ETV Bharat / health

గుడ్​ కొలెస్ట్రాల్​తో ఎన్నో ప్రయోజనాలు! ఈ నూనెలు వాడితే ఆరోగ్యానికి ఎంతో మేలు!!

Good Cholestrol Health Benefits : మన శరీరంలో కొలెస్ట్రాల్​ ఉంటుందని అందరికీ తెలుసు. అయితే కొలెస్ట్రాల్​ అనగానే మన ఆరోగ్యానికి మంచిది కాదు అనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ, శరీరంలోని మంచి కొలెస్ట్రాల్​ మనకు అనేక విధాలుగా సాయం చేస్తుంది. మరీ ముఖ్యంగా హార్మోన్ల ఉత్పత్తిలో, కొత్త కణాల ఉత్పత్తికి గుడ్​ కొలెస్ట్రాల్​ ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో మంచి కొలెస్ట్రాల్​ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? దానిని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 18, 2024, 7:27 AM IST

Good Cholestrol Ayurveda Oils Health Benefits In Telugu

Good Cholestrol Health Benefits : మన శరీరానికి శక్తి కావాలంటే ఆహారం తీసుకోవాలి. ఈ ఆహారం ద్వారా అందే శక్తి ఎక్కువైనప్పుడు శరీరం ఈ శక్తిని కొలెస్ట్రాల్​ రూపంలోకి మార్చుకొని నిల్వ ఉంచుకుంటుంది. ఇలా నిల్వ ఉంచిన కొలెస్ట్రాల్​ వల్ల కొన్నిసార్లు మనకు అనారోగ్య సమస్యలు రావచ్చు. అయితే కొలెస్ట్రాల్​ అనగానే మనకు కీడు చేస్తుందనే భావన ఉంటుంది. అయితే, ఇందులో కొంతవరకు మాత్రమే నిజం ఉంది.

గుడ్​ కొలెస్ట్రాల్​ మంచిదే
మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్​ ఉంటాయి. లోడెన్సిటి లైపోప్రోటీన్​ (ఎల్డీఎల్), హైడెన్సిటి లైపోప్రోటీన్ (హెచ్డీఎల్) అనే రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. వీటిలో లోడెన్సిటి లైపోప్రోటీన్​ అనేది శరీరాన్ని కాస్త ఇబ్బంది పెట్టేది. ఇది తరుచూ గుండె సంబంధిత ఇబ్బందులకు కారణమవుతుంది. ఇక హెచ్​డీఎల్ అనేది మన శరీరానికి మేలు చేసేది. దీని వల్ల హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి అవడమే కాకుండా కొత్త కణాల ఉత్పత్తి సక్రమంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో శరీరానికి మేలు చేసే హెచ్​డీఎల్​ని పెంచుకోవడానికి ఆయుర్వేదంలో ఏడు రకాల నూనెల గురించి ప్రస్తావించారు. మరి ఆ నూనెలు ఏంటి? వాటి వల్ల చేకూరే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కొబ్బరినూనె
భారతీయులు ఎక్కువగా వినియోగించే కొబ్బరినూనె హెచ్​డీఎల్​ను పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. లారిక్​ యాసిడ్ ఉండటం వల్ల ఇది గుండెకు ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరినూనెను తీసుకోవడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్​ మోతాదు పెరిగి అనారోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు.

నువ్వుల నూనె
ఆయుర్వేదంలో ఎక్కువ ప్రాధాన్యం కలిగిన నూనెల్లో నువ్వుల నూనె ఒకటి. ఇందులో మోనోశ్యాచురేటెడ్​ ఫ్యాట్స్​, పాలిశ్యాచురేటెడ్​ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి హెచ్​డీఎల్ పెరుగుదలకు ఉపయోగపడతాయి.

ఆలివ్ నూనె
గుండె రక్షణకు ఎంతో ప్రాచుర్యం పొందిన ఆలివ్​ ఆయిల్​ వల్ల శరీరంలో హెచ్​డీఎల్ లెవెల్స్​ పెరగడమే కాకుండా ఎల్డీఎల్​ స్థాయులు తగ్గుతాయి. ఆలివ్​ నూనెలో లభించే యాంటీఆక్సిడెంట్లు మంట స్థాయులను తగ్గిస్తాయి. అంతేకాకుండా గుండెను పదిలంగా ఉంచుతాయి.

ఆవ నూనె
వంట గదిలో ఎక్కువగా వాడే ఆవ నూనెతో మోనోశ్యాచురేటెడ్​ ఫ్యాట్స్, పాలిశ్యాచురేటెడ్​ ఫ్యాట్స్​ రెండూ శరీరంలో పెరుగుతాయి. ఇది హెచ్​డీఎల్ పెరుగుదలకు దోహదం చేస్తుంది. అందుకని ఈ నూనెను వంటకాల్లో వాడితే మంచిది.

బాదం నూనె
బాదం నూనెలో హెచ్​డీఎల్​ స్థాయులను పెంచే మోనోశ్యాచురేటెడ్​ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. అలాగే ఇది విటమిన్​-ఈతో పాటు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్​లను మన శరీరానికి అందిస్తాయి. దీంట్లో మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇవి మీ గుండెను జాగ్రత్తగా కాపాడుతాయి.

అవిసె గింజల నూనె
అవిసె మొక్కల విత్తనాల నుంచి సేకరించిన అవిసె గింజల నూనెలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి హెచ్​డీఎల్​ స్థాయులను పెంచి శరీరంలోని మంట లక్షణాలను తగ్గిస్తుంది. దీనిని సాధారణంగా మనం తినే ఆహారంలో జోడించుకోవచ్చు.

నెయ్యి
భారతీయులు తమ వంట గదిలో ఎప్పటికీ ఉంచుకునే పదార్థం నెయ్యి. దీని వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్​ పెరుగుతుంది. ఇందులో కంజుగేటెడ్​ లినోలెయిక్​ ఆమ్లం (సీఎల్ఏ) సమృద్ధిగా ఉంటుంది. ఇది హెచ్​డీఎల్​ లెవెల్స్​ను పెంచి శరీరానికి మేలు చేస్తుంది.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రోజూ 4 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగుతున్నారా ? అయితే మీరు డేంజర్​లో ఉన్నట్టే!

కాపర్​ బాటిల్​లో వాటర్ తాగుతున్నారా? - ఈ 10 విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.