ETV Bharat / health

రెడ్ యాపిల్ Vs గ్రీన్ యాపిల్ - డయాబెటిస్ పేషెంట్స్​కు ఈ రెండింటిలో ఏది మంచిది! - Red Vs Green Apple Which One Better

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 5:50 PM IST

Green Apples Good For Diabetics : ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా షుగర్ వ్యాధి రావడం సాధారణమైపోయింది. ముఖ్యంగా డయాబెటిస్ వచ్చిన వారు తినాల్సిన ఆహారం విషయంలో కఠినమైన ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు. అయితే, మధుమేహ వ్యాధిగ్రస్థులు రెడ్ యాపిల్ లేదా గ్రీన్ యాపిల్​లో ఏది తింటే ఆరోగ్యానికి మంచిదో మీకు తెలుసా?

Red Vs Green Apple Which One Is Better
Green Apples For Diabetics (ETV Bharat)

Red Vs Green Apple Which One Is Better : పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ, డయాబెటిస్ ఉన్నవారు పండ్లు తినాలన్నా భయపడిపోతుంటారు. ఎందుకంటే.. పండ్లలో చక్కెర స్థాయులు ఎక్కువగా ఉంటాయని భావిస్తారు. ఒకవేళ తినాలనుకుంటే గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండే పండ్లను ఎంచుకుంటుంటారు. అలాంటి వాటిల్లో ఒకటి.. యాపిల్. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, అసలు ప్రాబ్లమ్ వచ్చేసరికి.. మార్కెట్లో రెడ్ యాపిల్, గ్రీన్ యాపిల్ అనేవి లభ్యమవుతుంటాయి. ఈ క్రమంలోనే డయాబెటిస్ ఉన్న చాలా మందిలో ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి బెటర్ అనే సందేహం వస్తుంటుంది. ఇంతకీ, వీటిలో మధుమేహం(Diabetes) ఉన్నవారికి ఏది మంచిది? దేని వల్ల ఎక్కువ ప్రయోజనాలు? నిపుణులు ఏం చెబుతున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నిజానికి యాపిల్ తినడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే, మార్కెట్లో లభించే రెడ్, గ్రీన్ యాపిల్స్​లో ఉండే విటమిన్లు, ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. కానీ, డయాబెటిస్ పేషెంట్స్ విషయానికొస్తే.. రెడ్ యాపిల్స్ కంటే గ్రీన్ యాపిల్స్ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా.. గ్రీన్ యాపిల్ చాలా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుందట. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్​లో ఉంచి.. టైప్ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు. కాబట్టి.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు గ్రీన్ యాపిల్ ఎంతో మేలు చేస్తుందని సూచిస్తున్నారు.

2018లో "అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్​"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. 12 వారాల పాటు రోజుకు మూడు ఆకుపచ్చ ఆపిల్స్ తిన్న టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తులలో.. రోజుకు మూడు ఎరుపు ఆపిల్స్ తిన్న వారి కంటే.. వారి రక్తంలో చక్కెర స్థాయిలు, HbA1c స్థాయిలు గణనీయంగా తగ్గాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో కెనడాలోని టొరంటోలోని మౌంట్ సినాయ్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ డానా ఝు పాల్గొన్నారు. మధుమేహం ఉన్నవారు రెడ్ యాపిల్స్ కంటే గ్రీన్ యాపిల్స్ తినడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని డానా ఝు పేర్కొన్నారు.

అలర్ట్​: ఎగ్స్​ తింటే షుగర్ వస్తుందా? - పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు!

గ్రీన్​ యాపిల్స్​ ఇతర ప్రయోజనాలు చూస్తే..

రోగనిరోధక శక్తి పెరుగుతుంది : గ్రీన్ యాపిల్స్​లో ఉండే పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్​లో ఉంచడమే కాకుండా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయంటున్నారు. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, ఫాలినోయిడ్స్​తో పాటు మరికొన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. ఇవి ఇమ్యూనిటీ పవర్​ను పెంచడంలో తోడ్పడతాయని చెబుతున్నారు.

జీర్ణక్రియకు మేలు : గ్రీన్ యాపిల్స్​లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. మలబద్ధకం, అజీర్తి వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుందని చెబుతున్నారు.

క్యాన్సర్ నివారణకు తోడ్పడతాయి : దీనిలో ఉండే ఫైటోకెమికల్స్ క్యాన్సర్‌ను నివారించడంలో కూడా చాలా బాగా పనిచేస్తాయంటున్నారు. అలాగే ఇందులోని పీచు.. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ చేసి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. అదే విధంగా.. గ్రీన్ యాపిల్​లోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మెదడు కణాలను దెబ్బతినకుండా కాపాడతాయంటున్నారు నిపుణులు.

బరువు తగ్గడానికి తోడ్పడుతుంది : గ్రీన్ యాపిల్ ఫైబర్, ఇతర పోషకాలతో దండిగా ఉంటుంది. కాబట్టి ఇది తినడం ద్వారా త్వరగా ఆకలి వేయదు. ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి ఇది బెటర్ ఆప్షన్​గా చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఉదయాన్నే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీకు డయాబెటిస్​ ఉన్నట్లే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.