ETV Bharat / health

మీ పిల్లలు ఎత్తు పెరగట్లేదని బాధపడుతున్నారా? - ఈ ఫుడ్‌ తినిపించండి - మార్పును మీరు ఊహించలేరు! - Height Increase Foods

Height Increase Foods For Child : పిల్లలు ఎత్తు పెరగకపోతే.. తల్లిదండ్రులకు చాలా బాధగా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. దీంతో ఏవేవో ఎనర్జీ డ్రింక్స్‌ తాగిస్తుంటారు. అయితే.. కొన్ని రకాల ఆహార పదార్థాలను డైలీ తినిపించడం ద్వారా పిల్లలు చక్కగా ఎత్తు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. ఆ ఆహార పదార్థాలు ఏంటో మీకు తెలుసా ?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 24, 2024, 9:50 AM IST

Height Increase Foods For Child
Height Increase Foods For Child (ETV Bharat)

Foods TO Increase Children Height : పిల్లలు ఎత్తు పెరిగేందుకు కొన్ని రకాల ఆహార పదార్థాలను తరచూ అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటి ద్వారా పిల్లలు త్వరగా హైట్‌ పెరుగుతారని అంటున్నారు. పిల్లలు ఎదిగేందుకు దోహదపడే ఫుడ్‌ ఐటమ్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.

పాలు, పాల ఉత్పత్తులు : పాలు, కొన్ని రకాల పాల ఉత్పత్తులలో విటమిన్ డి ఉంటుంది. ఇది పిల్లల ఎముకలు ఆరోగ్యంగా ఎదిగేలా ఎంతో సహాయం చేస్తుంది. అలాగే వీటిలో ఫాస్పరస్, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్ బి2 (రిబోఫ్లావిన్), విటమిన్ బి12 వంటి ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఇవన్నీ పిల్లల హైట్‌ పెరిగేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

సోయా బీన్స్ : సోయా బీన్స్‌లో ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు, కండరాల పెరుగుదలకు చాలా అవసరం. అలాగే సోయా బీన్స్‌లో ఉండే అమైనో ఆమ్లాలు కణాల పెరుగుదలకు తోడ్పడతాయి. ఇంకా సోయా బీన్స్‌లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది పిల్లల ఎముకలు, దంతాలు దృఢంగా ఉండేందుకు సహాయం చేస్తుంది. అందుకే పిల్లలకు తరచూ సోయా బీన్స్‌తో చేసిన ఆహార పదార్థాలను అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.

కోడి గుడ్లు : పిల్లలు క్రమం తప్పకుండా ఎగ్స్‌ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు.. ఎత్తు కూడా పెరుగుతారు. ఎగ్స్‌లో ఎన్నో రకాల ఆరోగ్యకరమైన పోషకాలుంటాయి. ఇవన్నీ ఎదిగేందుకు తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. 2000లో 'జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌'లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. గుడ్డులోని ప్రొటీన్, కాల్షియం, విటమిన్ బి12, రిబోఫ్లావిన్‌తో సహా పిల్లలకు అవసరమైన అనేక పోషకాలు ఇందులో ఉన్నాయని.. ఈ పోషకాల వల్ల రోజుకు ఒక గుడ్డు తినే పిల్లలు తినని వారి కంటే.. ఎక్కువ ఎత్తు పెరిగినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూట్రిషన్ అండ్ చైల్డ్‌ హెల్త్‌ ఎక్సపర్ట్‌, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ ఆస్టిన్‌ ప్రొఫెసర్ 'డాక్టర్ మార్గరెట్ డి. లియోనార్డ్' పాల్గొన్నారు.

మీ పిల్లలు వయసుకు తగ్గ బరువు, ఎత్తు పెరిగారా? ఈ చార్ట్​తో చెక్ చేసుకోండి!

చికెన్ : పిల్లలు ఎత్తు పెరిగేందుకు చికెన్ మంచి ఆహారం. ఇందులో ఐరన్‌, జింక్‌ వంటి ఎన్నో పోషకాలుంటాయి. ఇవి పిల్లలు వయసుకు తగినట్లు ఎత్తు పెరిగేందుకు సహాయం చేస్తాయి.

ఆకుకూరలు : వీటిలో కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇవి పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో హెల్ప్‌ చేస్తాయి. కాబట్టి, తరచూ పిల్లలకు ఆకుకూరలను డైట్‌లో భాగం చేయాలి.

క్యారెట్ : క్యారెట్‌లో పిల్లలు ఎత్తు పెరగడానికి అవసరమైన ఎన్నో పోషకాలుంటాయి. తరచూ వీటితో కర్రీ చేసి తినిపించడం, సలాడ్‌ చేసి ఇవ్వడం ద్వారా హైట్ పెరిగే అవకాశం ఉంటుంది.

  • వీటితో పాటు పిల్లలు ఎత్తు పెరిగేందుకు సీజనల్‌ ఫ్రూట్స్‌ తప్పక తినిపించాలి.
  • అలాగే తృణధాన్యాలతో చేసిన ఫుడ్‌ ఐటమ్స్‌ని అందించడం ద్వారా ఫాస్ట్‌గా హైట్‌ పెరిగే అవకాశం ఉంటుంది.
  • ఇంకా మిక్స్‌డ్‌ నట్స్‌, సీడ్స్‌ అందించడం ద్వారా కూడా ఎత్తు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

మీ పిల్లలు హైట్​ పెరగాలంటే ఎనర్జీ డ్రింక్స్ తాగించడం కాదు - ఇలా చేయండి వెంటనే గ్రోత్​ మొదలైద్ది!

చిరుధాన్యాలతో చిన్నారులకు ఎంతో మేలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.