Eating Food Too Fast Effects : అసలే టైమ్ లేదు, తినడానికి ఏది ఉంటే అది పెట్టు వెంటనే తిని వెళ్లిపోవాలంటూ మనలో చాలామంది భోజనం చేసే సమయంలో హడావిడి చేస్తుంటారు. ఆహారం పెట్టుకున్న వెంటనే గబగబా తినేసి వెళ్లిపోతుంటారు. భోజనానికి కూడా సరిగ్గా సమయం కేటాయించకుండా, ఏదో కడుపు నింపాలి కదా అని చాలామంది ఇలా చేస్తుంటారు. అయితే ఇలా తినడం వల్ల నష్టం కలుగుతుందని అంటున్నారు వైద్యులు. గబగబా ఎందుకు తినకూడదో, ఎలా తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందో అనే విషయాలపై డాక్టర్లు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.
గబగబా తింటే జరిగేది ఇదే!
ప్రశాంతత లేని ఉరుకుల పరుగుల జీవితాల్లో భోజనానికి తగిన సమయం కేటాయించే పరిస్థితి లేదు. దీంతో చాలామంది టైం లేదనే సాకుతో గబగబా తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల ఆహారం ద్వారా శరీరానికి అందాల్సిన అన్ని రకాల పోషకాలు అందవని ప్రముఖ పోషకాహార నిపుణురాలు డా.స్వరూపారాణి చెబుతున్నారు. అలాగే గబగబా తినడం వల్ల ఆరోగ్యానికి కీడు జరుగుతుందని ఆమె హెచ్చరిస్తున్నారు.
ప్రక్రియ పూర్తికాకుండానే లోపలికి!
Eating Food Too Fast Symptoms : ఆహారాన్ని నోటి ద్వారా తీసుకునే సమయంలో నోటిలోనే చాలా వరకు ఆహారం జీర్ణం అవుతుందని, గబగబా తినడం వల్ల ఆహారాన్ని నమలడం జరగదని డాక్టర్లు వివరిస్తున్నారు. దీనితో నోటిలో ఆహారం జీర్ణం అవ్వదని అంటున్నారు. నిజానికి నోటిలో ఆహారం పళ్ల మధ్య కొంత వరకు జీర్ణం అవడమే కాకుండా సలైవాతో కలిసి మెత్తగా మారుతుంది. కానీ గబగబా తినడం వల్ల ఈ ప్రక్రియ పూర్తికాకుండానే ఆహారం జీర్ణాశయంలోకి చేరుతుంది.
దీని ఫలితంగా ఆహారం జీర్ణం అవడంలో అవరోధాలు ఏర్పడతాయి. దీంతో పొట్టలో గ్యాస్ లేదంటే ఎసిడిటీ సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు దీర్ఘకాలం పాటు వేధించేవి. గనుక ఆహారాన్ని గబగబా తినే వారిలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు.
"బిజీ లైఫ్ కారణంగా చాలామంది పొట్టలోకి ఏదో తోసేయాలనే ఉద్దేశంతో ఆహారాన్ని గబగబా తింటారు. ఇలా చేయడం వల్ల పొట్టలో గ్యాస్ సమస్య తలెత్తుతుంది. అలా కాకుండా ఆహారాన్ని నెమ్మదిగా తింటూ, బాగా నమిలి మింగితే ఆహారం త్వరగా జీర్ణం అవడమే కాకుండా అందులోని పోషకాలు అన్నీ శరీరానికి పూర్తిస్థాయిలో అందుతాయి."
-డా.స్వరూపారాణి, ప్రముఖ పోషకాహార నిపుణురాలు
గబగబా తినడం కాదు- ఇలా చెయ్యండి!
పూర్వకాలంలో భోజనానికి తగిన సమయం కేటాయించేవారు. అప్పట్లో ప్రశాంతంగా నేల మీద కూర్చొని ఆహారాన్ని ఆస్వాదిస్తూ, బాగా నమిలి తినే వాళ్లు. ఇలా చేయడం వల్ల ఆహారాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించడమే కాకుండా బాగా నమిలి తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అందుకని పూర్వకాలం నాటి పద్ధతులనే ఇప్పుడు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. భోజనానికి నిర్దిష్టంగా కొంత సమయాన్ని కేటాయించాలని, ఆ సమయంలో ఇతర ఏ పనులు పెట్టుకోకూడదని కూడా వైద్యులు సలహా ఇస్తున్నారు.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కుక్కను పెంచుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్! ఈ విషయం మీకు తెలుసా? - Health Benefits Of Having A Dog