ETV Bharat / health

మేకప్ వేసుకుంటే - క్యాన్సర్ వస్తుందా?

Makeup Can Cause Cancer? : మహిళలు మేకప్ వేసుకోవడం సాధారణం. అయితే.. మేకప్​ కోసం ఉపయోగించే ప్రొడక్ట్స్ ద్వారా క్యాన్సర్ వస్తుందా? అనే సందేహాలు చాలానే ఉన్నాయి. మరి.. నిజంగా క్యాన్సర్ వస్దుందా? నిపుణులు ఏమంటున్నారు??

Makeup Can Cause Cancer
Makeup Can Cause Cancer
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2024, 4:53 PM IST

Makeup Can Cause Cancer? : అందానికీ.. ఆడవాళ్లకూ విడదీయలేని బంధం ఉంది. సింపుల్​గా చెప్పాలంటే బ్యూటీ సింబల్​ లేడీస్ అంటే అతిశయోక్తి కాదు. మరి.. ఇలాంటి ట్యాగ్​లైన్​ సొంతం చేసుకున్న ఆడవాళ్లు అందంగా కనిపించడానికి ఎంతగా ట్రైచేస్తారో తెలియనిది కాదు. ఇంటి నుంచి అడుగు బయటపెట్టాల్సి వస్తే.. బ్యూటీకి మెరుగులు దిద్దాల్సిందే. ఇక పార్టీలు, ఫంక్షన్స్ అంటే.. ఖచ్చితంగా మేకప్ అద్దాల్సిందే. అంతా బాగానే ఉంది. మేకప్​తో అందానికి అందం.. ఆనందానికి ఆనందం. కానీ.. ఆరోగ్యం సంగతేంటి? అన్నది ప్రశ్న.

అందం కోసం అలోవేరా మొదలు వంటింట్లోనే ఎన్నో నేచురల్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అలాంటి వాటితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్సూ ఉండవు. కానీ.. మేకప్ విషయానికి వస్తే లెక్క మారుతుంది. మార్కెట్లో లభించే కెమికల్ ప్రొడక్ట్స్​తోనే మేకప్ వేసుకోవాల్సి ఉంటుంది. నామమాత్రంగా వాడే క్లెన్సర్స్​ నుంచి హెచ్​డీ, ఎయిర్​ బ్రష్ మేకప్​ వరకూ అన్నింటా కెమికల్స్ ఉంటాయి. మరి.. ఇవి నిండి ఉన్న మేకప్ తరచూ వేసుకుంటే అవి శరీరంపై ప్రభావం చూపించవా? దీర్ఘకాలంలో ఆరోగ్యానికి ఇబ్బంది కాదా? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి.

దీనికి నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ముఖానికి వేసుకునే మేకప్ ప్రొడక్ట్స్, ఇంకా జుట్టుకు వేసుకునే కలర్స్​లోనూ గతంలో అమ్మోనియా వినియోగించేవారు. ఇది ప్రమాదకరం. దీనివల్ల్ ఆరోగ్యం దెబ్బ తింటుంది. అయితే.. ఈ అమ్మోనియా వాడకాన్ని ప్రపంచవ్యాప్తంగా నిషేధించారు. ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న వస్తువులన్నీ.. అమ్మోనియా ఫ్రీగానే ఉంటున్నాయి. కాబట్టి.. మేకప్ వేసుకోవడం ద్వారా క్యాన్సర్ వస్తుందని భయపడాల్సిన పని లేదని చెబుతున్నారు.

అయితే.. చాలా మంది ఎప్పుడో పెళ్లిళ్లకు, లేదంటే ఏవైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు మాత్రమే మేకప్ వేసుకుంటారు. కానీ.. కొందరు తరచూ వేసుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు సినీ తారలు, స్టేజ్​ షోలు చేసేవాళ్లు రెగ్యులర్​గా వేసుకుంటారు. వీరితోపాటు హై-ప్రొఫైల్ మెయింటెయిన్ చేసేవాళ్లు కూడా తరచూ మేకప్ చేసుకుంటారు. ఇలాంటి వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవి ఏంటంటే...

మేకప్‌ వేసుకోవడానికి మీరు సెలక్ట్ చేసుకునే ప్రొడక్ట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడాలని చెబుతున్నారు. తక్కువ నాణ్యతగా ఉండే ప్రొడక్ట్స్​లో.. శరీరానికి హాని కలిగించే కెమికల్స్ ఉపయోగించే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. వాటి కారణంగా స్కిన్ ఇరిటేషన్‌, అలర్జీ, మచ్చలు వంటివి వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అదేసమయంలో.. మరో సూచన కూడా చేస్తున్నారు. అందరి చర్మతత్వం ఒకేవిధంగా ఉండదు కాబట్టి.. కొందరికి నాణ్యమైన మేకప్ ప్రొడక్ట్స్​ కూడా సరిపడకపోవచ్చని అంటున్నారు. అలాంటప్పుడు చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల.. ముందుగా ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకున్న తర్వాతే ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు.

వీటితోపాటుగా.. మేకప్‌ తొలగించడం పైనా సూచనలు చేస్తున్నారు. అవసరం తీరిపోయిన తర్వాత.. వెంటనే శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. అనవసరంగా ఎక్కువ సేపు ముఖంపై ఉంచుకోవడం వల్ల ఎఫెక్ట్ ఉంటుంది. అదేవిదంగా.. మేకప్ ఎంతవరకు అవసరమో అంతవరకే వేసుకోవాలని సూచిస్తున్నారు. ఇవి పాటిస్తే మంచిదని చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.