Leg Swelling Indicates Nephrotic Syndrome: మనిషి శరీరంలో గుండె తర్వాత అత్యంత కీలకంగా పని చేసే అవయవాలలో కిడ్నీలు ఒకటి. ఇవి మన శరీరంలో జీవక్రియల ద్వారా ఏర్పడిన వ్యర్థాలను తొలగిస్తాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కిడ్నీలు.. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు వంటి వివిధ కారణాల వల్ల పాడైపోతున్నాయి. దీనివల్ల.. చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యను తొందరగా గుర్తించి చికిత్స తీసుకోకపోతే తర్వాత పరిస్థితి వేరేగా ఉంటుందని అంటున్నారు. కిడ్నీల సమస్యను గుర్తించడానికి మన శరీరం కొన్ని సంకేతాలు పంపిస్తుందని.. అందులో ముఖ్యమైనది కాళ్ల వాపు అని అంటున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
కాళ్ల వాపు కిడ్నీల వ్యాధికి ముందస్తు సంకేతం దిల్లీకి చెందిన నెఫ్రాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రవి బన్సాల్ అంటున్నారు. వైద్య పరిభాషలో ఈ సమస్యను నెప్రోటిక్ సిండ్రోమ్ అంటారట. నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనేది మూత్రపిండాలలోని ఫిల్టర్లు దెబ్బతిన్నప్పుడు సంభవించే ఒక పరిస్థితి. ఈ ఫిల్టర్లు రక్తం నుంచి వ్యర్థ పదార్థాలు, అదనపు నీటిని ఫిల్టర్ చేస్తాయి. ఫిల్టర్లు దెబ్బతిన్నప్పుడు, అవి చిన్న ప్రొటీన్ అణువులను మూత్రంలోకి వెళ్లనిస్తాయి. ఇది శరీరంలో ద్రవం పేరుకుపోవడానికి, కాళ్లు, మోకాళ్లలో వాపు వంటి ఇతర లక్షణాలకు దారితీస్తుందని అంటున్నారు.
2021లో జర్నల్ ఆఫ్ అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం కాళ్ల వాపు ఉన్న వ్యక్తుల్లో నెప్రొటిక్ సిండ్రోమ్ వచ్చే అవకాశ ఎక్కువ అని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యునివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో నెఫ్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జాన్ స్మిత్ పాల్గొన్నారు. కాళ్ల వాపు ఉన్న రోగులకు నెప్రొటీక్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
నెఫ్రోటిక్ సిండ్రోమ్ యొక్క లక్షణాలు:
- కాళ్లు, మోకాళ్లు, చీలమండలాల్లో వాపు
- మూత్రంలో ప్రొటీన్ స్థాయిలు ఎక్కువగా ఉండటం
- తరచుగా మూత్ర విసర్జన
- మూత్రంలో రక్తం
- ఆకలి లేకపోవడం
- వికారం, వాంతులు
- అలసట
క్రియాటినిన్ పెరిగితే కిడ్నీలు ఖతమే - ఇలా నేచురల్‌గా తగ్గించుకోండి!
నెఫ్రోటిక్ సిండ్రోమ్ కారకాలు: సాధారణంగా అధిక రక్తపోటు, మధుమేహ రోగులకు కిడ్నీ సంబంధిత సమస్యలు ఉంటాయి. ఎందుకంటే అధిక రక్తపోటు రక్తనాళాలను సంకోచించగలదు. ఇది మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. డయాబెటిక్ పేషెంట్లలో, రక్తంలో అదనపు చక్కెరను ఫిల్టర్ చేయడానికి కిడ్నీ ఎక్కువగా పని చేయాల్సి ఉంటుంది. అయితే ఇవే కాకుండా..
గ్లోమెరులోనేఫ్రిటిస్: ఇది మూత్రపిండాలలోని ఫిల్టర్ యూనిట్లకు నష్టం కలిగించే ఒక వ్యాధి. ఇది ఇన్ఫెక్షన్లు, ఆటోఇమ్యూన్ వ్యాధులు వంటి అనేక కారణాల వల్ల సంభవించవచ్చని నిపుణులు అంటున్నారు.
లూపస్: ఇది ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి. ఇది శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేస్తుందని అంటున్నారు.
అంటువ్యాధులు: హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వంటి కొన్ని అంటువ్యాధులు మూత్రపిండాలకు నష్టం కలిగించవచ్చని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు - మీ కిడ్నీలు పది కాలాల పాటు సేఫ్!
అలర్ట్ : కిడ్నీ సమస్యలకు ముఖ్య కారణాలివే! - అస్సలు లైట్‌గా తీసుకోవద్దు!