Garlic Under Pillow Benefits : భారతీయ వంటకాల్లో వెల్లుల్లి లేకుండా వంటకు మంచి, రుచి రావడం అసాధ్యమనే చెప్పాలి. అలా మనం సాధారణంగా వాడేసే వెల్లుల్లి కేవలం సువాసన, రుచి కోసం మాత్రమే కాకుండా మనకు తెలియని ఎన్నో ప్రయోజనాలను అందిస్తుందట. దీనిని నేరుగా తీసుకోవడం వల్ల చాలా రకాల లాభాలు పొందవచ్చట. నేరుగా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు అనే విషయం తెలిసిందే కదా అనుకోకండి. ఇది నిజమా అబద్దమా అనే విషయం పక్కన పెడితే ఇదే కాకుండా మనిషికి చాలా అవసరమైన నిద్ర విషయంలో వెల్లుల్లి చాలా బాగా సహాయపడుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు దిండు కింద వెల్లుల్లి రెబ్బ పెట్టుకుని పడుకుంటే సైంటిఫిక్గా చాలా ప్రయోజనాలు ఉన్నాయట.
వెల్లుల్లిలో ఉండే న్యూట్రియంట్లు, విటమిన్- బీ6, థయామిన్, పాంటాతెనిక్ యాసిడ్, విటమిన్-సీలతో పాటు మాంగనీస్, పాస్పరస్, కాల్షియం, ఐరన్, జింక్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి బహుళ ప్రయోజనాలు సమకూరుస్తాయట. పడుకునే ముందు దిండు కింద వెల్లుల్లి పెట్టుకోవడం వల్ల దోమల బెడద తగ్గుతుందట. గదంతా మంచి సువాసనను వెదజల్లుతుందట. ఫలితంగా జలుబు, దగ్గు రాకుండా చేస్తుంది. అంతేకాకుండా ఇన్సోమ్నియాతో బాధపడే వారికి కూడా సహాయం చేస్తుందట. వెల్లుల్లిలో ఉండే విటమిన్లు బీ1, బీ6లు వల్ల మెలటోనిన్ నరాలకు అంది ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తుందట. వీటిల్లో ఉండే యాంటీ టాక్సిన్ గుణాలు, బిగుసుకుపోయిన ముక్కును క్లియర్ చేసి ఇన్ఫెక్షన్లను, శ్వాస సమస్యలను దూరం చేస్తుంది.
పురాతన చికిత్సా విధానాలను బట్టి వెల్లుల్లి రెబ్బ దిండు కింద పెట్టుకుని పడుకుంటే నిద్రాభంగం కలగకుండా ప్రశాంతంగా నిద్రను పొందొచ్చని తెలుస్తుంది. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ చక్కటి సువాసన వెదజల్లుతుంది. ఫలితంగా త్వరగా నిద్రకు ఉపక్రమించేలా చేసి శరీరానికి సేద తీరుస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న వెల్లుల్లిని నేరుగా వాసన పీల్చడం మీకు ఇష్టం లేకపోతే నీళ్లలో వేసుకుని వెల్లుల్లి రసాన్ని తాగేయొచ్చు. అలా చేయడం వల్ల కూడా వెల్లుల్లి వాసనతో వచ్చే ఫలితాన్ని పొందగలమట. పడుకునే ముందు దీన్ని తాగితే సరిపోతుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ముందుగా చిన్న గిన్నెలో వెల్లుల్లి రెబ్బను చిదిమి వేడి చేయాలి. ఆ తర్వాత ఒక గ్లాసు పాలు అందులో పోయాలి. గోరువెచ్చగా వేడి చేసుకుని మీ ఇష్టాన్ని బట్టి చక్కెర, తేనె లాంటివి రుచి కోసం యాడ్ చేసుకోవచ్చు. ఈ పాలను గోరు వుచ్చగా ఉన్నప్పుడు లేదా చల్లారిన తర్వాత తాగితే సరిపోతుంది. ప్రశాంతమైన నిద్రకు కారణమయ్యే ఈ వెల్లుల్లి చిట్కాను మీరు తప్పకుండా ట్రై చేయండి మరి.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.