Benefits Of Eating Rice During Pregnancy : భారతీయుల ఆహారపు అలవాట్లలో ప్రధానమైంది ఏంటీ అంటే కచ్చితంగా అన్నం అని చెప్పచ్చు. కడుపు నిండా అన్నం తినందే కంటి నిండా నిద్రపట్టని వారు చాలా మంది ఉంటారు. అలాంటి అన్నం తినడం అన్ని సందర్భాల్లోనూ మంచిదేనంటారా? ప్రత్యేకించి ప్రెగ్నెన్సీ సమయంలో రైస్ తినడం వల్ల మంచితో పాటు నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
సాధారణంగా, గర్భధారణ సమయంలో మహిళలకు డయాబెటిస్(షుగర్) వచ్చే ప్రమాదముంటుంది. అందుకే చాలా మంది అన్నం తింటే షుగర్ వస్తుందేమోనని భయపడుతుంటారు. అలాంటి వారందరికీ గుడ్ న్యూస్. బ్రౌన్ రైస్ లేదా వైట్ రైస్ ఏదైనా గర్భధారణ సయమంలో నిర్భయంగా తినేయొచ్చట. బ్రౌన్ రైస్‌లో మెగ్నీషియం, న్యూట్రియంట్లు ఎక్కువగా ఉండి న్యూరో ట్రాన్స్‌మిషన్‌కు హెల్ప్ అవుతుంది. అది శిశువు మెదడు పనితీరు మెరగవడానికి సహకరిస్తుంది. గర్భధారణ సయమంలో అన్నం ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే సమస్య ఉందని చాలా మంది అపోహ పడుతుంటారు.
ప్రయోజనాలు
తక్షణ శక్తి : అన్నంలో ఎక్కువ మొత్తంలో కార్బొహైడ్రేట్స్ ఉండి శరీరానికి తక్షణ శక్తిని అందజేస్తాయి. అంటే ఇది మన శరీరానికి ఇందనంలా పనిచేస్తుంది.
ఎముకల్లో బలం : బియ్యంలో విటమిన్ డీ, రిబోఫ్లావిన్, థయామిన్ లాంటి పోషకాలు ఉంటాయి. వీటితో పాటుగా చాలా మినరల్స్, కాల్షియం, ఫైబర్, ఐరన్ రిచ్ ఫుడ్‌లు కలిగి ఉండి ఎముకల బలానికి తోడ్పడటమే కాకుండా పంటి ఆరోగ్యానికి దోహదపడుతుంది.
మలబద్ధకానికి దూరం : అన్నం తినడం వల్ల శరీరంలో మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెంది జీర్ణ క్రియ సాఫీగా జరిగేందుకు సహకరిస్తుంది. ఫలితంగా విరేచనం అయి మలబద్దకం, హేమరేజ్ లాంటి సమస్యలు దరిచేరవు.
యూరిన్ ఇన్ఫెక్షన్లు: గర్భంతో ఉన్న సమయంలో యూరినోజెనిషియల్ ఇన్ఫెక్షన్లు మీ శిశువులను బాధించవచ్చు. కానీ, బియ్యంలో ఉండే సహజ డైయూరెటిక్ స్వభావం ఆ సమస్య రాకుండా కాపాడుతుంది.
ఇమ్యూనిటీ పెరుగుదల : రైస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ తల్లులకు చాలా మేలు చేస్తాయి. ఇమ్యూన్ సిస్టమ్ మెరుగుపరిచి ఇన్ఫెక్షన్లు కలిగే అవకాశాన్ని దూరం చేస్తాయి. వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్‌లో 25.61శాతం ఎక్కువ యాంటీఆక్సిడెంట్ సామర్థ్యం ఉంటుందని తాజా అధ్యయనాల్లో తేలింది. గర్భిణీగా ఉన్నప్పుడు వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ తినడం వల్ల ప్రయోజనమెక్కువ అని తెలుస్తుంది.
షుగర్ లెవల్స్ : ఫైబర్స్ ఎక్కువగా ఉండే బ్రౌన్ రైస్ తినడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ తగ్గుతుంది. అలా రక్తంలో ఉండే షుగర్ లెవల్స్ నియంత్రణలోకి వస్తాయి.
నష్టాలు :
- అన్నం అధికంగా తినడం వల్ల బరువు పెరిగి ఒబెసిటీ వచ్చే ప్రమాదం ఉంది.
- బియ్యంలో అధికంగా సోడియం ఉంటుంది. దీని కారణంగా బీపీ పెరగొచ్చు. ఫలితంగా ఎక్లాంప్సియా కూడా రావొచ్చు. గర్భణీగా ఉన్నప్పుడు ఉప్పును తక్కువగా తీసుకోవడం మంచిది.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.