Eating Food Too Fast Effects : ప్రస్తుత కాలంలో చాలా మంది జనాలు ఉదయం నుంచి రాత్రి వరకు టైమ్‌తో పోటీపడి మరి పరిగెడుతున్నారు. దీంతో కనీసం భోజనం చేసేటప్పుడు కూడా ప్రశాంతంగా కూర్చుని తినడం లేదు. టైమ్ లేదనే కారణంతో గబగబా తింటున్నారు. అయితే, ఇలా వేగంగా తినడం వల్ల మంచి కంటే కీడే ఎక్కువగా జరుగుతుందని నిపుణులంటున్నారు. ఫాస్ట్‌గా ఫుడ్ తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ సమస్యలు ఏంటి? ఈ అలవాటును ఎలా మానుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఫాస్ట్‌గా తినడం వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ :
బరువు పెరిగే ఛాన్స్ : వేగంగా తినడం వల్ల మనం ఎంత తింటున్నాము అనేది మెదడు గ్రహించలేదు. దీనివల్ల ఎక్కువగా తింటారని నిపుణులంటున్నారు. మన శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువగా ఆహారం తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
జీర్ణ సమస్యలు : మనం తినే ఆహారాన్ని బాగా నమలి తినడం వల్ల ఆహారం తొందరగా జీర్ణమవుతుంది. అయితే, వేగంగా తినేవారు ఆహారాన్ని నమలకుండానే మింగుతుంటారు. దీనివల్ల జీర్ణ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు పేర్కొన్నారు.
చక్కెర స్థాయిలు పెరుగుతాయట : ఫాస్ట్‌గా భోజనం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. ముఖ్యంగా ఎక్కువ కార్బోహైడ్రేట్స్, లేదా షుగర్ ఉండే ఆహారాన్ని తినేటప్పుడు షుగర్ లెవెల్స్ పెరుగుతాయని చెబుతున్నారు.
గుండె జబ్బుల ప్రమాదం : గబగబా ఆహారం తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలా వేగంగా తినే వారు మెటబాలిక్ సిండ్రోమ్‌ను కలిగి ఉంటారు. ఇది వారిలో గుండె జబ్బులు, స్ట్రోక్, డయాబెటిస్ వంటి జబ్బులకు దారితీస్తుందని చెబుతున్నారు. 2019లో 'హార్ట్' జర్నల్లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. వేగంగా తినే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం 23 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని 'చైనా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్'కు చెందిన డాక్టర్. జియాన్‌జున్ లి పాల్గొన్నారు. వేగంగా తినే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ ఫుడ్స్ తింటున్నారా? - అయితే మీకు బీపీ గ్యారెంటీ! - Worst Foods For Blood Pressure
ఈ అలవాటును ఎలా తగ్గించుకోవాలి ?
- ఫోన్, టీవీలు చూస్తూ భోజనం చేయకండి. ఇలా చేయడం వల్ల మీరు ఆహారం బాగా నమలకుండానే ఫాస్ట్‌గా తింటారు.
- అలాగే మీరు భోజనం చేసేటప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి తినేలా ప్లాన్ చేసుకోండి. వారితో కబుర్లు చెప్పుకుంటూ తింటే నెమ్మదిగా తినొచ్చు.
- భోజనం చేస్తున్నప్పుడు ఏదో ఆలోచిస్తూ గబగబా తినేయకండి. నెమ్మదిగా ఫుడ్‌లోని రుచిని ఎంజాయ్ చేస్తూ తినండి.
- బాగా ఆకలి వేసే వరకు వేచి చూడకండి. ఆకలి ఎక్కువగా ఉంటే గబగబా తినే అవకాశం ఉంటుంది. కాబట్టి, కొద్దిగా ఆకలి వేసినప్పుడే భోజనం చేయండి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
టమాటాలు రోజూ తింటే ఆరోగ్యానికి మంచిదేనా? - నిపుణులు ఏమంటున్నారు? - Tomatoes Health Benefits