ETV Bharat / health

పనికిరానివని పడేస్తున్నారా? ఇవి బాత్రూంలో పెడితే ఎప్పుడూ సువాసనే! - room freshener with food items - ROOM FRESHENER WITH FOOD ITEMS

Room Freshener With Food Items : నారింజ తొక్కలు, కాఫీ పౌడర్ వంటి ఆహార పదార్థాలు కేవలం తినడానికి, తాగడానికి మాత్రమే కాదు. మన ఇంటిని, బాత్రూంను శుభ్రంగా, సువాసనభరితంగా మార్చేందుకు కూడా ఉపయోగపడతాయట. అదెలానో చూద్దాం.

Homemade Bathroom Freshener
Homemade Bathroom Freshener (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 24, 2024, 3:50 PM IST

Room Freshener With Food Items : మనకు పనికిరావని పడేసేవి, కేవలం తినడానికి మాత్రమే ఉపయోగపడతాయి అనుకునే కొన్ని పదార్థాలు మన ఇంటిని, బాత్రూంను శుభ్రంగా, సువాసనభరింతంగా మార్చుతాయని మీకు తెలుసా? అవును! తరచుగా మనం చెత్తకుండీలో పడేసే నారింజ తొక్కలు మొదలుకొని రోజూ మనల్ని రిఫ్రెష్ చేసే కాఫీ పౌడర్ వరకు మన బాత్రూంలోని దుర్వాసనను పొగొట్టే కొన్ని ఆహార పదార్థాలున్నాయట.

నిమ్మకాయ:
సహజంగా సువాసన కలిగి ఉండే నిమ్మకాయకు దుర్వాసనను గ్రహించే శక్తి ఉంటుంది. అందుకే మనం వాడి పడేసే నిమ్మతొక్కలు, లేదా నిమ్మకాయ ముక్కలను గానీ లేదంటే నిమ్మకాయ రసాన్ని గానీ గిన్నెలో వేసి బాత్రూంలో ఉంచారంటే దుర్వాసన మాయమైపోతుందట. గిన్నెను గాలి తగిలే చోట అంటే బాత్రూం కిటికీ దగ్గరలో పెడితే మరింత మంచి ఫలితం కనిపిస్తుందట.

బేకింగ్ సోడా:
వాసనను పోగట్టడంలో బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మకాయలను ఎండబెట్టి పొడి చేసి దాంట్లో కొంచెం బేకింగ్ సోడా వేసి బాత్రూంలో ఉంచితే గాలంతా తాజాగా సువాసనభరితంగా మారుతుంది. దుర్వాసన అనేదే రాదు.

కాఫీ గ్రౌండ్స్:
కాఫీ గ్రౌండ్స్ కూడా దుర్వాసనను గ్రహించి సువాసన అందించే లక్షణాలను కలిగి ఉంటాయి. ఒక చిన్న గిన్నెలో కాఫీ పొడి వేసి బాత్రూం కిటికీ దగ్గర ఉంచారంటే మీ బాత్రూం ఎక్కువ కాలం పాటు సువాసన వెదజల్లుతుంటుంది.

పుదీనా ఆకులు:
పుదీనా ఆకులతో పాటు కొన్ని లవంగాలను పొడి చేసి ఒక గిన్నెలో వేయాలి. వీటిని బాత్రూంలో ఉంచితే దుర్వాసన పోయి తాజాగా సువాసనభరితంగా మారుతుంది.

నారింజ తొక్కలు:
బాత్రూం కిటికీల దగ్గర నారింజ తొక్కలు, కర్పూరం కలిపి ఉంచాలి. ఇలా చేస్తే చెడు వాసన పోయి చక్కటి సువాసన రావడమే కాకుండా హానికరమైన కీటకాల నుంచి రక్షణ లభిస్తుంది.

టీ బ్యాగ్స్:
టీ బ్యాగులను తీసుకుని ఏదైనా నూనెలో ముంచి గిన్నెలో పెట్టాలి. దీన్ని బాత్రూం కిటికీ దగ్గర ఉంచారంటే దుర్వాసనంతా పోయి సువాసనతో కూడిన గాలిని మీరు ఆస్వాదించవచ్చు.
ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ బాత్రూంలో వీటిని ఉంచండి దుర్వాసనను తరిమి కొట్టండి.

నూడుల్స్ తరచుగా తింటున్నారా? వెంటనే ఆపేయండి! లేకుంటే ఏమవుతుందో తెలుసా? - Noodles Health Effects

అన్నం వండేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా? అయితే చాలా బెనిఫిట్స్ మిస్ అయినట్లే! - Mistakes Of Cooking Rice

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.