ETV Bharat / health

ఫుడ్​ పాయిజన్​ అయిందా? డాక్టర్​ వద్దకు వెళ్లేముందు ఇంట్లో ఇలా చేస్తే బిగ్ రిలీఫ్! - Dos And Donts while Food Poisoning

Dos And Donts Of Food Poisoning : ఇంట్లో భోజనంతో విసిగి కొందరు, సరదాగా కొందరు బయటి ఆహారాలకు అలవాటుపడుతున్నారు. బయట తీసుకునే ఆహారాలు రకరకాల కారణాల వల్ల కలుషితం అవుతుంటాయి. ఫలితంగా ఫుడ్​ పాయిజన్​ అవుతుంటుంది. ఫుడ్​ పాయిజన్​ అయినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఫుడ్​ పాయిజన్​కు గురైనప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

Dos And Donts Of Food Poisoning
Dos And Donts Of Food Poisoning
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 15, 2024, 7:48 AM IST

Dos And Donts Of Food Poisoning : వీకెండ్​ వస్తే సరదాగా ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్​కు వెళ్లడం, ఇంట్లో భోజనంపై ఆసక్తి తగ్గి హోటల్​ భోజనం వైపు మళ్లడం లాంటివి ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి. కారణం ఏదైనా ఇంట్లో వండిన రుచి, శుచి కలిగిన ఆహారాలను కాదని చాలామంది బయట ఆహారాలకు అలవాటు పడుతున్నారు. అయితే బయట వండే ఆహారాలు కొన్నిసార్లు అనేక కారణాల వల్ల కలుషితం అవుతుంటాయి. శుభ్రంగా లేకపోవడం, నీరు కలుషితం అవ్వడం, వండే ఆహారాలు సరిగ్గా లేకపోవడం లాంటి కారణాల వల్ల ఫుడ్​ పాయిజన్​కు గురికావచ్చు.

ఫుడ్​ పాయిజన్​ లక్షణాలు ఇవే
హోటల్​ లేదా దాబా లేదా మరేదైనా బయటి ప్రదేశాల్లో వండిన ఆహారాలు కలుషితం అయినప్పుడు అవి తిన్న వారికి వాంతులు, విరేచనాలు ప్రధానంగా కనిపించే లక్షణాలు. వీటితో పాటు పొట్ట ఉబ్బరంగా అనిపించడం, అజీర్తి, కడుపులో ఇబ్బంది, పొట్టలో నొప్పి లాంటి లక్షణాలు ఉండవచ్చు. కొంతమందికి కళ్లు తిరగడం లాంటివి కూడా జరగవచ్చు. చాలా వరకు వాంతులు ఆగకుండా వస్తాయి. ఒళ్లంతా నీరసంగా అనిపిస్తుంది.

ఫుడ్​ పాయిజన్​ జరిగినప్పుడు ఏం చెయ్యాలంటే
అనుకోకుండా తీసుకున్న ఆహారం ఫుడ్​ పాయిజన్​ జరిగినప్పుడు వీలైనన్ని జ్యూస్​లు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా నిమ్మరసం కానీ పుదీనా రసం తీసుకోవడం వల్ల చాలా వరకు ఫుడ్​ పాయిజన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. తురుమిన అల్లం, కాస్త జీలకర్రను మజ్జిగలో కలిపి తీసుకోవడం మంచిది. ఇది కూడా మీ శరీరానికి మేలు కలుగజేస్తుంది. అలాగే దానిమ్మ గింజలకు పొట్టలో నొప్పిని తగ్గించే లక్షణాలు ఉంటాయి. కాబట్టి వాటిని కూడా ఫుడ్​ పాయిజన్​కు గురయ్యారని తెలిసిన వెంటనే తినవచ్చు.

అలాగే పెరుగు, నానబెట్టిన మెంతులు, బాగా పండిన అరటిపండు, తులసి ఆకుతో కాచిన టీ, బ్లాక్​ టీలను తాగడం వల్ల కూడా ఫుడ్​ పాయిజన్​ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఫుడ్​ పాయిజన్​ జరిగినప్పుడు నూనె పదార్థాలకు దూరంగా ఉండటం ఉత్తమం. అయితే ఫుడ్​ పాయిజన్​ జరిగినప్పుడు వైద్యులను సంప్రదించేలోపు పైన తెలిపిన చిట్కాలను పాటించడం ద్వారా ప్రమాద తీవ్రతను తగ్గించుకోవచ్చు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

చెవిలో ఏమైనా ఇరుక్కుందా? ఫస్ట్​ అసలేం చేయాలో తెలుసా?

కిలో బరువు తగ్గాలంటే ఎంత దూరం నడవాలి? ఎన్ని క్యాలరీలు కరిగించాలో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.