Grapes Health Benefits In Telugu : ద్రాక్ష పండ్లు ఏ సీజన్లోనైనా మార్కెట్లో లభిస్తుంటాయి. ఈ పండ్ల ధర సైతం సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది. అందుకే పేద నుంచి ధనిక వర్గాల వరకు అందరూ వీటిని తింటుంటారు. వీటిని తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు సైతం అన్ని ఇన్నీ కావు అంటున్నారు డైటీషియన్స్. వీటిలో ఉండే విటమిన్లు,ఫైబర్, మినరల్స్, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గ్రీన్, బ్లాక్, రెడ్ కలర్లలో ఉండే ఈ ద్రాక్షలు తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?. ఏ రకం ద్రాక్ష దేనికి మేలు? అనే విషయాలపై ప్రముఖ న్యూట్రీషన్ అవ్నీకౌల్ ఇచ్చిన సలహాలు మీకోసం.
ద్రాక్ష పండ్లు తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
గ్రీన్ గ్రేప్స్
మనం తరచుగా తినే ద్రాక్ష పండ్లలో ప్రధానమైనవి గ్రీన్ గ్రేప్స్. సాధారణంగా తీపి, పులుపు రుచులలో ఉండే వీటిని సలాడ్స్, ఇతర క్రీమ్లలో వాడతారు. ఒక కప్పు గ్రీన్ గ్రేప్స్లో 104 కేలరీలు, 1.4 గ్రాముల ప్రోటీన్, 0.2 గ్రాముల కొవ్వు, 27.3 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంతే కాకుండా వీటిని తినటం వల్ల శరీరానికి విటమిన్ 'సి', విటమిన్ 'కే'లు అధికంగా లభిస్తాయి. విటమిన్ 'సి' తో రోగ నిరోధక శక్తి పెరగుతుంది. దీంతో పాటు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్ 'k' వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. అదే విధంగా దీనిలో ఉండే పొటాషియం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
బ్లాక్ గ్రేప్స్
నల్లని ద్రాక్ష పండ్లు తీపి పులుపు రుచులలో ఉండే దీనిని ఎక్కువగా వైన్ తయారీలో వాడుతుంటారు. ఎందుకంటే దీనిలో ఉండే టాన్నిన్ కంటెంట్ వైన్ రుచి రావటంలో ఉపయోగపడుతుంది. ఒక కప్పు నల్ల ద్రాక్షలో 104 కేలరీలు, 1.1 గ్రాముల ప్రోటీన్ , 27.3 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అంతే కాకుండా దీనిలోనూ విటమిన్ 'సి' , విటమిన్ ' కే' లు అధికంగా ఉంటాయి. అదేవిధంగా దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల కాన్సర్ కణాలు వ్యాప్తి చెందకుండా నిరోధిస్తాయి.
ఎర్ర ద్రాక్ష
సాధారణంగా తీపి, పులుపు రంగులో ఉండే ఈ ద్రాక్ష పండ్లని సలాడ్స్, జామ్, జెల్లీస్లలో వాడుతుంటారు. అంతే కాకుండా రెడ్ వైన్ తయారీలో దీనిని వాడుతుంటారు. ఒక కప్పు ద్రాక్షలో 104 కేలరీలు, 1.1 గ్రాము ప్రోటీన్ ,0.2 గ్రాముల కొవ్వు. 27.3 గ్రాముల కార్బోహైడ్రేటులు ఉంటాయి. దీనిలోను విటమిన్ 'సి', 'కే' లు అధికంగా ఉంటాయి.
'అన్ని రకాల ద్రాక్ష పండ్లు దాదాపు ఒకే రకమైన ప్రయోజనాలు అందిస్తుండగా నల్ల, ఎరుపు ద్రాక్షలో రెస్వరాట్రాల్ అధికంగా ఉంటుంది. ఇది కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా నియంత్రిస్తుంది. దీంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే వీటిని తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని' న్యూట్రిషన్ అవ్నీకౌల్ తెలిపారు.
మెదడు మొద్దుబారితే ప్రమాదం - ఇలా చేస్తే ఫుల్ యాక్టివ్ అయిపోతుంది!