ETV Bharat / health

మీరు ఆరోగ్యంగా ఉండాలంటే - ఏడాదికోసారి ఈ 5 రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందే! - essential blood Tests for Everyone - ESSENTIAL BLOOD TESTS FOR EVERYONE

Everyone Should Be Done These Blood Tests Yearly : సాధారణంగా చాలా మంది శరీరంలో ఏవైనా అనారోగ్యకర లక్షణాలు కనిపించినప్పుడు మాత్రమే రక్త పరీక్షలు చేయించుకుంటుంటారు. కానీ.. కొన్ని ప్రాణాంతక వ్యాధులు లక్షణాలు పైకి కనిపించపోయినా లోలోపల పెరుగుతాయి. వీటిని ముందుగానే గుర్తించడానికి ప్రతిఒక్కరూ ఏడాదికోసారి ఈ ఐదు రక్త పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Everyone Should Be Done These Blood Tests Yearly
ESSENTIAL BLOOD TESTS FOR EVERYONE (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 1, 2024, 10:16 AM IST

Updated : Jun 1, 2024, 1:13 PM IST

Everyone Should Be Done These Blood Tests Every Year : ప్రతిఒక్కరూ అనారోగ్య సమస్య వచ్చిన తర్వాత కంగారుపడకుండా.. అది రాకముందే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. తద్వారా.. మీకేదైనా వ్యాధి వచ్చే అవకాశాలున్నాయేమో ముందుగానే తెలుసుకోవచ్చంటున్నారు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం అందరూ ప్రతి సంవత్సరం ఇప్పుడు చెప్పబోయే ఐదు రకాల రక్త పరీక్షలు(Blood Test) తప్పనిసరిగా చేయించుకోవాలంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కంప్లీట్ బ్లడ్ కౌంట్(CBC) పరీక్ష : మన బాడీలో రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్​లెట్ల సంఖ్యను తెలుసుకోవడానికి CBC పరీక్షను సిఫార్సు చేస్తుంటారు వైద్యులు. అలాగే ఈ టెస్ట్ మీ మొత్తం ఆరోగ్యం, రక్తహీనత, అంటువ్యాధులు, రక్తం గడ్డకట్టడానికి సంబంధించిన రుగ్మతల నిర్ధారణ గురించి అవసరమైన సమాచారాన్ని తెలియజేస్తుంది. అంతేకాదు.. ఈ పరీక్ష ప్రత్యేకంగా శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి ఎంతమొత్తంలో ఉందనే సమాచారాన్ని అందిస్తుంది.

లిపిడ్ ప్రొఫైల్ : ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాల్సిన మరో బ్లడ్ టెస్ట్.. లిపిడ్ ప్రొఫైల్. ఇది మీ కొలెస్ట్రాల్ స్థాయిలు, గుండె ఆరోగ్యానికి సంబంధించిన ఇతర లిపిడ్ మార్కర్లను అంచనా వేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయా? తక్కువగా ఉన్నాయా? అనే విషయంలో క్లారిటీ వస్తుంది. ఫలితంగా తగిన చర్యలు తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.

గ్లూకోజ్ పరీక్ష : రక్తంలో చక్కెర స్థాయిలను అంచనా వేయడానికి, మధుమేహం లేదా ప్రీడయాబెటిస్​ను గుర్తించడంలో ఈ పరీక్ష సహాయపడుతుంది. అయితే, సాధారణంగా రెండు గ్లూకోజ్ టెస్ట్​లు ఉంటాయి. అందులో ఒకటి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్(FBS). ఇందుకోసం ఖాళీ కడుపుతో బ్లడ్ తీసుకుంటారు. ఈ పరీక్ష ద్వారా శరీరానికి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ చేసే కెపాసిటీని తెలుసుకోవచ్చు.

మరో గ్లూకోజ్ పరీక్ష.. హిమోగ్లోబిన్ A1C. దీని ద్వారా రెండు నుంచి మూడు నెలల్లో మీ సగటు రక్తంలో చక్కెర స్థాయిలను తెలుసుకోవచ్చు. ఒకవేళ మీలో మధుమేహం లేదా ప్రీ డయాబెటిస్ ఉంటే ఇట్టే తెలిసిపోతుంది. దాంతో సరైన చికిత్స తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, నరాలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు.

గుండె పోటు ముప్పును ముందే పసిగట్టండిలా..

థైరాయిడ్ : మీరు ప్రతి సంవత్సరం చేయించుకోవాల్సిన మరో పరీక్ష.. థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్. మన బాడీలో థైరాయిడ్ గ్రంథి జీవక్రియ, శక్తి ఉత్పత్తి, వివిధ శారీరక విధుల నియంత్రణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదే ఈ గ్రంథి పనితీరులో ఏదైనా మార్పులు వస్తే అలసట, బరువులో మార్పులు, మానసిక సమస్యలు, హృదయ స్పందన రేటులో మార్పులు వంటి లక్షణాలకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. అదే మీరు ఏడాదికోసారి ఈ పరీక్ష చేయించుకోవడం థైరాయిడ్ గ్రంథి పనితీరు తెలుసుకోవచ్చు. అలాగే హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజమ్‌ వంటి సమస్యలు ఉంటే ముందస్తుగా గుర్తించి తగిన ట్రీట్​మెంట్ తీసుకోవడంలో సహాయపడతాయంటున్నారు.

సీఎంపీ టెస్ట్ : కాంప్రహెన్సివ్ మెటబాలిక్ ప్యానెల్ (CMP) టెస్ట్ అనేది.. మన బాడీలో వివిధ జీవక్రియల, అవయవాల పనితీరును అంచనా వేసే ఒక సమగ్ర రక్త పరీక్ష. ఈ టెస్ట్.. రక్తంలో గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్ (సోడియం, పొటాషియం, క్లోరైడ్, బైకార్బోనేట్), మూత్రపిండాల పనితీరు (క్రియాటినిన్, బ్లడ్ యూరియా నైట్రోజన్), కాలేయ పనితీరు (బిలిరుబిన్, అల్బుమిన్, కాలేయ ఎంజైమ్‌లు), ప్రోటీన్ స్థాయిలు సరైన మోతాదులో ఉన్నాయో లేదో తెలుసుకోవడంలో సహాయపడుతుందంటున్నారు నిపుణులు.

NOTE : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఎన్ని టెస్టులు చేసినా వ్యాధి ఏంటో తెలియట్లేదా? ఈ ఒక్క పరీక్షతో ఫుల్ క్లారిటీ! - Biopsy Test

Last Updated : Jun 1, 2024, 1:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.