ETV Bharat / health

అలర్ట్ : వర్షాకాలం మీ కళ్లకు ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్స్​ సోకే ఛాన్స్ - ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా? - Monsoon Eye Care Tips

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 10:26 AM IST

Eye Care Tips in Monsoon : ఇతర సీజన్లతో పోల్చుకుంటే వర్షాకాలంలో ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ కాలంలో కేవలం సీజనల్‌ వ్యాధులే కాకుండా.. కంటి ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అందుకే.. కంటి సంరక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Common Eye Problems In Monsoon
Eye Care Tips in Monsoon (ETV Bharat)

Common Eye Problems In Monsoon : వానాకాలంలో సీజనల్ వ్యాధులతోపాటు వైరస్​లు, బ్యాక్టీరియాల కారణంగా కంటి ఇన్ఫెక్షన్లు సోకే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు. అలాంటి వాటిలో ప్రధానంగా వచ్చే కొన్ని కంటి(Eye) సమస్యలు ఇక్కడ ఉన్నాయి. అలాగే, వర్షాకాలంలో వచ్చే కంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కళ్ల కలక : ఈ కాలంలో చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఇది ఒకటి. వైరస్‌ ద్వారా సంక్రమిస్తుంది. దీని లక్షణాలు.. కళ్లు బాగా మండిపోవడం, ఎర్రబడడం, నీళ్లు కారడం. ఈ ఇన్ఫెక్షన్ సోకితే సరిగ్గా చూడలేరు. పైగా ఇది గాలి ద్వారా ఇతరులకు ఈజీగా సోకుతుంది. కాబట్టి వీలైనంతవరకు నల్ల కళ్లజోడు పెట్టుకోవాలి. కర్చీఫ్‌లు, టవల్స్ వంటివి ఎవరివి వారివే యూజ్ చేయడం మంచిది.

స్టైస్ : కనురెప్ప పై భాగంలో లేదా కంటి లోపలి భాగంలో అప్పుడప్పుడు మొటిమల్లా ఎర్రటి చీము గడ్డలు ఏర్పడుతుంటాయి. వీటినే ‘స్టైస్’ అని అంటారు. సరైన మెడిసిన్ తీసుకుంటే రెండు రోజుల్లో ఈ ప్రాబ్లమ్ తగ్గిపోతుంది. కానీ, ఆ టైమ్​లో కళ్లు మూసుకుపోతాయి. బాగా నొప్పిగా ఉంటుంది. అసలు చూడలేం. అందుకే దీని బారినపడకుండా చూసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

కార్నియా అల్సర్ : స్టైస్‌ మాదిరిగానే కార్నియాపై చీము గడ్డలు ఏర్పడి బాగా ఇబ్బంది పెడుతుంటాయి. ఆ టైమ్​ చూపు కూడా సరిగా ఉండదు. పైవాటితో పోల్చుకుంటే కార్నియా అల్సర్‌ విషయంలో కొంచెం అలర్ట్​గా ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. కార్నియా అనేది కళ్లలో అతి ముఖ్యమైన పార్ట్. కాబట్టి సరైన వైద్యం తీసుకోకపోతే శాశ్వతంగా కంటిచూపును కోల్పోయే ఛాన్స్ ఉంటుందంటున్నారు. వీటితో పాటు వానాకాలం డ్రై ఐస్​తో పాటు మరికొన్ని బ్యాక్టీరియల్ / వైరల్ ఇన్ఫెక్షన్లు వ్యాపించే ఛాన్స్ లేకపోలేదంటున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి :

వ్యక్తిగత పరిశుభ్రత : ముఖం తుడుచుకునేందుకు ఎల్లప్పుడూ శుభ్రమైన టవల్స్‌, న్యాప్‌కిన్స్‌, చేతిరుమాళ్లనే యూజ్ చేయాలి. ఎప్పటికప్పుడు చేతులు కూడా శుభ్రంగా కడుక్కోవాలి. లేకపోతే బ్యాక్టీరియా కళ్లలోకి ప్రవేశించి వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు దారి తీసే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అలాగే కంటి రక్షణకు ఉపయోగించే టవల్స్, గ్లాసెస్‌, కాంటాక్ట్ లెన్స్‌లను ఇతరులతో షేర్ చేసుకోవద్దంటున్నారు.

పోషకాహారం : సరైన పోషకాహారం తీసుకోవడం కూడా కంటి ఇన్ఫెక్షన్లు బారిన పడకుండా కాపాడడంలో కీలకపాత్ర పోషిస్తుందంటున్నారు. ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ బలోపేతం చేసే ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

అలర్ట్ : కంటిచూపు మందగిస్తోందా? - ఇలా చేస్తే పిక్చర్​ క్లియర్!

కాంటాక్ట్‌ లెన్స్‌లు వద్దు! : ఇవి వాడడం వల్ల కళ్లు పొడిబారతాయి. అందుకే.. ఇవి వాడే వారి కళ్లు బాగా ఎరుపెక్కి కనిపిస్తుంటాయి. తీవ్రమైన చికాకు కూడా వస్తుంటుంది. కాబట్టి, వర్షాకాలంలో వీటిని వాడకపోవడమే మేలు అంటున్నారు నిపుణులు. మరీ తప్పదనుకుంటే మాత్రం లెన్స్‌ను శుభ్రంగా తుడిచి, పొడిగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

2017లో "కంటాక్ట్ లెన్స్ & ఆంటీయర్ ఐ" అనే జర్నల్​లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. వర్షాకాలంలో కాంటాక్ట్ లెన్స్ ధరించే వ్యక్తులు కళ్లు దురద, ఎరుపు, నీరు కారడం వంటి అలెర్జీ లక్షణాలను అనుభవించే అవకాశం ఎక్కువ అని కనుగొన్నారు. ఈ పరిశోధనలో తైవాన్​లోని టైపీ మెడికల్ యూనివర్సిటీ ఆసుపత్రిలో ఆఫ్తాల్మాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేసే డాక్టర్ చాంగ్-చెన్ లిన్ పాల్గొన్నారు. వానాకాలం కాంటాక్ట్ లెన్స్​లు వాడడం కంటి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని ఆయన పేర్కొన్నారు.

సన్‌గ్లాసెస్ : వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి కళ్లను కాపాడడంలో సన్‌గ్లాసెస్‌ చాలా బాగా ఉపయోగపడతాయంటున్నారు. కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు వీటిని ధరించడం బెటర్ అంటున్నారు.

చల్లని నీటితో శుభ్రం చేసుకోండి : డైలీ శుభ్రమైన చల్లని వాటర్​తో కళ్లను శుభ్రం చేసుకోవాలి. చాలా మంది నిద్ర లేచినప్పుడు, కాంటాక్ట్ లెన్స్‌లను తొలగించినప్పుడు కళ్లను గట్టిగా రుద్దుకుంటుంటారు. కానీ, ఇలా చేయవద్దంటున్నారు. ఎందుకంటే.. ఇలా చేయడం వల్ల కార్నియా శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

సరిగ్గా నిద్రపోకపోతే కంటి ఆరోగ్యం షెడ్డుకే? ఇవి పాటిస్తే బిగ్​ రిలీఫ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.