ETV Bharat / health

మీకు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గిపోతోందా ? నో టెన్షన్​, ఈ పనులతో మీ బ్రెయిన్ సూపర్​ షార్ప్​! - Best Habits to Make Brain Powerful - BEST HABITS TO MAKE BRAIN POWERFUL

Brain Health Tips : మీరు తరచుగా మీ చుట్టు పక్కల వారి పేర్లు మర్చిపోతున్నారా ? జ్ఞాపకశక్తి తగ్గిపోయి చేయాలనుకున్న పనులను చేయలేకపోతున్నారా ? అయితే, ఈ లక్షణాలు మీ మెదడు ఆరోగ్యం ప్రమాదంలో ఉందనడానికి ఒక సంకేతం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. బ్రెయిన్‌ ఆరోగ్యంగా, షార్ప్‌గా ఉండటానికి కొన్ని అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Make Brain Powerful
Habits to Make Brain Powerful (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 7, 2024, 12:37 PM IST

Best Habits to Make Brain Powerful: మెదడు మన శరీరంలో జ్ఞానేంద్రియాలన్నింటికీ ముఖ్యమైన కేంద్రం. బ్రెయిన్‌ చురుగ్గా పని చేసినన్ని రోజులు మనం ఆరోగ్యంగా, చురుగ్గా పనిచేస్తామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ప్రస్తుత కాలంలో మెజార్టీ జనాలు ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు టైమ్‌తో పరిగెత్తడం వల్ల ఒత్తిడిని అనుభవిస్తున్నారు. దీనివల్ల మెదడు ఆరోగ్యం దెబ్బతింటుందని.. ఏకాగ్రత కోల్పోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, మెదడు చురుగ్గా పనిచేయడానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వ్యాయామం చేయండి : మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం ఎంతో ఉపయోగపడుతుంది. రోజూ వ్యాయామం చేయడం వల్ల మెదడుకు రక్త ప్రవాహాం పెరుగుతుంది. దీనివల్ల బ్రెయిన్‌కు ఆక్సిజన్, పోషకాలు తగిన స్థాయిలో అందుతాయని నిపుణులంటున్నారు. అలాగే వాకింగ్‌, జాగింగ్‌, స్విమ్మింగ్‌ చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని చెబుతున్నారు. కాబట్టి, మీరు డైలీ అరగంట సమయాన్ని వ్యాయామం చేయడానికి కేటాయించాలని సూచిస్తున్నారు.

జంక్‌ఫుడ్‌కు దూరంగా : ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది ప్రాసెస్‌ చేసిన ఆహారాలు తీసుకుంటున్నారు. అలాగే చక్కెర, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు ఉండే జంక్‌ఫుడ్‌, ఫాస్ట్‌ఫుడ్‌ తింటున్నారు. అయితే, వీటిని తరచుగా తినడం వల్ల మెదడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల దీర్ఘకాలంలో డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

2019లో 'న్యూట్రీషన్ జర్నల్' లో ప్రచురించిని అధ్యయనం ప్రకారం.. జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తినే వ్యక్తులలో డిప్రెషన్, ఆందోళన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనను న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ 'డాక్టర్‌ బ్రెండా పెన్' నిర్వహించారు. జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తినే వ్యక్తులలో డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని వారు పేర్కొన్నారు.

డైలీ 3 బాదం పప్పులు తింటే చాలు- మీ బ్రెయిన్ ఫుల్​ యాక్టివ్​, గుండె సమస్యలకు చెక్​!

కంటినిండా నిద్ర : మన నిద్ర పోయిన సమయంలోనే మన బ్రెయిన్​కు రెస్ట్​ దొరుకుతుంది. అప్పుడే మన జ్ఞాపకాలు, కొత్తగా నేర్చుకున్న అంశాలను ఓ క్రమపద్ధతిలో స్టోర్ చేసుకుంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధన ప్రకారం నిద్ర లేకపోవడం అభిజ్ఞా పనితీరును బలహీనపరుస్తుందని, జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేస్తుందని కనుగొన్నారు. కాబట్టి మెదడును పదునుగా ఉంచడానికి ప్రతి రాత్రి తగినంత నాణ్యమైన నిద్ర పోయేలా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.

ఒత్తిడి తగ్గించుకోండి : ఆఫీస్‌ టెన్షన్‌లు, పని ఒత్తిడి, కుటుంబ సమస్యలంటూ నిత్యం ఒత్తిడిని అనుభవించడం వల్ల.. మెదడులో కార్టిసాల్‌ అనే హార్మోన్ స్థాయులు పెరుగుతాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతిస్తాయి. దీర్ఘకాలంలో మెదడు కణాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి రోజూ యోగా, ధ్యానం వంటి వాటిని అలవాటు చేసుకోండి.

మెదడు ఆరోగ్యంగా ఉండటానికి మరికొన్ని మార్గాలు :

  • స్మోకింగ్‌ అలవాటును పూర్తిగా మానేయండి.
  • బ్రెయిన్‌ చురుగ్గా పనిచేయడానికి పజిల్స్‌ ట్రై చేయండి. అలాగే కొత్త నైపుణ్యాలను, భాషలను నేర్చుకోవడానికి ప్రయత్నించండి.
  • ఒత్తిడిగా ఉన్నప్పుడు మనసుకు నచ్చిన సంగీతం వినండి.
  • అలాగే స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి మనసు విప్పి మాట్లాడండి. ఈ చిన్నచిన్న అలవాట్ల ద్వారా మెదడు ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నారా? - బ్రెయిన్​లో ఏదో జరుగుతోందని టెన్షన్​ పడుతున్నారా?? - ఇలా చేయండి!

రీసెర్చ్ : మీ పిల్లలు చదవట్లేదా? చదివినా గుర్తుండట్లేదా?? - ఇవి తప్పక తినిపించండి - సూపర్ మెమరీ పవర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.