Evening Workouts Helpful for Obesity People : ఉదయాన్నే జాగింగ్ చేయడం అన్ని విధాలా మంచిదని చాలా మంది భావిస్తారు. అయితే.. ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో వ్యాయామం ఉదయమే కాదు.. సాయంత్రం వేళ చేసినా కూడా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని తేల్చింది. ముఖ్యంగా ఊబకాయంతో బాధపడేవారు ఈవెనింగ్ వర్కౌట్స్ చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు మరిన్ని ఆరోగ్యప్రయోజనాలు పొందుతారని సూచిస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సాయంత్రం వేళ వ్యాయామాలు చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చనే దానిపై ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు రీసెర్చ్ నిర్వహించారు. దాదాపు 8 సంవత్సరాలుగా 30 వేల మంది నుంచి డేటాను సేకరించి దాని ఆధారంగా పరిశోధనలు జరిపారు. ఈ అధ్యయనం 'డయాబెటీస్ కేర్' అనే జర్నల్ పేరుతో ప్రచురితమైంది. ఈ రీసెర్చ్‌లో సాయంత్రం 6 నుంచి మిడ్నైట్ మధ్య హృదయ స్పందన రేటును పెంచే తేలికపాటు ఏరోబిక్ వ్యాయమాల నుంచి శక్తివంతమైన శారీరక శ్రమను పెంచే వ్యాయామాలు చేసే వ్యక్తులలో.. అకాల మరణం, గుండె సంబంధిత జబ్బుల వల్ల మృతిచెందడం తక్కువగా ఉంటుందని కనుగొన్నారు.
ఇవి తింటే కరెంటు తీగలా సన్నగా మారిపోతారు! - ఏ ఆరోగ్య సమస్యా రాదు! - Low Calories Foods
ఈ పరిశోధనలో యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీలో ఫిజియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఏంజెలో సబాగ్ పాల్గొన్నారు. అధిక బరువు లేదా ఊబకాయం గుండెపోటు, స్ట్రోక్ వంటివి రావడానికి ఎక్కువ దారితీస్తుందన్నారు. కాబట్టి, అలాంటి వారు ఈవెనింగ్ టైమ్‌లో వ్యాయామాలు చేయడం ద్వారా బరువు తగ్గడమే కాకుండా, గుండె జబ్బుల ప్రమాదాల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. అయితే.. ఊబకాయం తగ్గించుకోవడానికి వ్యాయామం ఒక్కటే పరిష్కారం కాదని.. దానితో పాటు జీవనశైలిలో కొన్ని మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని డాక్టర్ సబాగ్ సూచించారు.
సాయంత్రం వ్యాయామం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :
- సాయంత్రం సమయంలో చేసే వ్యాయామాలు ఊబకాయంతో సంబంధం ఉన్న మధుమేహంతోపాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయని కనుగొన్నారు.
- అదేవిధంగా బరువు తగ్గడంలోనూ సాయంత్రం పూట చేసే వ్యాయామాలు చాలా బాగా ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.
- శారీరక శ్రమ విడుదల చేసే ఎండార్ఫిన్లు.. కండరాల సడలింపును ప్రోత్సహిస్తాయని చెబుతున్నారు.
- ఊబకాయం ఉన్న వ్యక్తులు సాయంత్రం పూట వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని, బరువు తగ్గడంలోనూ సహాయపడుతుందంటున్నారు.
- ఈవెనింగ్ వర్కౌట్స్ వల్ల అనారోగ్యకరమైన ఆహారాలు తినాలనే కోరికలను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. ఇది చాలా ముఖ్యమైనదని అంటున్నారు.
- మొత్తం మీద.. ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తులకు ఈవెనింగ్ వర్కౌట్ అనేది గేమ్-ఛేంజర్‌గా ఉంటుందని.. మెరుగైన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అనంత్ అంబానీ వెయిట్ లాస్ - ఇలా చేసి 108 కేజీలు తగ్గారు! - మీరూ ట్రై చేస్తారా?