ETV Bharat / health

డిన్నర్​కి "బ్రేక్​ఫాస్ట్"​ మంచిదేనా? - నిపుణులు సమాధానం మీ కోసం! - EATING BREAKFAST ITEMS AT NIGHT

-ఈ ఫుడ్​ తింటేనే మంచిదట - ఉపయోగాలు మీకోసం

Eating Breakfast Items at Night
Eating Breakfast Items at Night (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : Oct 11, 2024, 7:48 PM IST

Is it Good to Eat Breakfast Items at Night : చాలా మంది బరువు తగ్గేందుకు, హెల్దీగా ఉండేందుకు ఆహారం విషయంలో చాలా నియమాలు పాటిస్తుంటారు. ఈ క్రమంలోనే రాత్రి సమయంలో కూడా​ తేలికగా ఉండే ఆహారం తింటుంటారు. అయితే కొందరు బ్రేక్​ఫాస్ట్​ ఐటమ్స్​నే.. డిన్నర్​ టైమ్​లోనూ తీసుకుంటుంటారు. కాగా, ఉదయం తినే అన్ని రకాల అల్పాహారాలు డిన్నర్​కి సెట్​ కావని నిపుణులు చెబుతున్నారు. ఏం కాదులే అని అన్నింటినీ తింటే కొన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. మరి డిన్నర్​లో ఎలాంటి టిఫెన్స్​​ తీసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

బ్రేక్​ఫాస్ట్​లో పోహా, ఇడ్లీ, వడ, పూరీ, దోశ వంటి చాలా ఐటమ్స్​ ఉంటాయి. డైలీ రోజుకో ఫుడ్​ తీసుకుంటుంటాం. అయితే రాత్రి డిన్నర్​లో లైట్​ ఫుడ్​ తినే వారు వీటిలో కొన్నింటిని మాత్రమే మెనూలో చేర్చుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు, ప్రొటీన్లు అందేలా చూసుకోవాలని అంటున్నారు. అందులో భాగంగా..

  • ఇడ్లీ, పోహా, ఉప్మా, ఆమ్లెట్‌, కిచిడీ వంటి పదార్థాల్లో ఫైబర్‌, ప్రొటీన్‌, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఎలాంటి అనుమానం లేకుండా వీటిని రాత్రి కూడా తినొచ్చని చెబుతున్నారు.
  • అలాగే కొంతమంది పెరుగులో పండ్ల ముక్కలు, నట్స్‌.. వంటివి కలుపుకొని బ్రేక్‌ఫాస్ట్‌ కంప్లీట్​ చేస్తారు. ఇలా రాత్రి పూట కూడా పెరుగులో పండ్ల ముక్కలు, నట్స్​ కలుపుకుని తింటే మంచిదంటున్నారు. ఈ విధంగా తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుందని. ఫలితంగా బరువు అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు.
  • శనగ పిండి దోశ కూడా ట్రై చేయవచ్చుంటున్నారు. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో ఉండే ఫైబర్‌.. జీర్ణశక్తిని పెంచి జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుందంటున్నారు. పైగా కేలరీలు కూడా ఇందులో తక్కువేనట.

వీటికి దూరంగా ఉండండి: పూరీ, వడ, పకోడీ, సమోసా, పరాఠా వంటి నూనె పదార్థాలు.. నైట్​ తినకూడదని చెబుతున్నారు. అలాగే బేకరీ ఐటమ్స్​, ప్యాన్​కేక్స్​ నైట్​ తినకుండా ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఉపయోగాలెన్నో!

  • నైట్​ లైట్​గా ఉండే బ్రేక్​ఫాస్ట్​లు తినడం వల్ల జీర్ణక్రియ బాగుంటుందని.. దీనివల్ల నిద్ర బాగా పడుతుందని చెబుతున్నారు.
  • రాత్రి సమయంలో తేలికగా జీర్ణమయ్యే, ఫైబర్‌ ఎక్కువగా ఉండే అల్పాహారాన్ని తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుందంటున్నారు.
  • 2018లో 'జర్నల్ ఆఫ్ క్లినికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. నైట్​ తేలికగా ఉండే ఆహారం తినడం వల్ల వల్ల గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) లక్షణాలు తగ్గిపోయి జీర్ణక్రియ మెరుగుపడుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో సెయింట్ లూయిస్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్​కు చెందిన 'డాక్టర్​ ఎం.క్లారెట్' పాల్గొన్నారు.
  • నేటి ఆధునిక జీవితంలో ఉద్యోగాలు, పని ఒత్తిడి కారణంగా చాలా మందికి రాత్రి భోజనం తయారుచేసుకునే సమయం ఉండట్లేదు. దీంతో ఫుడ్​ ఆర్డర్​ చేసుకుని తింటున్నారు. ఇలా తింటే హెల్త్​ పాడవుతుంది. ఇలాంటప్పుడు ఇంట్లోనే ఈజీగా ఇన్​స్టాంట్​గా బ్రేక్​ఫాస్ట్​లు రెడీ చేసుకుంటే మంచిదంటున్నారు.
  • నైట్​ తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చని సూచిస్తున్నారు.
  • అయితే నైట్ ఎలాగూ లైట్​ ఫుడ్​ తీసుకుంటున్నాం కదా అని ఎక్కువ మొత్తంలో లాగించేయడం, ఆలస్యంగా తినడం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో డాక్టర్ల సలహా మేరకు తీసుకునే ఆహారం మోతాదు నిర్ణయించుకోవడం, పడుకోవడానికి రెండు గంటల ముందే భోజనం ముగించడం మంచిదని చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

ఇంట్రస్టింగ్ : చాయ్ తాగితే బరువు పెరుగుతారా? - నిపుణులు ఏం చెబుతున్నారు!

ఒక్క పీస్​తో మొదలు పెట్టి.. మొత్తం తినేస్తున్నారా? - కోరిక ఆపుకోలేక పోతున్నారా? - దానికి కారణం ఇదేనట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.