ETV Bharat / health

మహిళలూ జర్నీ టైంలో మీ వెంట ఇవి తీసుకెళ్లండి - టాయిలెట్ ఇన్ఫెక్షన్లు రావు! - Travel Essentials For Women

Essential Things To Carry While Travelling : విహారయాత్రలకు వెళ్లినప్పుడు టాయిలెట్లు శుభ్రంగా లేకపోతే.. మహిళలు ఎంతో అసౌకర్యానికి గురవుతుంటారు. అంతేకాదు.. అపరిశుభ్రమైన టాయిలెట్స్​ యూజ్ చేయడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్.. మొదలైన సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి, అలాంటి టైమ్​లో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే జర్నీ సమయంలో మీ వెంట ఈ వస్తువులను తీసుకెళ్లాలని సూచిస్తున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

While Travelling Should Carry These Products
Essential Things To Carry While Travelling (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 25, 2024, 3:03 PM IST

While Travelling Should Carry These Products : మనం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. అయితే బయటకు వెళ్లినప్పుడు అన్ని సందార్భాల్లోనూ ఇది సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా ప్రయాణాలు(Journey) చేసేటప్పుడు, అత్యవసర సమయాల్లో మహిళలు వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో వివిధ ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. అలాంటి సందర్భాల్లో మీ దగ్గర కొన్ని ఉత్పత్తులను అందుబాటులో ఉంచుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అలాగే టాయిలెట్ ఇన్ఫెక్షన్లు(Infections) కూడా రావని సూచిస్తున్నారు నిపుణులు. ఇంతకీ, ప్రయాణాలు చేసేటప్పుడు మహిళల దగ్గర ఉండాల్సిన ఆ ప్రొడక్ట్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇంటిమేట్‌ పౌడర్లు : ఫ్యామిలీ, ఫ్రెండ్స్​తో విహారయాత్రలకు వెళ్లినప్పుడు కొన్ని ప్రాంతాల్లో కూల్​గా ఉంటే.. మరికొన్ని ప్రదేశాల్లో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి టైమ్​లో చెమట ఎక్కువగా వస్తుంది. ఫలితంగా ర్యాషెస్‌, అలర్జీలు వచ్చే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వ్యక్తిగత భాగాలు పొడిగా ఉంచుకోకపోతే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయని చెబుతున్నారు. కాబట్టి, ఇలాంటి సమస్యల బారినపడకుండా ఉండాలంటే ప్రయాణాలు చేసేటప్పుడు ఇంటిమేట్‌ పౌడర్స్​ను వెంట తీసుకెళ్లడం మంచిదని సూచిస్తున్నారు. వాతావరణం ఉక్కపోతగా ఉన్నప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుందంటున్నారు.

ఇంటిమేట్‌ వైప్స్ : విహారయాత్రలు, బయటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు.. కొన్ని సందర్భాల్లో టాయిలెట్ల సౌకర్యం ఉండదు. మరికొన్ని సందర్భాల్లో శుభ్రమైన వాటర్ లభించదు. ఇలాంటి టైమ్​లో జననేంద్రియాలను శుభ్రం చేసుకోవడానికి 'ఇంటిమేట్‌ వైప్స్‌' అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. మార్కెట్లో ఇలాంటివి పలు బ్రాండ్లలో దొరుకుతున్నాయి. అంతేకాదు.. ఈ వైప్స్​లో రసాయనాలు కూడా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. కాబట్టి, బయటకు వెళ్లేటప్పుడు వీటిని హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకోవడం మంచిదంటున్నారు. అయితే, వీటిని యూజ్ చేసే ముందు ఒకసారి ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దని సూచిస్తున్నారు.

వెంటనే బాత్రూమ్​కు పరిగెత్తాల్సివస్తోందా? - కారణాలు ఇవే.. ఇలా తగ్గించుకోండి!

టాయిలెట్‌ శానిటైజర్స్ : సాధారణంగా మనం విహారయాత్రలకు వెళ్లినప్పుడు ఇతరులు వాడిన టాయిలెట్స్ ఎక్కువగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి, ఇలాంటి టైమ్​లో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు టాయిలెట్‌ సీట్‌ స్ప్రే శానిటైజర్ వెంట తీసుకెళ్లాలని చెబుతున్నారు.

టాయిలెట్‌ సీట్‌పై కూర్చునే ముందు దీనిని యూజ్ చేయడం ద్వారా టాయిలెట్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవచ్చంటున్నారు. అంతేకాకుండా.. వీటిలో సువాసనలు వెదజల్లే ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. ఫలితంగా వాష్‌రూమ్‌ నుంచి వచ్చే దుర్వాసన రాకుండా ఉంటుందని చెబుతున్నారు. ఆన్‌లైన్‌లోనూ ఇవి లభ్యమవుతున్నాయని సూచిస్తున్నారు.

అదేవిధంగా.. డిస్పోజబుల్‌ టాయిలెట్‌ సీట్‌ కవర్స్‌ని కూడా ఉపయోగించుకోవచ్చంటున్నారు. అయితే, వీటిని ఒక్కసారి మాత్రమే ఉపయోగించే వీలుంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే.. ఎక్కువ బరువూ ఉండవు. ఈజీగా తీసుకెళ్లొచ్చు. కాబట్టి, ప్రయాణాలు చేసేటప్పుడు మహిళలు వీటిని హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

2018లో 'అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. ప్రయాణాలు చేసే టైమ్​లో పబ్లిక్ టాయిలెట్స్​ వాడేటప్పుడు టాయిలెట్ శానిటైజర్లను ఉపయోగించే మహిళలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల (UTIs) బారిన పడే అవకాశం 50% తక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూఎస్​లోని వర్జీనియా కామన్‌వెల్త్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ డేవిడ్ డబ్ల్యూ. షోర్ పాల్గొన్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? - రోజూ ఇవి తింటే పిల్లలు పుట్టడం గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.