకొని మెత్తటి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని కాకర రసంలో కలిపి మాడుకు అప్త్లె చేసుకోవాలి. కొంతసేపు ఆరనిచ్చి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయడం ద్వారా చుండ్రు సమస్య నుంచి విముక్తి కలుగుతుందని చెబుతున్నారు.

జుట్టు రాలే సమస్య: అరకప్పు కాకర రసాన్ని తీసుకొని, అందులో చెంచా కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి పట్టించాలి. మాడుకు కూడా రాసి 5 నుంచి 10 నిమిషాల పాటు మసాజ్​ చేసుకోవాలి. ఆ తర్వాత 40నిమిషాల పాటు ఆరనివ్వాలి. అనంతరం గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు అప్త్లె చేస్తే జుట్టు రాలే సమస్య అదుపులోకి వస్తుందని అంటున్నారు.

2013లో జర్నల్ ఆఫ్ డెర్మటాలజీకల్ సైన్స్​లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. కాకరకాయలోని యాంటీఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను అడ్డుకోవడంలో సహాయపడతాయని.. ఇవి జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని బీజింగ్‌లోని చైనా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని డెర్మటాలజీ డిపార్ట్‌మెంట్​లో డాక్టర్ యాంగ్ షాన్ పాల్గొన్నారు.

అలర్ట్​: మార్నింగ్ బ్రష్ చేయకుండా "వాటర్" తాగుతున్నారా? - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి! - Drink Water Without Brushing

తెల్లజుట్టు సమస్యకు: వివిధ కారణాల వల్ల కొంతమందిలో కుదుళ్ల వద్ద మెలనిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఫలితంగా చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారిపోతుంది. ఇలాంటి సమయంలో కాకరను ఉపయోగించడం మంచిదని... దీనికోసం సరిపడా కాకర రసాన్ని తీసుకొని దాన్ని వెంట్రుకల కుదుళ్ల నుంచి చివరి దాకా అప్లై చేసి గంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు చేయడం వల్ల తెల్లజుట్టు తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు.

చివర్లు చిట్లితే..: హెయిర్‌కేర్ ఉత్పత్తుల్లోని రసాయనాలు, బయట కాలుష్యం కారణంగా జుట్టు చివర్లు చిట్లడం సాధారణం. దీన్ని నివారించడానికి సరిపడినంత కాకరకాయ రసాన్ని తీసుకొని కురులకు పట్టించాలి. 40 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. మూడు వారాల్లోనే మంచి ఫలితం కనిపిస్తుందని అంటున్నారు.

పొడిబారిన జుట్టుకు: కాకర రసం, పెరుగు అరకప్పు చొప్పున తీసుకోవాలి. ఇందులో రెండు చెంచాల నిమ్మరసం యాడ్​ చేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొంత భాగాన్ని మాడుకు పట్టించి కాసేపు మునివేళ్లతో మృదువుగా మసాజ్​ చేయాలి. మిగిలిన భాగాన్ని వెంట్రుకలకు మొత్తం పట్టించి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

వయసు మీద పడటం, ఎక్కువ సేపు కూర్చోవడం మాత్రమే కాదు - "నడుము నొప్పి"కి ఇవీ కారణాలే! - Causes Of Back Pain

వర్షాకాలంలో ఈ ఫ్రూట్స్​ తింటే - ఇన్ఫెక్షన్లకు గుడ్​బై చెప్పొచ్చు! - Fruits to Fight With Infections

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.