ETV Bharat / health

హార్ట్ అటాక్ వచ్చినవారు ఎక్సర్​సైజ్​ చేయొచ్చా? వైద్యులేం చెబుతున్నారు ? - how to prevent heart attack

Exercise For Heart Attack Patients : ఈ కాలంలో చాలా మందికి గుండె జబ్బులు వస్తున్నాయి. అయితే ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత తిరిగి వ్యాయామం చేయొచ్చా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనికి సమాధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Exercise For Heart Attack Patients
Exercise For Heart Attack Patients
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 12, 2024, 8:48 AM IST

Exercise For Heart Attack Patients : హార్ట్ అటాక్ వచ్చి తగ్గిపోయిన తర్వాత వ్యాయామం చేయొచ్చా? అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. అలాంటి వారికి కార్డియాలజిస్టులు ఇచ్చే సలహా ఏంటంటే గుండెకు సంబంధించిన వ్యాయామాలతో పాటు నార్మల్​ ఎక్సర్​సైజులు కూడా చేయాలి. అయితే సాధారణంగా ఎక్సర్​సైజ్​ చేసే వాళ్లకి గుండె జబ్బు వచ్చి తగ్గిపోయిన వాళ్లు చేసే వ్యాయామాలకు చాలా తేడా ఉంటుందని వైద్యులు అంటున్నారు.

హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే గుండె పంపింగ్ తగ్గిపోవడం. ఇది తగ్గిపోవడం వల్ల సాధారణంగానే ఆయాసం రావడం, కాళ్లు వాపులు రావడం లాంటి సమస్యలు వచ్చే అవకాశముంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి వారు ఎక్సర్ సైజులను చేసే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

సాధారణ గుండె పంపింగ్ 55 శాతం ఉంటుంది. ఈ స్థాయి తగ్గటాన్ని 'ఎల్వీ డిస్ ఫంక్షన్' అంటారని డాక్టర్లు చెబుతున్నారు. ఇది ఎంతమేరకు తగ్గింది అని చెక్ చేసుకుని వ్యాయామం ప్రారంభించాలని సూచిస్తున్నారు. అది 30 శాతం కన్నా తగ్గితే ఎక్కువ వ్యాయామం చేయకపోవడమే మంచిదని హెచ్చరిస్తున్నారు. ఒక 6 నిమిషాల పాటు నెమ్మదిగా నడవాల్సిన అవసరం ఉంటుందని, అంతకంటే ఎక్కువ వేగంగా చేయడం కూడా మంచిది కాదని అంటున్నారు.

"ఎల్వీ డిస్ ఫంక్షన్ లేని వారు నెమ్మదిగా వ్యాయామం చేయడం మొదలు పెట్టాలి. గుండెపోటు తర్వాత స్టంట్​ అమర్చడం విజయవంతంగా పూర్తయిన తరువాత హార్ట్ పంపింగ్ సాధారణంగానే ఉంటే వాళ్లు నడక స్టార్ట్ చేయవచ్చు. తర్వాతి కాలంలో నెమ్మదిగా నడక వేగాన్ని పెంచుతూ వ్యాయామాలు చేయవచ్చు. అయితే పంపింగ్ బలహీనంగా ఉన్నవారు మాత్రం ప్రధానంగా వాకింగ్ పైనే దృష్టి పెట్టాలి. ఈ వాకింగ్ కూడా ఒకేసారి ఎక్కువ దూరం చేయకుండా 5 నిమిషాలతో మొదలు పెట్టుకుని నెమ్మదిగా పెంచుకుంటూ పోవాలి. రోజుకి సుమారు 45 నిమిషాల నుంచి గంట సేపు చేయగలిగే విధంగా క్రమంగా పెంచాలి"

- డా. ముఖర్జీ, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్టు

అయితే హార్ట్ అటాక్ వచ్చి తగ్గిపోయిన వాళ్లు చికిత్స తీసుకున్న తర్వాత ప్రారంభ కాలంలోనే బరువులు ఎత్తడం మంచిది కాదు. నెల రోజుల లోపు ఎక్కువ బరువులు ఎత్తకుండా ఉంటే మంచిది. ఆ తర్వాత నెమ్మదిగా బరువులెత్తడం కూడా చేసుకోవచ్చు. ఓవరాల్​గా చెప్పాలంటే ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చి తగ్గిన తర్వాత వ్యాయామాలు చేయడం స్టార్ట్ చేస్తే మళ్లీ గుండెపోటు వచ్చే అవకాశం గణనీయంగా తగ్గే అవకాశముంది. అందుకే వైద్యులు కూడా ఇదే చెబుతారు. అనేక పరిశోధనల్లో కూడా తేలింది.

ఇందులోని ప్రధాన లక్షణం ఏంటంటే అటాక్ వల్ల డ్యామేజ్ అయిన కండరాన్ని కాపాడుకుంటూనే మళ్లీ రెండో సారి అటాక్ రాకుండా చూసుకోవాలి. ఈ రెండింటికీ వ్యాయామం అనేది ఒక దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది. చికిత్స అనంతరం మందులు ఎలా వాడతామో వ్యాయామం కూడా అంతే రెగ్యులర్ గా చేయాలి. పంపింగ్ స్థాయి బాగా ఉన్నవాళ్లు అధికశాతంలో ఎక్సర్ సైజు చేయవచ్చు కానీ పంపింగ్ శాతం తక్కువ ఉన్నవాళ్లు వైద్యుల్ని కలిసి సలహాలు తీసుకోవాలి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రెగ్నెన్సీ టైమ్​లో ఈ ఆహారం తింటున్నారా? - మీ బిడ్డ హెల్త్ డేంజర్​లో పడ్డట్టే!

మీ మానసిక ఒత్తిడికి - మీ గట్ సిస్టమే కారణం కావొచ్చని తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.